Friday Top OTT Release Movies Telugu Today: ఈ వీకెండ్ ఇంట్లోనే హాయిగా కూర్చుని వినోదాన్ని ఆస్వాదించాలనుకునే డిజిటల్ ప్రియులకు 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ బంపర్ ఆఫర్ తెచ్చాయి. ఇవాళ (అక్టోబర్ 30) ఓటీటీల్లో ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి.
టాప్ 5 ఓటీటీ సినిమాలు

కానీ, వాటిలో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ రెండు ఓటీటీల్లోనే టాప్ 5 క్రేజీ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అందులోనూ అవన్నీ తెలుగులో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. పొలిటికల్ యాక్షన్ కామెడీ, ఫాంటసీ మ్యాజిక్ థ్రిల్లర్, హై-స్టేక్స్ హీస్ట్ డ్రామా, ఫ్యామిలీ డ్రామా, క్రైమ్ ఇన్వెస్టిగేషన్.. ఇలా ఒక్కోటి ఒక్కోరకంగా ఈ 5 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ప్రతీ ఒక్కరి రుచికి తగ్గ విభిన్న కథాంశాలతో ఐదు క్రేజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
1. కామ్రేడ్ కళ్యాణ్ (Comrade Kalyan) – అమెజాన్ ప్రైమ్ వీడియో
1992 నాటి ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో సాగే శ్రీవిష్ణు పీరియాడిక్ యాక్షన్ కామెడీ చిత్రం 'కామ్రేడ్ కళ్యాణ్'. పోలీసుల కంటికి చిక్కకుండా తిరిగే ఒక నక్సలైట్ నాయకుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒకవైపు ఉత్కంఠభరితమైన పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతుంటే, మరోవైపు సదరు విప్లవ నేత విప్లవం కంటే ప్రేమ, సరదాలకే ఎక్కువ ప్రాధాన్యమివ్వడం ఈ చిత్రంలో అసలైన నవ్వులు పూయిస్తుంది. రాజకీయం, యాక్షన్, నవ్వుల కలబోతగా సాగే ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
2. అవరాచన్ అండ్ సన్స్ (Avaraachan & Sons) – నెట్‌ఫ్లిక్స్
{{/usCountry}}2. అవరాచన్ అండ్ సన్స్ (Avaraachan & Sons) – నెట్‌ఫ్లిక్స్
{{/usCountry}}కుటుంబ బంధాలు, సామాజిక సంబంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఫ్యామిలీ డ్రామా చిత్రం 'అవరాచన్ అండ్ సన్స్'. నిత్యం మద్యం, కల్లు, గంజాయి తాగుతూ చివరకు దొంగతనాలకు వెనుకాడని అవరాచన్ అనే వ్యక్తి నిర్లక్ష్య వైఖరి అతని కొడుకుల జీవితాలకు శాపంగా మారుతుంది. చిన్నతనం నుంచీ తండ్రి వల్ల పడ్డ అవమానాలు, కష్టాలు వారి జీవితాల్లో ఎలాంటి అశాంతిని నింపాయో, తండ్రీకొడుకుల మధ్య ఘర్షణలను డ్రామా, కామెడీ మిశ్రమంగా దర్శకుడు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ఆవిష్కరించారు.
3. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ (Don't Trouble The Trouble) – నెట్‌ఫ్లిక్స్
ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన ఫాంటసీ కామెడీ థ్రిల్లర్ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'. సూరి అనే మేజీషియన్ దివ్య అనే చిన్నారితో నవ్వులు పూయించే మాయాజాల విద్యలు చేస్తుంటాడు. అనుకోకుండా ఆ పాపకే నిజమైన శక్తులు రావడం మొదలయ్యాక సూరి జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. పాప వెనుక ఉన్న అలౌకిక శక్తులకు భయపడి పారిపోయే క్రమంలో ఉత్కంఠభరిత సన్నివేశాలు ఎదురవుతాయి. ఒక గులాబీ రంగు రాక్షసి జీనీ (మ్యాజిక్ ల్యాంప్)కి సంబంధించిన అసలు నిజం బయటపడటంతో ఈ కథ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మైండ్ బ్లాకింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది.
4. సిగ్మా (Sigma) – నెట్‌ఫ్లిక్స్
సమాజం పూర్తిగా అర్థం చేసుకోలేని ఒక వ్యక్తి తన గమ్యం వైపు సాగించే పోరాటమే 'సిగ్మా'. అడ్వెంచర్, క్రైమ్ హీస్ట్ (దొంగతనం) కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో గుప్తనిధుల అన్వేషణ, భారీ దొంగతనం ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. పక్కా ప్రణాళికతో సాగే నేర ప్రపంచంలో ప్రమాదాలు, అనుకోని మలుపులను దాటుకుంటూ నాయకుడు ఎలా గెలిచాడో చూపే సినిమా ఇది. దళపతి విజయ్ కొడుకు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సందీప్ కిషన్, ఫరియా అబ్ధుల్లా నటించారు. సిగ్మా నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
5. ఎస్ఐ యుగంధర్ (SI Yugandhar) – నెట్‌ఫ్లిక్స్
సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారి కోసం వచ్చిన ఆది సాయి కుమార్ చిత్రం 'ఎస్ఐ యుగంధర్'. అత్యంత ప్రామాణికంగా విధులు నిర్వహించే ఒక నిష్పాక్షిక పోలీస్ ఆఫీసర్ పరిధిలో ఒక అనుమానాస్పద శవం లభ్యమవుతుంది. ఆ కేసు విచారణ చేపట్టిన యుగంధర్, నగరపు చీకటి కోణాల్లో దాగున్న ఒక భారీ నేర ముఠా నెట్‌వర్క్‌ను ఎలా బయటపెట్టాడనేది అసలు కథ. కాలంతో పోటీ పడుతూ శత్రువుల నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కొని నిజాలను వెలికితీసే క్రమాన్ని దర్శకుడు ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించారు.
ఒకేరోజున ఓటీటీ రిలీజ్
ఇలా ఈ వీకెండ్ క్రైమ్, థ్రిల్లర్, కామెడీ, ఫాంటసీ వంటి మిస్ అవ్వకూడని ఈ చిత్రాలతో ఓటీటీ వాచ్‌లిస్ట్‌ను సిద్ధం చేసుకోవచ్చు. ఇందులో క్లోజ్ ఫ్రెండ్స్ అయిన సందీప్ కిషన్, ఆది సాయికుమార్ సినిమాలు ఒకేరోజు ఓటీటీ రిలీజ్ కావడం విశేషం.