ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి విషయం హాట్ టాపిక్‌గా మారింది. రష్మిక, విజయ్ వెడ్డింగ్ కార్డ్ కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ సమయంలో మరో జంట కూడా మూడుముళ్ల బంధంతో ఒక్కటి కానుంది.
బాలీవుడ్-క్రికెట్ ప్రపంచం

బాలీవుడ్-క్రికెట్ ప్రపంచం మరోసారి ఒక్కటి కానుంది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న బాలీవుడ్ నటి కృతికా కమ్రా, ప్రముఖ టెలివిజన్ ప్రజెంటర్, క్రికెట్ అనలిస్ట్, కామెంటేటర్ గౌరవ్ కపూర్ పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమయ్యారు. గతేడాది డిసెంబర్‌లో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించిన ఈ జంట ఈ ఏడాది మార్చిలో కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు.
ముంబైలో నిరాడంబరంగా వేడుక
మార్చి 11, 2026న ముంబైలోని గౌరవ్ కపూర్ నివాసంలో వైభవంగా కాకుండా అత్యంత ఆత్మీయుల మధ్య వీరి వివాహం జరగనుంది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో గౌరవ్ కపూర్, కృతికా కమ్రా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నారు. ఆ తర్వాత మార్చి 12న ముంబైలో సినీ, క్రికెట్ రంగ ప్రముఖుల కోసం ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.
ఆర్భాటంగా కంటే అర్థవంతంగా
"కృతిక, గౌరవ్‌లు తమ పెళ్లి ఆర్భాటంగా ఉండటం కంటే, అర్థవంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. సంప్రదాయాలకు విలువనిస్తూనే, తమ వ్యక్తిత్వానికి తగ్గట్లుగా వేడుకలు హుందాగా ఉండాలని ప్లాన్ చేశారు" అని ఈ జంటకు సన్నిహితంగా ఉండేవారు పేర్కొన్నారు.
గుట్టుగా సాగిన ప్రేమాయణం
కొన్ని నెలల పాటు డేటింగ్‌లో ఉన్న గౌరవ్, కృతికా జంట గతేడాది డిసెంబర్‌లో సోషల్ మీడియా వేదికగా తమ రిలేషన్‌షిప్‌ను కన్ఫర్మ్ చేశారు. ఇద్దరూ కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో వీరి ప్రేమ వార్త వెలుగులోకి వచ్చింది. అయితే, వీరిద్దరూ తమ వ్యక్తిగత విషయాల గురించి ఎక్కడా బహిరంగంగా ఎక్కువగా మాట్లాడలేదు.
కృతిక కెరీర్ విశేషాలు
ఇదిలా ఉంటే, 2007లో 'యహాన్ కే హమ్ సికందర్' సీరియల్‌తో కెరీర్ ప్రారంభించిన టీవీ నటి కృతికా కమ్రా 'కితనీ మొహబ్బత్ హై'తో స్టార్డమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత 'కుచ్ తో లోగ్ కహేంగే', 'రిపోర్టర్స్' వంటి హిట్ షోలతో మెప్పించింది.
ఓటీటీ సిరీస్‌లతో క్రేజ్
{{/usCountry}}ఇదిలా ఉంటే, 2007లో 'యహాన్ కే హమ్ సికందర్' సీరియల్‌తో కెరీర్ ప్రారంభించిన టీవీ నటి కృతికా కమ్రా 'కితనీ మొహబ్బత్ హై'తో స్టార్డమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత 'కుచ్ తో లోగ్ కహేంగే', 'రిపోర్టర్స్' వంటి హిట్ షోలతో మెప్పించింది.
ఓటీటీ సిరీస్‌లతో క్రేజ్
{{/usCountry}}'మిత్రో' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతికా 'తాండవ్', 'బంబాయ్ మేరీ జాన్', 'గ్యారహ్ గ్యారహ్' వంటి ఓటీటీ వెబ్ సిరీస్‌లతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా జియోహాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న 'ది గ్రేట్ షంసుద్దీన్ ఫ్యామిలీ' చిత్రంలో ఆమె కనిపించి అట్రాక్ట్ చేసింది.
మట్కా కింగ్ ఓటీటీ సిరీస్
ప్రస్తుతం విజయ్ వర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'మట్కా కింగ్' ఓటీటీ సిరీస్‌లో కృతిక కమ్రా కీలక పాత్ర పోషిస్తోంది. 1960ల నాటి ముంబై క్రైమ్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓటీటీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.