గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో తనకు లెటర్స్ రాస్తూ భయపెడుతుంది బాలు అంటూ ఇంట్లో గొడవ చేస్తాడు మనోజ్. మీరు ఇలా అంటే మా ఆయన ఊరుకుంటారా అని మీనా అంటుంది. వాడు అలా చేస్తాడనే బాడీగార్డ్‌ను తీసుకొచ్చానని లోపలికి పిలుస్తాడు మనోజ్. బాడీగార్డ్‌ను చూసి ఇంట్లోవాళ్లు భయపడుతారు.
ఒక్క గుద్దుతో పడిపోయిన బాడీగార్డ్

మీ మంచి కోసం చెబితే వినేలా లేరు అని బాలుకు మీనా కాల్ చేసేందుకు బయటకు వెళ్తుంది. అంతలోనే బాలు వస్తాడు. జరిగిందంతా చెబుతుంది మీనా. దాంతో కోపంగా నేను ఉత్తరాలు రాసానా, ముందు నిన్ను, ఆ తర్వాత వాన్ని తంతాను అని మనోజ్‌ను కొడతాడు బాలు. సత్యం ఆపుతాడు. నా ముందే ఈ గొడవ ఏంటని తిడతాడు.
నన్ను కొడితే నా బాడీగార్డ్ ఊరుకోడని మనోజ్ అంటాడు. మనోజ్‌ను కొట్టబోతుంటే బాలును ఆపుతాడు బాడీగార్డ్. దానికి మరింత కోపంతో బాడీగార్డ్‌ను ఒక్క గుద్దు గుద్దుతాడు బాలు. దాంతో బాడీగార్డ్ వెళ్లి మనోజ్ మీద పడతాడు. అది చూసి మీనా నవ్వుతుంది. రోహిణి నోరెళ్లబెడుతుంది. పచ్చడైపోతున్నానను, అప్పడంలా అయిపోతున్నాని, బాడీగార్డ్‌ను లేపమని మనోజ్ కేకలు పెడతాడు.
దాంతో రవి వెళ్లి బాడీగార్డ్‌ను లేపుతాడు. బాడీగార్డ్ లేచి ఏడుస్తుంటాడు. ఏనుగులా ఉన్నాడనుకుంటే పీనుగులా పడిపోయాడు అన రవి అంటాడు. ఎందుకురా ఏడుస్తున్నావ్ అని మనోజ్ అంటే.. ఇంతవరకు నన్ను నా భార్య తప్పా ఇంకెవరు కొట్టలేదంటాడు. నీ తిండికి సగం షాప్ పోయింది కదరా అని బాడీగార్డ్‌ను పంపించేస్తాడు మనోజ్.
మీరెందుకు భయపడుతున్నారు
మళ్లీ బాలు, మీనానే ఇదంతా కలిసి చేస్తున్నారని ప్రభావతి అంటుంది. రోహిణిని అసలు ఏమైందని అడుగుతాడు బాలు. జరిగింది చెబుతుంది. అదేదో అప్పుడే పిలిచుంటే వాడితోనే నిజం కక్కించేవాన్నిగా అని బాలు అంటాడు. వాడు తప్పించుకోడానికి ఈయన పేరు చెప్పి ఉంటాడని మీనా అంటుంది. మీకు లెటర్స్ రాస్తే బెదిరిపోతున్నారంటే మీరే ఏదో తప్పు చేస్తున్నారా. లేదా మీతో ఉండేవాళ్లు తప్పు చేస్తున్నారా అని శ్రుతి డౌట్‌గా అడుగుతుంది.
{{/usCountry}}మళ్లీ బాలు, మీనానే ఇదంతా కలిసి చేస్తున్నారని ప్రభావతి అంటుంది. రోహిణిని అసలు ఏమైందని అడుగుతాడు బాలు. జరిగింది చెబుతుంది. అదేదో అప్పుడే పిలిచుంటే వాడితోనే నిజం కక్కించేవాన్నిగా అని బాలు అంటాడు. వాడు తప్పించుకోడానికి ఈయన పేరు చెప్పి ఉంటాడని మీనా అంటుంది. మీకు లెటర్స్ రాస్తే బెదిరిపోతున్నారంటే మీరే ఏదో తప్పు చేస్తున్నారా. లేదా మీతో ఉండేవాళ్లు తప్పు చేస్తున్నారా అని శ్రుతి డౌట్‌గా అడుగుతుంది.
{{/usCountry}}ఉత్తరాలు పంపించేవాడికి నీ వీక్ పాయింటి తెలిసి ఉండాలని రవి అంటే.. ఇలాంటివాటికి పోలీస్ కంప్లైంట్ కరెక్ట్ అని శ్రుతి అంటుంది. మాటి మాటికి పోలీసులు వస్తే షాప్‌లో కస్టమర్స్ భయపడతారని రోహిణి అంటుంది. బయటకు వచ్చిన బాలు జరిగింది అంతా ఆలోచిస్తాడు. ఈ గొడవకు పార్లరమ్మకు లింక్ ఏదో ఉందని, నేను వదలను, వాడికి ఉత్తరాలు ఎవడు ఇచ్చాడో వాడిని కలిస్తే తెలుస్తుందని బాలు అంటాడు.
అది విన్న రోహిణి భయపడిపోతుంది. తర్వాత విద్యను కలుస్తుంది. ఏంటే ఇవాళ చాలా హాట్‌గా ఉన్నావని విద్య అంటుంది. అంటే.. ఆ హాట్ కాదు. ఇంట్లో జరిగిన పరిణామాల వల్ల కలిగిన వేడి. ఏదైనా కూల్ డ్రింక్ తీసుకొస్తా అని విద్య అంటుంది. విద్యను తిడుతుంది రోహిణి. దినేష్ గాడు బాలును ఇరికించి నా కొంప ముంచేలా చేశాడు అని రోహిణి భయపడుతుంది.
శివ వీడియో దొరకాలి
బాలు తనకు మీనాకు ఏదైనా సమస్య వస్తే వేరేవాళ్ల మీదకు రాడు. వాళ్లకు ఏదైనా సమస్య తీసుకురావాలి. శివ వీడియోను ఎలాగైనా రప్పించుకోవాలి. బాలుతో కారులో వెళ్లు. నీ ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందని, బాలు మొబైల్ తీసుకుని శివ వీడియో పంపించుకో అని రోహిణి చెబుతుంది. కానీ, తర్వాత నిజం తెలిస్తే బాలు చేతిలో చస్తానని దివ్య భయపడుతుంది.
నీ వల్ల మీనాకు చాలా సమస్యలు వస్తాయి. తనేం చేసిందే అని విద్య అంటుంది. వాళ్లు బాగా అతి చేస్తున్నారు. ఈ గొడవతో ఇద్దరిని ఇంట్లోంచి మా అత్త గెంటేస్తుంది అని రోహిణి అంటుంది. మరోవైపు గుడికి వెళ్లిన బాలు ఎవరినో వెతుకుతాడు. ఇంతలో ఓ రాజకీయనాయకుడు కనిపించి పలకరిస్తాడు. ఇక్కడికి మీరు రోజు వస్తారా. ఇక్కడ ఎవరైనా స్వామిజీ ఉన్నారా అని బాలు అంటాడు.
ఒక దొంగ స్వామిజీ వచ్చాడు. వాడు అభిషేకాల పేరుతో డబ్బులు వసూలు చేశాడు. అది గుడి నిర్వాహకులు గుర్తు పట్టి చితక్కొట్టారు. దాన్ని నేను వీడియో తీశాను అని బాలుకు చూపిస్తాడు అతను. అందులో దినేష్ కనిపిస్తాడు. వాడినే పోలీస్ స్టేషన్‌లో అప్పగించానని, వీడు ఇంకోసారి కనిపిస్తే నాకు చెప్పండని బాలు అంటాడు. బాలు కారును విద్య బుక్ చేసుకుంటుంది.
భయపడిన విద్య
విద్యను కారులో బాలు తీసుకెళ్తాడు. పార్లరమ్మ ఎవరికి అర్థం కాదు కదా. తనతో ఎలా స్నేహం చేస్తున్నావని బాలు అడుగుతాడు. తను చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ అని విద్య అంటుంది. అంటే నువ్వు కూడా మలేషియాలో పెరిగావా అని బాలు అడుగుతాడు. దానికి లేదు అని విద్య చెబుతుంది. వీడి దగ్గర ఫోన్ కొట్టేద్దామని వస్తే వీడు నా దగ్గర రొహిణి మ్యాటర్ కొట్టేసేలా ఉన్నాడని భయపడుతుంది విద్య.
దాంతో ఓ కథ చెబుతుంది విద్య. రోహిణి చాలా మంచిదని అంటుంది విద్య. ఇంతలో ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందని బాలు అడిగి తీసుకుంటుంది విద్య. నెంబర్ డయల్ చేస్తున్నట్లు చేసి ఫోన్ చెక్ చేస్తుంది విద్య. ఇంతలో హా దొరికింది అని విద్య అంటుంది. ఇంతలో బాలుకు మీనా కాల్ చేయడంతో తిరిగి తీసుకుంటాడు బాలు. మీనాతో కారులో విద్య ఉందని చెబుతాడు.
మనోజ్‌కు ఉత్తరాలు రాసిన వాడు దొరికాడు. వాడిని నేను పట్టుకున్నా అని మీనాకు చెబుతాడు బాలు. అది విన్న విద్య భయపడుతుంది. ఇంతలో విద్య చెప్పిన చోటు రావడంతో దించేస్తాడు బాలు. వీడియో దొరకలేదని రోహిణికి జరిగింది విద్య చెబుతుంది. బాలు, మీనాను చూస్తే నాకు పెళ్లి చేసుకుని అలా ప్రేమగా ఉండాలని ఉందని విద్య అంటుంది.
విద్య ప్రయత్నం ఫెయిల్
ఇంకొకసారి ట్రై చేద్దామని విద్య అంటుంది. బాలు దినేష్‌ను చూసినట్లున్నాడు. మీనాతో బాలు చెప్పడం విన్నాను. జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిస్తుంది విద్య. డైనింగ్ టేబుల్ దగ్గర మనోజ్‌కు వడ్డించదు. కళ్లు కనిపించట్లేదా నేను మనిషినే అని మనోజ్ అంటాడు. నీ భార్య ఉందిగా. తనకు కూడా మనిషిలా కనిపించట్లేదా అని మీనా అంటుంది.
రోహిణి నీ భర్తను నా జోలికి రాకని చెప్పు అని అంటుంది మీనా. ఏంటే అని ప్రభావతి అంటే.. ఏంటే ఏంటీ.. తమ్ముడి భార్యను అంటున్నాడు. ఇదేనా మీరు నేర్పించిన సంస్కారం అంటూ ప్రభావతిపై గట్టిగా అరుస్తుంది. దాంతో నేను ఏమన్నాను. రోహిణి వడ్డిస్తుంది అంతేగా అని భయపడిపోతుంది ప్రభావతి. ఇంతలో బాలు వస్తాడు. ఏమైందని అంటాడు.
ఏం లేదని, కూర్చోండని అంటుంది మీనా. ఎందుకు అరుస్తున్నావ్ బాలు తెగ ప్రశ్నిస్తాడు. గ్లాస్ కింద పడేసిన మీనా ఎహే.. ఏం లేదన్నాగా. తింటారా తినరా, ఏంటీ సోది అని అరుస్తుంది మీనా. దాంతో ఇంట్లోవాళ్లంతా భయపడిపోతారు. ఉత్తరాలు రాసేవాడు దొరికాడని బాలు చెబుతుంటే వీడు కాకుంటా ఎవరు రాస్తారు అని ప్రభావతి అంటుంది.
మీనాకు వణికిన ప్రభావతి
తర్వాత మీనాను చూసి వణికిపోతుంది ప్రభావతి. దినేష్‌ను ఇదివరకు పోలీసులకు పట్టించాను అని బాలు చెబుతాడు. మరి గుణ ఏంటీ తను పట్టించానని చెప్పాడని అనుకుంటుంది. వాడు ఆ పగతో ఇదంతా చేశాడని ప్రభావతి అంటుంది. అలా అయితే మా ఆయనకే ఉత్తరాలు రాయొచ్చుగా అని మీనా అంటుంది. వాడిని అతి త్వరలో పట్టుకుంటాను అని బాలు అంటాడు.
పోలీస్ కంప్లైంట్ పెట్టమంటాడు సత్యం. కంప్లైంట్ ఎందుకని రోహిణి అంటే.. వాడు దొరికతే ఎవరి కథలైన బయటపడతాయా. నువ్వేందుకు వద్దంటావో నాకు అర్థం కావట్లేదు అని మీనా డౌట్ పడుతుంది. బిజినెస్‌కు దెబ్బ పడుతుందని రోహిణి అంటుంది. వాడిని గుంజి గుంజి నిజాలన్ని కక్కిస్తానని బాలు అంటాడు.
మరోవైపు బైక్‌పై శ్రుతి రవి వెళ్తారు. దారిలో నీతూ కారు ఆగిపోయి కనిపిస్తుంది. బైక్ ఆపకుండా వెళ్లమని శ్రుతి అంటుంది. కానీ, నీతూ ఆపుతుంది. శ్రుతి దిగమని రవి బైక్ నీతూ ఎక్కుతుంది.
రవి బైక్‌పై నీతు, శ్రుతి
మీటింగ్ ఉంది. అర్జంట్‌గా వెళ్లాలని నీతూ అంటుంది. శ్రుతిని వెనుక ఎక్కమంటుంది నీతూ. చేసేదిలేక నీతూ వెనుక శ్రుతి కూర్చుంటుంది. బైక్‌పై శ్రుతి, నీతు ముగ్గురు వెళ్తారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.