గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో తనకు జాబ్ వచ్చిన విషయం మీనాకు చెబుతుంది సుమతి. అలాగే, కడుపుతో ఉన్న వాళ్లు ప్రసవం కోసం వచ్చే హాస్పిటల్‌లో రోహిణిని చూశాను అని సుమతి చెబుతుంది. అంటే శుభవార్తే. రోహిణి ప్రెగ్నెంట్ అయింది. ఇవాళ అంతే శుభవార్తలే. ఇంట్లోకి పాపో బాబో వస్తాడు అని సంతోషిస్తుంది మీనా.
తల్లి కాబోతున్న రోహిణి

ఇంట్లోవాళ్లకు స్వీట్స్‌తో తీపి చేయాల్సిందే అని మీనా అనుకుంటుంది. తర్వాత ఇంట్లో కేసరి స్వీట్ చేస్తుంది మీనా. అందరికి స్వీట్ ఇస్తుంది మీనా. అసలు విషయం ఏంటీ మీనా అని రోహిణి అడుగుతుంది. ఇదంతా నీకోసమే. ఇకనుంచి ఏం తినాలనిపించిన నాకు చెప్పు. నీ జీవితంలో మంచి జరగబోతుంది కదా అని మీనా అంటుంది.
నాకు తెలియకుండా నీకు తెలిసిన నా మంచి విషయం ఏంటీ అని రోహిణి అంటుంది. నువ్వు తల్లివి కాబోతున్నావ్ కదా అని మీనా అంటుంది. అంతా షాక్ అవుతారు. అందరు కంగ్రాట్స్ చెబుతారు. మీనా నీకు ఎలా తెలుసు అని రోహిణి అడుగుతుంది. నిన్ను హాస్పిటల్‌లో సుమతి చూసిందని మీనా చెబుతుంది.
అయితే తల్లిని అయినట్టా. నేను కన్సీవ్ కాలేదు. ప్రెగ్నెంట్ కాదు. కేవలం చెకప్ చేసుకోవడానికి మాత్రమే వెళ్లాను. దానికే ప్రెగ్నెంట్ అనుకుంటుందా. అదంతా ఫేక్ న్యూస్. అయినా ఏది ఆలోచించకుండా ఇలా చేస్తావా అని మీనాను అంటుంది రోహిణి. పిల్లలు పుట్టబోతున్నారని సంతోషించాని. అంతకుమించి ఆలోచించలేదు అని మీనా అంటుంది.
చెప్పకుండా చేయకు
కొన్ని క్షణాల్లోనే ఆశలు అడియాసలు చేసిందిరా నీ పెళ్లాం అని మీనాను అంటుంది ప్రభావతి. ఇంకోసారి నాకు చెప్పకుండా ఏది చేయకని మీనాకు చెప్పు బాలు అని రోహిణి కోపంగా వెళ్లిపోతుంది. అసలు చిన్నగంప హాస్పిటల్‌కు ఎందుకు వెళ్లిందని బాలు అడిగితే.. జాబ్ వచ్చిన విషయం చెబుతుంది మీనా. అది కదా గుడ్ న్యూస్ అని బాలు అంటే.. ఈ స్వీట్ దానికి అనుకుందామని సత్యం అంటాడు.
తర్వాత మనోజ్‌తో నాకు పిల్లలు కావాలి. మనకే ముందు పుట్టాలి. నాకు పిల్లలు పుట్టినట్లు, హాస్పిటల్‌లో ఉన్నట్లు అని రోహిణి గొడవ పెట్టుకుంటుంది. దేనికైనా టైమ్ రావాలి అని మనోజ్ అంటాడు. నాకు పిల్లలు కావాలని ఉంది. మనకు ఇంకా పిల్లలు పుట్టలేదు కాబట్టి ఇద్దరం వెళ్లి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకుందామా అని రోహిణి అడుగుతుంది.
{{/usCountry}}తర్వాత మనోజ్‌తో నాకు పిల్లలు కావాలి. మనకే ముందు పుట్టాలి. నాకు పిల్లలు పుట్టినట్లు, హాస్పిటల్‌లో ఉన్నట్లు అని రోహిణి గొడవ పెట్టుకుంటుంది. దేనికైనా టైమ్ రావాలి అని మనోజ్ అంటాడు. నాకు పిల్లలు కావాలని ఉంది. మనకు ఇంకా పిల్లలు పుట్టలేదు కాబట్టి ఇద్దరం వెళ్లి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకుందామా అని రోహిణి అడుగుతుంది.
{{/usCountry}}కన్సీవ్ కానిది నువ్వు నేనెందుకు అని మనోజ్ అంటాడు. ఇద్దరం చెకప్ చేయించుకుంటే లోపం ఎవరిలో ఉందో తెలుస్తుంది అని రోహిణి అంటుంది. నేను కంప్లీట్‌లీ ఆల్ రైట్ అని మనోజ్ అంటాడు. అది నీకు తెలుసు. నీ మాజీ లవర్ కల్పనను ప్రెగ్నెంట్ చేశావా అని నిలదీస్తుంది రోహిణి. లేదు కేవలం టిఫిన్సే. మరి పెళ్లికి ముందు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావా అని మనోజ్ నిలదీస్తాడు.
మనోజ్‌ను నెట్టేసిన రోహిణి
దాంతో కోపంగా మనోజ్ కాలర్ పట్టుకుని వెనక్కి నెడుతుంది. మనోజ్‌కు బీరువా తాకుతుంది. నన్ను అంత మాట అంటావా అని కోప్పడుతుంది రోహిణి. నువ్వు నన్ను అనలేదా అని మనోజ్ అంటాడు. నేను నీలాగా పెళ్లికి ముందు ఎవరితో తిరగలేదు. లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉండలేదు అని ఏడుస్తుంది రోహిణి. కోపంలో నోరు జారాను అని మనోజ్ ఓదారుస్తాడు.
నువ్వు అందరికంటే బెస్ట్ అని సర్ది చెబుతాడు మనోజ్. ఇద్దరు ఒకరినొకరు సారీ చెప్పుకుంటారు. కానీ, నన్ను అనుమానించినందుకు బాధగా ఉంది. కాసేపు ఒంటరిగా ఉండనివ్వు అని డాబా పైకి వెళ్లి ఒంటరిగా ఉంటాడు. మనోజ్‌ను చూసిన ప్రభావతి అడుగుతుంది. దాంతో జరిగింది చెబుతుంది. నిన్ను అంతలా అవమానిస్తుందా పదా అని వెళ్లి రోహిణిని నిలదీస్తుంది ప్రభావతి.
వీడు నీ దగ్గర ఏమైనా దాచాడా. కడిగిన ముత్యం వీడు. నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటాడు. నువ్వు ఇక్కడికి రాకముందు విదేశాల్లో ఉన్నావ్. నిన్ను మేము గానీ వీడు గాని అవమానించామా చెప్పు. ఎందుకంటే నీ మీద మాకు నమ్మకం. వీడికి క్షమాపణ చెప్పు అని ప్రభావతి అంటుంది. ఇప్పుడు మ్యానేజ్ చేయకపోతే కష్టం అనుకున్న రోహిణి మీ అబ్బాయి ఆమెతో కలిసి లేడా. ఇద్దరు ముట్టుకోను కూడా ముట్టుకోలేరా అని అత్తను నిలదీస్తుంది రోహిణి.
పరువు పోతుంది
అదే నిజమైతే ఇప్పుడే క్షమాపణ అడుగుతాను. ఎందుకు ఇలా సైలెంట్‌గా ఉన్నాడు అని రోహిణి అంటుంది. వీడికి ఏ లోపం లేదు. హాస్పిటల్స్ చుట్టూ తిరిగితే ఇంటి పరువు పోతుంది అని ప్రభావతి అని వెళ్లిపోతుంది. అదేంటీ అమ్మ అలా అడిగి నా పరువు తీసేసావ్. తను నిజమే అనుకోదు అని మనోజ్ అంటాడు.
తను అడిగిన దాంట్లో తప్పేముంది. నీ వల్ల ఎప్పుడు ఎవరో ఒకరు నన్ను అనడమే అవుతుంది. అసలు తనకు ఉన్నట్లుంది ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది. నాకు ఎందుకు సందేహంగా ఉంది. పెళ్లికి ముందు రోహిణి జీవితం ఏంటో మనకు తెలియదు కదా అని ప్రభావతి డౌట్ పడుతుంది.
మీనాకు బాలు వార్నింగ్
మరోవైపు శివ బర్త్ డే కాబట్టి గుడిలో అన్నదానం చేస్తున్నామని, బాలును కూడా రమ్మని మీనాతో చెబుతుంది పార్వతి. కానీ, బాలు ఉంటే శివ రానంటాడు. అదే విషయం బాలుకు చెబుతుంది మీనా. భర్త లేనిచోట భార్య ఉండకూడదు. నువ్వు వెళ్తే అస్సలు ఊరుకునేది లేదు అని మీనాకు వార్నింగ్ ఇస్తాడు బాలు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.