గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నాలుగు లక్షల మోసం గురించి మనోజ్‌ను తిడుతుంది రోహిణి. ఇన్ని రోజులు మోసం చేశావా. నాకు ఎందుకు చెప్పలేదు అని అంటుంది రోహిణి. నువ్వు తిడతావని చెప్పలేదు. నా మీద నీకు గౌరవం పోతుందని చెప్పలేదు అని మనోజ్ అంటాడు.
అమ్మకు ముందే తెలుసు

నాకు ముందే చెప్పి ఉంటే వేరేలా డీల్ చేసేదాన్ని. బాలు చూడు ఎలా అంటున్నాడో. ఎప్పుడు వెనుకేసుకొచ్చే మీ అమ్మ నిన్ను కొట్టింది అని రోహిణి అంటుంది. ఈ విషయం అమ్మకు ముందే తెలుసు అని మనోజ్ చెబుతాడు. దాంతో రోహిణి షాక్ అవుతుంది. ఆరోజే అమ్మకు చెప్పాను. అందరి ముందు బయటపడేయడానికే నన్ను కొట్టింది అని మనోజ్ అంటాడు.
నాలుగు లక్షలు మోసపోయావ్, దాన్ని లాభంగా చూపించేందుకు మణికంఠ దగ్గర అప్పు చేశావ్. ఇది చెప్పడానికి ఏముందని రోహిణి అంటుంది. లేదు నేను మణికంఠ దగ్గర అప్పు తీసుకోలేదు. మీనా నగలను నేను అమ్మేశాను. మీనా నగలను కవరింగ్ నగలుగా మార్చింది నేను, అమ్మ అని మనోజ్ నిజం చెబుతాడు. దాంతో మరింత కోపంతో మనోజ్‌ను కొడుతుంది.
మోసపోతే పోయావ్. సొంతింట్లోనే నగలు మార్చావ్ నువ్వు అని తిడుతుంది రోహిణి. నాకు వేరే దారి లేక చేశాను అని మనోజ్ అంటాడు. బాలు అస్సలు ఊరుకోడు. శివ చేయి విరగగొట్టినట్లే నీ చేయి విరగ్గొడతాడు. మీ అమ్మ మాట బాలు నమ్ముతాడా. నిజం ఎలాగైనా తెలుసుకుంటాడు. మీనా డబ్బుతో బతుకున్నట్లు అయింది. నా పరువు కూడా తీశావ్. బాలుకు విషయం తెలియకూడదు అని రచ్చ చేస్తుంది రోహిణి.
గయ్యాలి గంగావతి
ఎలాగైనా మ్యానేజ్ చేద్దాం అని మనోజ్ అంటాడు. ఈ విషయం తనకు చెప్పినట్లు ప్రభావతికి చెప్పొద్దని రోహిణి అంటే సరే అని మనోజ్ అంటాడు. మరోవైపు శ్రుతి కథ రాస్తుంది. మన ఇంట్లో ప్రతిరోజు కొత్త ట్విస్ట్‌తో కథ వస్తుంది. ఈరోజు నుంచి డైలీ సీరియల్ నేనే రాయాలనుకుంటున్నాను. టైటిల్ ఏంటంటే గయ్యాలి గంగావతి అని శ్రుతి చెబుతుంది.
{{/usCountry}}ఎలాగైనా మ్యానేజ్ చేద్దాం అని మనోజ్ అంటాడు. ఈ విషయం తనకు చెప్పినట్లు ప్రభావతికి చెప్పొద్దని రోహిణి అంటే సరే అని మనోజ్ అంటాడు. మరోవైపు శ్రుతి కథ రాస్తుంది. మన ఇంట్లో ప్రతిరోజు కొత్త ట్విస్ట్‌తో కథ వస్తుంది. ఈరోజు నుంచి డైలీ సీరియల్ నేనే రాయాలనుకుంటున్నాను. టైటిల్ ఏంటంటే గయ్యాలి గంగావతి అని శ్రుతి చెబుతుంది.
{{/usCountry}}అమ్మ వింటే నిజంగా గయ్యాలు అవుతుంది అని రవి అంటాడు. ఇప్పుడు మాత్రం కాదా. మీనాను రాచి రంపాన పెడుతుంటుంది. పోని పార్లర్ మింగిన పెళ్లాం, లక్షలు మింగిన మొగుడు అని పెడదామా అని శ్రుతి అంటుంది. అమ్మో ఇది మరి డైరెక్ట్‌గా ఉందని వద్దంటాడు రవి. మీనా నగల గురించి మనోజ్ చెప్పింది నమ్మేలా లేదని, ప్రైవేట్ డిటెక్టివ్‌ను పెడదామా అని శ్రుతి అంటుంది.
ఇంకా నయం సీబీఐకి కేసు అప్పగిద్దామనలేదు. మన దగ్గర రుజువు లేదు. బాలు అన్నయ్య చూసుకుంటాడు అని రవి అంటాడు. ఇంట్లో జరిగిన విషయాలను సీరియల్‌లో లాగా చెబుతుంది శ్రుతి. తర్వాత ప్రభావతి పాట పాడుతుంది. పాట పాడుతూ వత్తులు పెడుతుంది. శ్రుతి వచ్చి అడుగుతుంది. ఇవాళ కార్తీక పౌర్ణమి. సంవత్సరానికి సరిపడా 365 వత్తులను ఉసిరి చెట్టు దగ్గర వెలిగించాలని ప్రభావతి చెబుతుంది.
మీనాకు ప్రభావతి ఫిదా
మరి రోజు వెలిగించాల్సిన అవసరం లేదా అని శ్రుతి అడిగితే ప్రభావతికి తెలియక తడబడుతుంది. నేను చెబుతాను అని వచ్చి మీనా చెబుతుంది. పీరియడ్స్, అనారోగ్యాల వల్ల ప్రతి రోజు వెలిగించాలేం కదా. అందుకే ఒకేరోజు 365 దీపాలు వెలిగిస్తారని కార్తీక పౌర్ణమి విశిష్టత చెబుతుంది. ప్రభావతి ఫిదా అయి చూస్తుంది. శ్రుతి చప్పట్లు కొడుతుంది.
ఇలా చేస్తే గుడిక ఆలస్యం అవుతుంది తలో చేయి వేస్తే త్వరగా పూర్తవుతాయని మీనా అని వత్తులు చుడుతుంది. శ్రుతికి చుట్టరాకపోయేసరికి అంతా నవ్వుతారు. అది చూసి ఇది మా ఇల్లు అనుకుని వచ్చాని తిరిగి వెళ్లిపోతాడు బాలు. అంతా పిలుస్తారు. అంతా సంతోషంగా నవ్వుతుంటే మన ఇల్లు కాదనుకున్నా అని బాలు అంటాడు.
మరోవైపు మౌనికను ఆపిన సంజు ఇంత అందంగా రెడీ అయ్యావ్ ఎవరికి కోసం అని అడుగుతాడు. మన కోసమే. ఈరోజు కార్తీక పౌర్ణమి. గుడికి వెళ్లాలి. మీరు కూడా రావాలి అని మౌనిక అంటుంది. సంజు తల్లి కూడా వచ్చి గుడికి వెళ్లమని చెబుతుంది. ఊరికే గుడికి వెళ్తావ్. ఏముంది దేవుడి దగ్గర అని సంజు అంటాడు. నిజంగా గుడికే అని మౌనిక అంటుంది.
మనిషిలా ఆలోచించురా
అయితే, అవసరం లేదు. ఇంట్లో పూజ గదిలో పూజ చేసుకో అని సంజు అంటాడు. భర్తలా కాకపోయినా మనిషిలా ఆలోచించు. గుడికి వెళ్లనివ్వురా అని తల్లి అంటుంది. ఇంట్లోవాళ్లను కలవడానికి కాకుండా అయితే గుడికి వెళ్లమను అని సంజు అంటాడు. మరోవైపు సత్యం పంచె కట్టుకుని రెడీ అవుతాడు. ప్రభావతి కలర్‌ఫుల్‌గా తయారవుతుంది. అది చూసి సత్యం ఆశ్చర్యపోతాడు.
మనవళ్లను ఎత్తుకునే వయసొచ్చిన చూపులో కొంటెతనం పోలేదు అని సత్యంను అంటుంది ప్రభావతి. ముగ్గురు కోడళ్లు వస్తారు. లక్ష్మీ పార్వతి సరస్వతిల ముగ్గురు ఉన్నారు అని సత్యం అంటాడు. మరి నేను అని ప్రభావతి అంటే ముగ్గురు అమ్మల మూలకుటమ్మలా ఉన్నావని సత్యం అంటాడు. దిష్టిపెట్టకండి అని ప్రభావతి అంటే.. మీనా దిష్టి చుక్క పెడుతుంది.
బయటకు వెళ్తే నిజంగానే మీకు దిష్టి తగిలేలా ఉన్నారని మీనా అంటుంది. దానికి మురిసిపోయిన ప్రభావతి నిజంగా అంత అందంగా ఉన్నానా అంటుంది. చాలా గ్లామరస్‌గా ఉన్నారని శ్రుతి అంటుంది. ముగ్గురు కొడుకులు పంచెలు కట్టుకుని వస్తారు. బాలు బాలరాజు, రవి నలభీమ రాజు అని మీనా అంటే మనోజ్ మన్ను రాజు అని బాలు అంటాడు. నేను చెబుతాను అని మన్మథ రాజు అంటుంది రోహిణి.
బావను కొట్టిన బాలు
తర్వాత అంతా గుడికి వెళ్తారు. దీపాలు వదులుతారు. అక్కడికి మౌనిక రావడంతో అంతా సంతోషిస్తారు. కానీ, అదంతా సంజు చూసి గొడవ చేస్తాడు. మీ ఇంటికే వస్తుందా లేదా ఇంకెవరి ఇంటికైనా వెళ్తుందా అని మౌనికను తప్పు పడతాడు సంజు. దాంతో బావ సంజును గుడిలోనే బాలు కొడతాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.