Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చింతామణిని డ్యాన్స్ ప్రాక్టీస్ చేయమని ప్రభావతి అడుగుతుంది. తనకు డ్యాన్స్ గురించి ఆలోచించే మూడ్ లేదంటుంది. ఎందుకు, ఏదైనా పెద్ద సమస్య వచ్చిందా అని ప్రభావతి అంటుంది.
ప్రభావతిని రెచ్చగొట్టిన చింతామణి

నాకు ఏ సమస్య రాదు. ఎవరెవరో బాగా ఎదుగుతున్నారు. నిజాలు చాలా కఠినంగా ఉంటాయి. వీళ్ల ఇంట్లో ప్రభావతి మాటే చివరి మాట అనుకున్నా. కానీ, ఇప్పుడు అలా అనిపించట్లేదు. మీరు వద్దనుకున్న పని కూడా జరిగిపోయింది. ఆపాలనుకున్న మనిషి బాగా వేగంగా ముందుకు వెళ్లిపోయిందని చింతామణి అంటుంది.
తను కేవలం పూలు అమ్ముకునేది. ఇవాళ ఉన్నట్లు రేపు ఉండదు అని ప్రభావతి అంటుంది. నేను అనుకుంటే అన్ని చేయగలను. నా మాటను ఇంట్లో అందరు గౌరవిస్తారని ప్రభావతి అంటుంది. అయితే, నిరూపించండి. మీనాను ఆపండి. మీనా బిజినెస్ ఆపండి. ఎదుగుదలను ఆపండని మరింత ఎక్కిస్తుంది చింతామణి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని కామాక్షి అంటుంది.
ఇది కావాలనే రెచ్చగొడుతుంది అని కామాక్షి మనసులో అనుకుంటుంది. నేను తలుచుకుంటే మీనా బిజినెస్ ఆపగలను, డ్రైవింగ్ స్కూల్ కూడా ఆపగలను అని ప్రభావతి అంటుంది. మీనా భయపడే వ్యక్తి కాదు. ఇది మీ పరువు విషయం. మీరు గెలవాలి. లేకుంటే మీనా పర్వతంలా ఎదిగిపోతుంది అని చింతామణి అంటుంది. సరే ఏం జరుగుతుందో త్వరలో తెలుస్తుంది. అప్పుడు మీరే వచ్చి నాతో మాట్లాడాలి అని కోపంగా వెళ్లిపోతుంది ప్రభావతి.
బాలు మీనా ఆవిరి
మరోవైపు ఇంట్లో ముసుగు వేసుకుని బాలు, మీనా ఆవిరి పడతారు. అది చూసిన ప్రభావతి తిడితే.. జలుబు ఎక్కువైందని, అందుకే ఆవిరి పడుతున్నామని చెబుతారు. ప్రభావతి వెళ్లిపోతుంది. హాలు మధ్యలో వేడి నీళ్లతో పాత్ర ఉంటుంది. ఫోన్ చూస్తూ మనోజ్ దానికి తాకించుకుంటాడు. వేడి నీళ్లు పడటంతో కాలింది అంట అరుస్తాడు మనోజ్.
{{/usCountry}}మరోవైపు ఇంట్లో ముసుగు వేసుకుని బాలు, మీనా ఆవిరి పడతారు. అది చూసిన ప్రభావతి తిడితే.. జలుబు ఎక్కువైందని, అందుకే ఆవిరి పడుతున్నామని చెబుతారు. ప్రభావతి వెళ్లిపోతుంది. హాలు మధ్యలో వేడి నీళ్లతో పాత్ర ఉంటుంది. ఫోన్ చూస్తూ మనోజ్ దానికి తాకించుకుంటాడు. వేడి నీళ్లు పడటంతో కాలింది అంట అరుస్తాడు మనోజ్.
{{/usCountry}}రోహిణి, ప్రభావతి వచ్చి ఇదంతా హాల్లో ఎందుకు చేస్తున్నారని అడిగితే.. మాకు గదిలేదు కాబట్టి అని బాలు అంటాడు. శ్రుతి వచ్చి నిజమే కదా అని సపోర్ట్ చేస్తుంది. మీ కలల రూమ్ కడతానని అన్నారుగా అని తల్లి అంటే.. కడతాంలే అని బాలు అంటాడు. తర్వాత మీనాకు కారు తాళాలు ఇచ్చి డ్రైవింగ్ నేర్చుకోమని చెబుతాడు బాలు. నేను మంచిరోజు మొదలుపెడదామనుకున్నా అని మీనా అంటుంది.
మంచి రోజు చేసే ప్రతి రోజు మంచిదే అని బాలు అంటాడు. మీనా కారు డ్రైవింగ్ నేర్చుకుంటుంది. గురువు గారు ఏం చెబితే అది వినాలని బాలు అంటాడు. సీట్ బెల్ట్ పెట్టుకోమంటాడు. ఏది ఎలా చేయాలో బాలు చెబుతాడు. డ్రైవింగ్ ఎలా చేయాలో చెబుతాడు బాలు. అమ్మో ఇన్ని గుర్తుపెట్టుకోవాల అని మీనా అంటుంది. మరోవైపు రవి, శ్రుతిని చూసి ఒకతని మనది ఫ్యామిలీ రెస్టారెంట్ అయిపోయందంటాడు.
రెస్టారెంట్‌లో రవి, శ్రుతి గిల్లీకజ్జాలు
శ్రుతి ఆర్డర్స్ తీసుకుంటుంది. శ్రుతిని చూసి రవి మురిసిపోతాడు. అది చూసిన నీతు శ్రుతి రెండు రోజుల్లో పారిపోతుందనుకున్నా. కానీ, బాగా చేస్తుందని అంటుంది. తర్వాత ఒకతను ఆర్డర్ ఎంతసేపు అని శ్రుతిని అడుగుతాడు. దాంతో రవిపై అరుస్తుంది శ్రుతి. కాంప్లిమెంటరీ కింద సూప్ తీసుకెళ్లి పెడుతుంది శ్రుతి. కానీ, స్పూన్ మర్చిపోతుంది శ్రుతి.
రవి ఇవ్వడంతో స్పూన్ తీసుకెళ్లి ఇస్తుంది శ్రుతి. రవి, శ్రుతి ఇద్దరు గొడవ పడతారు. మరోవైపు ఓ చోట బాలు, రాజేష్ టీ తాగుతుంటారు. సడెన్‌గా బాలు లేచి వీడియో తీస్తాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ హెల్మెట్ లేకుండా, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుంటాడు. పబ్లిక్ దగ్గర రూల్స్ మాట్లాడతాడుగా మరి తను పాటించడే అని బాలు అంటాడు.
ఇప్పుడు మూడో తప్పు కూడా చేశాడని అరుణ్ నో పార్కింగ్ బోర్డ్ దగ్గర పార్క్ చేసింది వీడియో తీస్తాడు బాలు. ఇదే మనమైతే సీజ్ చేసేవాడని, ఒక గొలుసు తీసుకొచ్చి బైక్‌కు తాళం వేస్తాడు బాలు. అన్నింట్లో వేలు ఎందుకు పెడతావురా. పోలీసులతో ఎందుకురా పెట్టుకోవడం అని రాజేష్ అంటాడు. పోలీసులు పౌరులతో పెట్టుకోవచ్చా అని లాక్ వేసి వెళ్లిపోతాడు బాలు.
అరుణ్ బైక్ లాక్ వేసిన బాలు
తన బైక్ లాక్ చేసినందుకు కోపంగా అరుస్తాడు అరుణ్. హలో నేనే అని బాలు చెబుతాడు. అరుణ్ వెళ్లి గొడవ పెట్టుకుంటాడు. మాకేనా రూల్స్ మీకు ఉండవా అని నిలదీస్తాడు బాలు. నువ్వేంట్రా కంపలా నన్ను తగులుకున్నావ్ అని అరుణ్ అంటాడు. పక్కనున్నవాళ్లు కూడా అతను అనేది కరెక్టే కదా అంటారు. చాలా మంది పోగవుతారు.
నాకు కోపం తెప్పించకని అరుణ్ అంటాడు. ఇది వీడియో తీయండని బాలు చెబుతాడు. బాలు తన ప్యాసెంజర్‌ను ఎమర్జెన్సీలో తీసుకెళ్తుంటే నో ఎంట్రీ బోర్డ్‌లో వచ్చినందుకు కారు సీజ్ చేసి పట్టుకెళ్లాడని, ఇప్పుడు మరి నువ్వు మూడు తప్పులు చేశావని బాలు అంటాడు. అరేయ్ ఎమర్జెన్సీరా అని అరుణ్ అంటాడు. ఆరోజు నేను కూడా ఎమర్జెన్సీనే అన్నా. ఎవరు చచ్చినా రూల్స్ రూల్సే అన్నావుగా అని బాలు అంటాడు.
బాలును పక్కకు లాక్కెళ్తాడు రాజేష్. అతను పోలీస్‌రా అడిగింది చాలు. ఎమర్జెన్సీ అంటున్నాడుగా. చేతిలో రిపోర్ట్స్ ఉన్నాయి కనపడట్లేదా. కీస్ ఇవ్వు అని లాక్ వేసింది తీసి సర్ మీ రండి అని అరుణ్‌ను వెళ్లమంటాడు రాజేష్. చూసింది చాలు మూసుకోని వెళ్లమని బాలు అంటాడు. అరుణ్ వెళ్లిపోతాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పెడతానని బాలు అంటాడు.
సత్యంకు ఆహ్వానం
తర్వాత బాలు ఇంటికి కామాక్షి, రంగా వస్తారు. సుందరి పెళ్లికి రావాలని ఆహ్వానిస్తారు. తాంబూళం ఇస్తారు. కన్యాదాన ఫలితం దక్కుతుందని సత్యం అంటాడు. మాకు ఇంకో అమ్మాయి ఉంటే మీనాను బతిమిలాడుకుని నీకే ఇచ్చేదాన్నిరా అని కామాక్షి అంటుంది. దాందేముంది ఇప్పుడు కనండి పిన్ని అని మీనా అంటుంది. మేము ఇంత సంతోషంగా ఉండటానికి కారణం బాలు, మీనానే అని చెబుతారు రంగా.
మొదటి శుభలేఖ మీకే ఇస్తానని రంగా అంటే.. ముందు గౌరీ దేవి దగ్గర పెట్టండని సత్యం అంటాడు. తర్వాత కామాక్షి మేకప్పై సెటైర్లు వేస్తాడు రంగా. పదిమందిలో మీ భార్య గురించి తక్కువగా మాట్లాడొద్దు. ఇంట్లో అనండి ఏదైనా అని బాబాయ్ రంగాకు నీతులు చెబుతుంది మీనా. మా అమ్మే ఎంత బాగా చెప్పావని కామాక్షి అంటుంది. ఏదో సరదాగా అన్నానని. ఇంకెప్పుడు అలా అనను అని రంగా అంటాడు.
అయినా అత్తకు ఏమైంది ఇంకా కత్తి.. అని అనబోయిన బాలును మీనా గిచ్చుతుంది. దాంతో కళకళలాడుతుందని బాలు అంటాడు. బాలు, మీనాను రంగా పనులు పంచుకోమంటాడు. ఇంట్లో, ఫంక్షన్‌లో డెకరేషన్ చేస్తానని మీనా అంటుంది. నువ్వు బాగా డెకరేషన్ చేస్తావమ్మా. కానీ నీ వెనుక గోతులు తవ్వేవాళ్లు తయారయ్యారు. నువ్వు కొంచెం జాగ్రత్త అని కామాక్షి అంటుంది.
మాణిక్యం గురించి చెప్పిన రంగా
మీనా డౌట్‌గా చూస్తుంది. ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు అత్త అని బాలు అంటాడు. ట్రాన్స్‌పోర్ట్ నేను చూసుకుంటాను అని బాలు అంటాడు. మేకప్ గురించి అడిగితే.. రోహిణి చూసుకుంటుందని శ్రుతి అంటుంది. కామాక్షి అడిగితే.. నా పెళ్లే మీ వల్ల జరిగింది. మీ ఇంట్లో పెళ్లికి పని చేయలేనా అని రోహిణి అంటుంది.
టిఫిన్స్, లంచ్ మా హోటల్‌లో క్యాటరింగ్ ఇద్దాం. మంచి ప్యాకేజీలో మాట్లాడతానని రవి అంటాడు. సత్యం మెచ్చకుంటాడు. పెళ్లికొడుకు సైడ్ అబ్బాయి మేనమామ మాణిక్యం గురించి రంగా చెబుతాడు. ఇక్కడ పక్కన మటన్ కొట్టు ఉందట అని రంగా అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.