...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: కొడుకులకు తండ్రి శిక్ష- మనోజ్‌పై కోర్టుకు ముఖేష్- గడప దగ్గర బాలు మీనా సరసాలు!

Gunde Ninda Gudi Gantalu Serial March 20th Episode: గుండె నిండా గుడి గంటలు మార్చి 20 ఎపిసోడ్‌లో బాగా తాగి వచ్చి తల్లిదండ్రులను ఆంటీ, అంకుల్ అని పిలుస్తారు బాలు, మనోజ్, రవి. దాంతో వారికి శిక్ష వేస్తాడు సత్యం. ఇంటికి వచ్చిన ముఖేష్ మోసం చేసినందుకు మనోజ్‌ను 50 లక్షలు డిమాండ్ చేస్తాడు.

Published on: Mar 20, 2026, 08:47:31 IST
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో బాలు, మనోజ్, రవి ముగ్గురు తాగి ఇంటి ముందు ఒక్కటిగా గోల చేస్తారు. బాలును మామ అంటాడు రవి. తల్లిని పట్టుకుని ఆంటీ అని, మనింట్లో ఎందుకు ఉంది అని రవి అంటాడు.

ముగ్గురు బయటే పడుకోవాలి

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మార్చి 20 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ మార్చి 20 ఎపిసోడ్‌

ముగ్గురు కొడుకులను తాగుబోతులను చేశావని మీనాను నిందిస్తుంది ప్రభావతి. ఈవిడ ఎవరు, వీళ్ల పెద్ద కొడుకు పెద్ద ఫ్రాడ్ అంట కదా అని మనోజ్ అంటాడు. అవును, అన్ని మింగేస్తాడని బాలు అంటాడు. ఈ ముగ్గురు ఇక్కడే పడుకోవాలి. అప్పుడే బుద్ధి వస్తుందని సత్యం అంటాడు. అయినా గోల చేస్తుంటారు ముగ్గురు అన్నదమ్ములు.

ఇలాగే వాగితే వీళ్లేవరో మాకు తెలియదని పోలీసులను పిలిచి అప్పగిస్తాను అని సత్యం వార్నింగ్ ఇస్తాడు. దాంతో ముగ్గురు సైలెంట్‌గా ఉంటారు. లోపలికి రానివ్వొచ్చుగా అని శ్రుతి అంటుంది. మీ మంచికోసమే చెబుతున్నా. ఇదే శిక్ష. తెల్లవారితే ఇదంతా మర్చిపోతారు అని సత్యం అంటాడు. బాలును ఉంచి మనోజ్, రవిని లోపలికి రమ్మనండని ప్రభావతి అంటుంది.

వీడే చెడగొట్టి ఉంటాడని ప్రభావతి అంటుంది. రోహిణి చెప్పు అని మీనా అంటుంది. బాలు కంట్రోల్‌లోనే ఉన్నాడు. మనోజే బలవంతం చేశాడని నిజం చెబుతుంది రోహిణి. మనోజ్ ఒక్కడిని లోపలికి రమ్మనండని ప్రభావతి అంటే.. వాడి మీద జాలిపడితే నిన్ను కూడా బయటకు పంపిస్తా. నోర్మూసుకుని పదా అని సత్యం అంటాడు. తర్వాత ఆ ముగ్గురి మీద జాలి చూపిస్తే ఊరుకోను అని సత్యం ఆర్డర్ వేస్తాడు.

దుప్పటి కింద చాప పైన

మనోజ్ కోట్‌లో ఉన్న ఫోన్ కొట్టేద్దామని రోహిణి కిందకు వస్తే.. అక్కడ మీనా ఉండటంతో తిరిగి వెళ్లిపోతుంది. బాలుకు ఎక్కిళ్లు రావడంతో మీనాను పిలుస్తాడు. మీనా వాటర్ బాటిల్ ఇస్తుంది. తాను గడప దాటనని మీనా అంటే.. నేను మా నాన్న గీసిన గీత దాటనంటాడు బాలు. తనకు మందు దిగిందని, కోట్ విప్పి టీ షర్ట్ వేసుకుంటానని బాలు అంటాడు.

మీతో మావయ్య మాట్లాడొద్దన్నాడని, తెల్లార్లు దోమలతో భజన చేయండని మీనా అంటుంది. ఇంట్లో మీనా.. బయట బాలు ఇద్దరు గడప దగ్గర కూర్చుని మాట్లాడుకుంటారు. మనోజ్ మీద ప్రేమ చూపిస్తాడు బాలు. తర్వాత ఈరోజు రెడీ అయ్యావుగా కత్తిలా ఉన్నావంటాడు బాలు. తర్వాత ప్రాస చెబితే కవిత్వమా అని మీనా అంటుంది. కాదు మందిత్వం, మందు తాగినవాడు చెబితే మందిత్వం అని బాలు అంటాడు.

రోహిణి ప్లాన్ ఫెయిల్

రోహిణి ప్రతిసారి వచ్చి బాలు, మీనాలను చూసి వెళ్లిపోతుంది. విద్య కాల్ చేసి ఫోన్ కొట్టేశావా అని అడుగుతుంది. లేదు. వాళ్లు బయట పడుకున్నారని చెబుతుంది రోహిణి. బాలు తన సతీమణితో సరసాలు ఆడుతున్నాడని చెబుతుంది రోహిణి. తెల్లారేలోపు మనోజ్ నుంచి ఫోన్ కొట్టేయాలని అనుకుంటుంది రోహిణి. కానీ, రోహిణి ప్లాన్ ఫెయిల్ అవుతుంది. తెల్లవారుతుంది. సత్యం వచ్చి తలుపు తెరవమంటాడు.

ఎవరి భర్తను వారు లేపుతారు. మనం బయట ఉన్నామేంటీ అని మనోజ్ అడుగుతాడు. రాత్రి జరిగింది మనోజ్‌కు చెబుతారు బాలు, రవి. లోపలికి రమ్మని సత్యం అంటాడు. సత్యం, ప్రభావతిని నాన్న, అమ్మా అని పిలిస్తే మేము అంకుల్, ఆంటీ కదా అని చురకలు వేస్తారు. అంతగా ఎలా తాగారు అని మీనా, శ్రుతి అంటే.. మనోజ్ వైపు చూస్తూ వీడే ముంబై ముఖేష్ కోసం బలవంతం చేశాడని బాలు, రవి చెబుతారు.

కోర్టుకు ముఖేష్

తాగాం గానీ మంచే జరిగింది. డీల్ మనకే వచ్చిందని అగ్రిమెంట్ చూపిస్తాడు మనోజ్. తర్వాత రేయ్ ముఖేష్‌తో ఏం మాట్లాడావురా అని మనోజ్ అడుగుతాడు. చెప్పేశాం కదా అని బాలు అంటాడు. ఇంటికి ముఖేష్ వస్తాడు. రూ. 50 లక్షలు కట్టమంటాడు. అంత కట్టే పరిస్థితిలో లేడని బాలు అంటాడు. ఈ అగ్రిమెంట్‌తో నేను కోర్టుకు వెళ్లొచ్చు అని ముఖేష్ అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks