...
...
Next Story

ఆ క్వాలిటీ పవన్ కల్యాణ్ తర్వాత రవితేజలో చూశాను, నాకు డైరెక్టర్‌గా జన్మ పునర్జన్మ ఇచ్చింది ఆయనే: హరీశ్ శంకర్ కామెంట్స్

పవన్ కల్యాణ్, రవితేజ ఇద్దరిలో ఒక క్వాలిటీ సేమ్ అని డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ కామెడీ సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు హరీష్ శంకర్ ఇలా వ్యాఖ్యలు చేశారు.

Published on: Jan 12, 2026, 17:54:48 IST
Advertisement

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ ఇద్దరు హీరోయిన్స్ యాక్ట్ చేశారు. భీమ్స్ సెసిరోలె సంగీతం అందించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి జనవరి 13న థియేటర్లలో విడుదల కానుంది.

హరీశ్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఆ క్వాలిటీ పవన్ కల్యాణ్ తర్వాత రవితేజలో చూశాను, నాకు డైరెక్టర్‌గా జన్మ పునర్జన్మ ఇచ్చింది ఆయనే: హరీశ్ శంకర్ కామెంట్స్
ఆ క్వాలిటీ పవన్ కల్యాణ్ తర్వాత రవితేజలో చూశాను, నాకు డైరెక్టర్‌గా జన్మ పునర్జన్మ ఇచ్చింది ఆయనే: హరీశ్ శంకర్ కామెంట్స్

ఈ నేపథ్యంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు అతిథులుగా డైరెక్టర్స్ హరీశ్ శంకర్, బాబీ, శివ నిర్వాణ, పవన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ హరీశ్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

చాలా సెన్సిబుల్ ప్రొడ్యూసర్

డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి నాకు ఇష్టమైన ప్రొడ్యూసర్. చాలా సెన్సిబుల్ ప్రొడ్యూసర్. ఆయన బ్యానర్‌లో నా సినిమా కచ్చితంగా ఉంటుంది. ఆయనతో పని చేయాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.

స్థితప్రజ్ఞత కలిగిన వ్యక్తి

"మిరపకాయ వచ్చిన, మిస్టర్ బచ్చన్ వచ్చిన ఒకేలా ఉండే వ్యక్తి మాస్ మహారాజా రవితేజ. స్థితప్రజ్ఞత కలిగిన వ్యక్తి. ఆ క్వాలిటీ పవన్ కల్యాణ్ గారిలో తర్వాత రవితేజ గారిలో చూశాను. ఆయన డైరెక్టర్స్‌గా పరిచయం చేసిన వాళ్లందరూ ఈరోజు స్టార్ డైరెక్టర్‌గా ఉన్నారు. నాకు డైరెక్టర్‌గా జన్మ, పునర్జన్మ ఇచ్చింది ఆయనే. మళ్లీ రవితేజ గారితో బ్లాక్ బస్టర్ తీస్తాను. అది నా ప్రామిస్" అని హరీశ్ శంకర్ తెలిపారు.

చూసిన వెంటనే బ్లాక్ బస్టర్ ఫీలింగ్

"చాలా సంవత్సరాల క్రితం జనవరి 11న మిరపకాయ రిలీజ్ అయ్యే.. బ్లాక్ బస్టర్ అయింది. మళ్లీ జనవరి 13న ఈ భర్తమహాశయులకు విజ్ఞప్తి సినిమా వస్తుంది. కచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది. సంక్రాంతికి చాలా గట్టిగా కొడుతున్నాం" అని దర్శకుడు హరీష్ శంకర్ ధీమా వ్యక్తం చేశారు.

పవన్ కల్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్

ఇదిలా ఉంటే, ప్రస్తుతం హరీశ్ శంకర్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్‌గా శ్రీలీల చేస్తోంది. ఇక రవితేజతో హరీశ్ శంకర్ షాక్, మిరపకాయ్, మిస్టర్ బచ్చన్ మూవీస్ చేశారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks