First OTT Platform In India: స్మార్ట్ టీవీ లేదా మొబైల్ స్క్రీన్ ఆన్ చేయగానే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా వంటి ఓటీటీల్లో నచ్చిన సినిమా ప్లే చేయడం మనకు ప్రతిరోజు పనిగా మారింది. థియేటర్లలో విడుదలైన కొన్ని వారాలకే తెలుగు సినిమాలు ఓటీటీ స్క్రీన్లపై ప్రత్యక్షమవుతున్నాయి.
1997లో అమెరికాలో డీవీడీల అద్దె వ్యాపారం

అయితే, భారత్‌లో అసలు ఓటీటీ విప్లవం ఎలా మొదలైంది? మన దేశంలో అడుగుపెట్టిన తొలి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏది? అనే ప్రశ్నలకు సమాధానం వెతికితే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తాయి. 1997లోనే అమెరికాలో డీవీడీల అద్దె వ్యాపారంతో నెట్‌ఫ్లిక్స్ తన ప్రయాణాన్ని ప్రారంభించగా, భారత్‌లో మాత్రం ఈ డిజిటల్ జోరు చాలా ఆలస్యంగా మొదలైంది.
2008లోనే రిలయన్స్ భారీ ప్రయోగం
ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ హవా నడుస్తున్న కాలంలో, భారతీయ డిజిటల్ మార్కెట్లో ఉన్న అవకాశాలను రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ముందుగానే గుర్తింది. 2008లో 'బిగ్ ఫ్లిక్స్' (BigFlix) పేరుతో మన దేశంలోనే మొట్టమొదటి ఓటీటీ వేదికను అందుబాటులోకి తెచ్చింది.
నెట్‌ఫ్లిక్స్ పేరును పోలి ఉన్నప్పటికీ, భారతీయ వీక్షకుల అభిరుచులకు తగినట్లుగా 'వీడియో ఆన్ డిమాండ్', 'మూవీ ఆన్ డిమాండ్' సేవలను అందించడం ప్రారంభించింది బిగ్ ఫ్లిక్స్. తెలుగు సహా తొమ్మిది భారతీయ భాషల్లో దాదాపు 2,000 పైగా హెచ్‌డీ సినిమాలను అందుబాటులో ఉంచారు.
కోట్లు వెచ్చించి ఓటీటీ హక్కులు
మన దేశంలోని వీక్షకులతో పాటు విదేశాల్లో ఉండే నివాస భారతీయులను (NRI) ఆకట్టుకోవడమే లక్ష్యంగా రిలయన్స్ ఈ సాహసానికి శ్రీకారం చుట్టింది. ధర్మా ప్రొడక్షన్స్, డిస్నీ, వియాకామ్18, రాజ్‌శ్రీ ప్రొడక్షన్స్ వంటి దిగ్గజ నిర్మాణ సంస్థలతో రూ.కోట్లు వెచ్చించి డిజిటల్ హక్కుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
ఆలోచన అద్భుతమే.. కానీ టైమింగ్ దెబ్బకొట్టింది!
బిగ్ ఫ్లిక్స్ తెచ్చిన ఐడియా ఎంతో వినూత్నమైనప్పటికీ, ఆ సమయానికి భారతీయ మార్కెట్ దానికి సిద్ధంగా లేదు. 2008 నుంచి 2012 మధ్యకాలంలో మనదేశంలో 2జీ, అరకొర 3జీ నెట్‌వర్క్‌లు మాత్రమే అందుబాటులో ఉండేవి. నేటిలాగా అపరిమిత డేటా ప్యాక్‌లు లేవు.
{{/usCountry}}బిగ్ ఫ్లిక్స్ తెచ్చిన ఐడియా ఎంతో వినూత్నమైనప్పటికీ, ఆ సమయానికి భారతీయ మార్కెట్ దానికి సిద్ధంగా లేదు. 2008 నుంచి 2012 మధ్యకాలంలో మనదేశంలో 2జీ, అరకొర 3జీ నెట్‌వర్క్‌లు మాత్రమే అందుబాటులో ఉండేవి. నేటిలాగా అపరిమిత డేటా ప్యాక్‌లు లేవు.
{{/usCountry}}ఒక జీబీ డేటా కోసం వందల రూపాయలు వెచ్చించాల్సి వచ్చేది. ఇంటర్నెట్ వేగం ఎంత తక్కువగా ఉండేదంటే.. చిన్న వీడియో ప్లే కావడానికే నిమిషాల తరబడి బఫరింగ్ అయ్యేది. అలాంటి రోజుల్లో పూర్తిస్థాయి హెచ్‌డీ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ చేయడం ప్రేక్షకులకు పెద్ద నరకంగా మారేది.
సొంత కంటెంట్ లేకపోవడం
నెట్‌వర్క్ వేగం తక్కువగా ఉండటం, డేటా ఛార్జీలు ఆకాశాన్ని తాకడం బిగ్ ఫ్లిక్స్‌కు పెద్ద ప్రతిబంధకంగా మారింది. దీనికితోడు బిగ్ ఫ్లిక్స్ ఓటీటీలో సొంత కంటెంట్ (Originals) లేకపోవడం మరో లోపంగా పరిణమించింది. కేవలం పాత సినిమాల లైబ్రరీపై మాత్రమే ఆధారపడటంతో వినియోగదారులను ఎక్కువకాలం నిలబెట్టుకోలేకపోయింది.
పోటీ ప్రపంచం.. సరికొత్త వ్యూహం
2016 నాటికి వేగవంతమైన ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం, డేటా ధరలు అందుబాటులోకి రావడంతో భారత మార్కెట్ వైపు అంతర్జాతీయ దిగ్గజాలు కన్నేశారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలు భారత్‌లోకి నేరుగా అడుగుపెట్టాయి. ఆకర్షణీయమైన యూజర్ ఇంటర్‌ఫేస్, వేల కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఒరిజినల్ వెబ్ సిరీస్‌లతో వచ్చి పడ్డాయి.
ఆ పోటీని తట్టుకోవడం బిగ్ ఫ్లిక్స్‌కు సాధ్యపడలేదు. 2017లో నెలకు రూ.50 లభించే చౌకైన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌తో బిగ్ ఫ్లిక్స్‌ను కొత్త రూపంలో రీ-లాంచ్ చేసినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత జియో సినిమా వంటి ప్రయోగాలు చేసిన రిలయన్స్, చివరకు డిస్నీ+ హాట్‌స్టార్‌ను దక్కించుకుని నేడు జియోహాట్‌స్టార్‌గా దేశంలోనే అతిపెద్ద ఓటీటీ సామ్రాజ్యంగా అవతరించింది.
భారత్‌లో తొలి ఓటీటీగా
సరైన ఆలోచన ఉన్నప్పటికీ, సరైన సమయం కాకపోవడం వల్ల బిగ్ ఫ్లిక్స్ విఫలమైనప్పటికీ.. భారత డిజిటల్ వినోద రంగానికి పునాది వేసిన తొలి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా చరిత్రలో నిలిచిపోయింది.