...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: శోభన ఇచ్చిన చెక్‌పై 50 కోట్లు రాసిన బాలు- గుడిలో 2 జంటల బాధలు- ప్రభావతి పంచాయతీ

Gunde Ninda Gudi Gantalu Serial July 14th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూలై 14వ ఎపిసోడ్‌లో శోభన డబ్బు గర్వంతో తెగ రచ్చ చేస్తుంది. దాంతో బ్లాంక్ చెక్‌పై ఒక్కో సున్నా పెంచుకుంటూ పోయి ఏకంగా 50 కోట్లు రాస్తాడు బాలు. శోభన తెగ భయపడిపోతుంది. గుడిలో అరుణ్ సుమతి, మురళి విద్య జంటలు కలుస్తాయి.

Published on: Jul 14, 2026, 07:34:01 IST
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో సత్యం ఇంటికి వచ్చిన శ్రుతి తల్లి శోభన గొడవ చేస్తుంది. అందరికి డబ్బు పిచ్చి పట్టిందని, అందుకే తన కూతురితో పని చేయిస్తున్నారని, బ్లాంక్ చెక్ ఇస్తుంది శోభన.

సంపాదించమని మాకు ఎవరు చెప్పలేదు

గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూలై 14 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూలై 14 ఎపిసోడ్

మీనా పూల డెకరేషన్, నేను పార్లర్, వీలైనప్పుడు ఫర్నిచర్ షాప్ చూసుకుంటున్నా. అలా సంపాదించమని మాకు ఎవరు చెప్పలేదని రోహిణి అంటుంది. నువ్వు చేసే పని డిగ్నిటీని తెస్తుంది. పూలమ్మేవాళ్లు, డ్రైవర్లు వీళ్లతో నా కూతురుని పోల్చుకోలేను అని శోభన అంటుంది.

ఏమ్మా పూలమ్మడం నేరమా పాపమా అని మీనా అంటుంది. మీ ఆయన అక్రమంగా సంపాదించిన సంపాదన చూసి చాలా గర్వంగా ఉన్నట్లుంది. శ్రుతి, రవి కూడా నిజాయితీగా సంపాదిస్తున్నారు. మీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని బాలు అంటుంది. నిజంగా మీరు డబ్బు కోసం పని చేయించకపోతే నా కూతురుతో పని మాన్పించండని శోభన అంటుంది.

ఏ మీరు మానిపించలేరా. మీ కూతురే కదా. పని మానిపించి ఇంట్లో కూర్చోబెట్టుకుని నెల నెల సారే పంపినట్లు చెక్కులు పంచండి అని మీనా అంటుంది. డబ్బుడబ్బ నీరో మూసుకుని వెళ్లమంటేనా ఇక్కడ ఈవిడ ఇలా చేస్తుందని. మేము ఎలాగు తీసుకోమన్న ధైర్యంతోనే చెక్కులు పట్టుకుని తిరుగుతున్నారా. అసలు అందులో డబ్బులు ఉన్నాయా అని బాలు అంటాడు.

50 కోట్లు రాసిన బాలు

ఐదు లక్షలు అంటే సెంటర్‌లో ఉన్న మా షాపింగ్ కాంప్లెక్స్‌కు వచ్చే రెంట్ అని శోభన గర్వంగా అంటుంది. తర్వాత ఇంకో సున్న పెడతాడు బాలు. దాంతో 50 లక్షలు అవుతాయి. 50 లక్షలా.. పరువుకోసం మూసుకోవాలా అని శోభన మనసులో అనుకుంటుంది. ఇంకో సున్న పెడతాడు బాలు. 5 కోట్లు అవుతుంది. అమ్మో ఆంటీ మీ ఆస్తి అమ్మన 50 కోట్లు రావేమో అని మనోజ్ అంటాడు.

వెళ్లి నాన్న అకౌంట్‌లో వేస్తాను బాలు అంటే.. శోభన ఆపుతుంది. ఏంటీ ఆటలుగా ఉందా. 50 కోట్లు అంటే మాటలా అని శోభన అంటే.. మీకుందా అని .. ఖాళీ చెక్ ఇచ్చినప్పుడు అంత ఆస్తి ఉన్నప్పుడు ఇవ్వాలని తెలియదా. డబ్బు ఉందని అహంకారమా అని బాలు అంటాడు. తర్వాత ఆ బ్లాంక్ చెక్ చింపి శోభనకున్న డబ్బు గర్వాన్ని దించుతాడు బాలు.

రవితో రెస్టారెంట్ పెట్టిస్తా

చెక్ చెంపి చేతిలో పెట్టి మేము ఎవరం ఏనాడు మీ సొమ్ముకోసం ఆధారపడలేదని బాలు అంటాడు. నా అల్లుడు రవితో డబ్బు ఇచ్చి రెస్టారెంట్ పెట్టిస్తానని శోభన అంటుంది. ఆ రవి డబ్బు తీసుకునేవాడైతే ఎప్పుడో హోటల్ పెట్టేవాడు. ఆయనది ఈ ఇంటి రక్తమే అని మీనా అంటుంది. నా కూతురు హోటల్‌లో పని చేయడం నచ్చట్లేదని శోభన అంటుంది.

అది మీ కూతురుకు మీరే నచ్చచెప్పుకోండని రోహిణి అంటుంది. అక్కడ చెప్పుకోలేకే ఇక్కడికి వచ్చిందని మీనా అంటుంది. చాల్లే ఆపండని ప్రభావతి అంటుంది. సరే కూర్చోండి కాఫీ తెస్తానని మీనా అంటే.. చేసిన మర్యాదలు చాలని వెళ్లిపోతుంది శోభన. బాలును పట్టుకుని నిన్ను ఎప్పుడు చూసిన గర్వంగా అనిపిస్తుందిరా అని సత్యం అంటాడు.

నాన్న ఏంట్రా నిన్నే మెచ్చుకున్నాడని మనోజ్ అంటే.. నేను ఆ చెక్ చింపేసాను. నువ్వయితే మింగేవాడివని బాలు అంటాడు. మరోవైపు గుడిలో కానిస్టేబుల్ అరుణ్‌ను సుమతి కలుస్తుంది. అదే గుడికి మురళిని విద్య తీసుకొస్తుంది. ఇప్పుడైనా మీ మనసాక్షి చెబుతుందా అని మురళి అంటే.. ఇంకాస్తా టైమ్ పడుతుందని విద్య అంటుంది.

ఐ లవ్యూ చెప్పేందుకు భయపడిన మురళి

దేవుడికి దండం పెట్టుకుంటారు. విద్యతో పెళ్లి చేయమని, చేస్తే పుట్టే పిల్లలకు తన పేరే పెట్టుకుంటామని మురళి కోరుకుంటాడు. అటువైపుగా సుమతి వాళ్లు అంటారు. విద్యను చూసి సుమతి షాక్ అవుతుంది. టెంకాయ, పూలు మర్చిపోయానని అరుణ్‌కి చెప్పి వెళ్తుంది సుమతి. అటు వెళ్లి దండం పెట్టుకుంటానని నేను వెళ్లి దండం పెట్టిన మనిద్దరి కోసం పెట్టినట్లేగా అని విద్య అంటుంది.

అంటే తన మనసులో నేను ఉన్నట్లే.. ఇదే ఇవాళ్టీకి పెద్ద ప్రసాదం అని మనసులో అనుకుంటాడు మురళి. విద్య వెళ్తుంది. అరుణ్‌ను వెళ్లి మురళి కలుస్తాడు. బాగున్నారా అని అడుగుతాడు. తరచు మనం ఇదే గుడిలో కలుస్తున్నాం. ఏదో బంధం ఉన్నట్లు ఉందని మురళి అంటాడు. ఓ బంధం కోసం ఎదురుచూస్తున్నాను అని ఇద్దరు లవ్ ప్రపోజల్ గురించి మాట్లాడుకుంటారు.

ముందు మనమే మన మనసులో మాట చెప్పాలి. లేకుంటే తర్వాత బాధపడాల్సి వస్తుందని అరుణ్ అంటాడు. అయితే, ఇవాళే చెప్పేస్తానని మురళి అనుకుంటాడు. ధైర్యం కావాలి ఎలాగైనా చెప్పాలని విద్య దగ్గరికి వెళ్లి.. ఐ.. ఐ.. అని కంగారుపడతాడు మురళి. సరే మళ్లీ కలుద్దామని విద్య అని వెళ్లిపోతుంది. మరోవైపు సుమతి అరుణ్ అర్చన చేయిస్తారు.

సుందరి పెళ్లి పనులు

మనసులో మాట చెప్పాను ఏం ఆలోచించారని అరుణ్ అంటే.. ఆలోచిస్తున్నానని సుమతి అంటుంది. మీ గురించి నాకు ఇంకా తెలియదు. కొన్ని రోజులు ఫ్రెండ్స్‌గా ఉందామని సుమతి వెళ్లిపోతుంది. అలా గుడిలో రెండు జంటలు తమ ప్రేమ బాధలు చెప్పుకుని వెళ్లిపోతాయి. మరోవైపు కామాక్షి ఇంట్లో సుందరి పెళ్లి పనుల గురించి బాలు, మీనాతో మాట్లాడతారు. డెకరేషన్ బడ్జెట్ ఎంత అవుతుందని రంగా అడుగుతాడు.

రంగా చాలా ఇబ్బంది పెట్టడంతో 20 వేలు అవుతుందని మీనా చెబుతుంది. ఈ పెళ్లి వల్ల నీకు ఖర్చులు పడకూడదని కామాక్షి అంటుంది. అయితే, 30 వేలు రాస్తానని రంగా అంటాడు. కార్లకు 6 వేలు అవుతుందని బాలు అంటాడు. 2 కార్లు నీవి మూడో కారుకు రెంట్ కట్టాలిగా, పది వేలు రాస్తున్నా అని రంగా అంటాడు. మేకప్ గురించి రోహిణికి బాలు కాల్ చేస్తాడు.

బ్రైడల్ మేకప్‌లో చాలా రకాలు ఉంటాయని రోహిణి అంటుంది. 12 వేలు మెటీరియల్ ఖర్చే అవుతుందని రోహిణి అంటుంది. ఫైనల్‌గా 12 వేలు అని బాలు అంటాడు. రంగా రాస్తాడు. ఇంతలో రంగాకు వియ్యంకుడు అని కాల్ వస్తుంది. అబ్బాయి వాళ్ల మావయ్య అని రంగా చెబుతాడు. స్పీకర్‌లో పెడతాడు రంగా. మటన్ కొట్టు మాణిక్యం మాట విని ఎక్కడో విన్నట్లుందని బాలు, మీనా అంటారు.

మాణిక్యం మాట విన్న బాలు మీనా

గొంతులు పోలిన గొంతులు ఉంటాయని కామాక్షి అంటుంది. అన్నీ కొనేశామని మాణిక్యం చెబుతాడు. బాలుతో మాట్లాడమని రంగా అంటే.. ఇప్పుడు వద్దని మాణిక్యం కాల్ కట్ చేస్తాడు. అతనెవరో పెళ్లిలో చూస్తాం కదా అని బాలు, మీనా అనుకుంటారు. మరోవైపు ప్రభావతికి కాల్ చేసి శ్రుతి జాబ్ గురించి ఏం చేశారని అడుగుతుంది శోభన.

ఇంకా మాట్లాడలేదని ప్రభావతి అంటే.. శోభన కోప్పడుతుంది. నా కూతురు హోటల్‌లో సర్వర్‌గా చేయడమేంటో అని ఫైర్ అవుతుంది. శ్రుతికి అర్థమయ్యేలా మెల్లిగా చెబుతానని ప్రభావతి అంటుంది. శోభన కాల్ కట్ చేస్తుంది. సత్యంతో చెబుతుంది ప్రభావతి. అది వాళ్ల ఇష్టమని అప్పుడే చెప్పానుగా అని సత్యం అంటాడు.

తల్లిగా తన బాధ తనకుంటుందిగా. రెస్టారెంట్ పెట్టిస్తానంటున్నారని, డబ్బులు ఇస్తానంటున్నారు. రవి సంపాదించుకున్నాకా వారికి అవే డబ్బులు ఇస్తే సరిపోతుంది కదా అని ప్రభావతి అంటుంది. రవి ఎవరి దగ్గర రూపాయి కోసం చేయి చాచడని సత్యం అంటాడు. మీరు చెబితే రవి, శ్రుతి వింటారు అని ప్రభావతి అంటుంది. నేను చెప్పలేనని సత్యం అంటాడు.

రవి, శ్రుతితో ప్రభావతి పంచాయతీ

నువ్వు కూడా ఈ విషయంలో అడగకు. అత్తారింటి నుంచి అల్లుడు డబ్బులు తీసుకుంటే అప్పటి నుంచి ఆ ఇంటి పరువు పోతుందని సత్యం వెళ్లిపోతాడు. తర్వాత హాల్లోకి అందరిని పిలుస్తుంది ప్రభావతి. శోభన చేసిన గొడవ గురించి ప్రభావతి చెబుతుంది. బ్లాంక్ చెక్ గురించి బాలు చెబుతాడు. అక్కడే వద్దని చెప్పాంగా. మళ్లీ ఇంటికి రావడం ఏంటని రవి అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe