OTT Crime Thriller Hathras 16 Days Release: ఓటీటీల్లో వచ్చే సైకో-థ్రిల్లర్లు, ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ కథలకు నేటి తరం డిజిటల్ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ లభిస్తోంది. కల్పిత కథల కంటే మన కళ్లముందే జరిగిన నిజ జీవిత దారుణాలను, సమాజంలోని చీకటి కోణాలను ఎత్తిచూపే కథనాలు చూసేవారిని తీవ్రంగా ఆలోచింపజేస్తాయి.
ఓటీటీలో హత్రాస్ 16 డేస్

ఆ కోవలోనే ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టిస్తోన్న ట్రూ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ 'హత్రాస్: 16 డేస్' (Hathras: 16 Days) ఓటీటీలో ఇప్పటికీ ఆకట్టుకుంటోంది. అలాంటి హత్రాస్ 16 డేస్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై ఓ లుక్కేద్దాం.
దేశాన్ని కుదిపేసిన దారుణం.. 16 రోజుల ఇన్వెస్టిగేషన్!
2020 సెప్టెంబర్ 14న ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో ఒక 19 ఏళ్ల దళిత యువతిపై కొందరు మృగాళ్లు అతికిరాతకంగా సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆస్పత్రిలో మరణంతో పోరాడిన ఆ బాధితురాలు సెప్టెంబర్ 29న చికిత్స పొందుతూ కన్నుమూసింది.
ఆ తర్వాత బాధితురాలి మృతదేహానికి అర్ధరాత్రి వేళ పోలీసులే అంత్యక్రియలు నిర్వహించిన తీరు, బయటపడిన రాజకీయ ప్రమేయాలు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపాయి. ఆ దారుణం జరిగిన తర్వాతి 16 రోజుల్లో అక్కడ అసలేం జరిగింది? అధికార యంత్రాంగం కేసును ఎలా తిప్పికొట్టే ప్రయత్నం చేసింది? అనే అంశాలను దర్శకుడు ప్యాట్రిక్ గ్రాహం ఎంతో ధైర్యంగా తెరకెక్కించారు.
రాజకీయం, కుల వివక్షల స్వరూపం.. గ్రౌండ్ రిపోర్టింగ్ మెరుపులు!
కేవలం ఒక నేరాన్ని చూపించడానికే పరిమితం కాకుండా, ఆ ఘటన వెనుక ఉన్న రాజకీయ లబ్ధి, సమాజంలో పేరుకుపోయిన కుల వివక్షను ఈ ఓటీటీ సిరీస్ నిష్పాక్షికంగా చూపించింది. ఆ సమయంలో క్షేత్రస్థాయిలో ప్రాణాలకు తెగించి వార్తలు కవర్ చేసిన జర్నలిస్టులు, ప్రత్యక్ష సాక్షుల ఇంటర్వ్యూలతో పాటు నాటి ఒరిజినల్ ఫుటేజ్‌ను పొందుపరిచారు.
జర్నలిస్టులు తనుశ్రీ పాండే, నిధి సురేష్, భీమ్ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ 'రావణ్', సీనియర్ యాంకర్ రుబికా లియాకత్ వంటి ప్రముఖుల విశ్లేషణలు కథనానికి మరింత బలాన్నిచ్చాయి. అంజలి శివరామన్, పవేల్ గులాటీ, కుముద్ మిశ్రా తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. సమర్ ఖాన్, ఆదిత్య పిత్తి నిర్మించిన ఈ ఓటీటీ సిరీస్‌కు ప్రముఖ సంస్థ ఐఎమ్‌డీబీ (IMDb) 7.6/10 రేటింగ్ ఇచ్చింది.
కేవలం 3 ఎపిసోడ్లు.. నిమిష నిమిషం ఉత్కంఠ!
{{/usCountry}}జర్నలిస్టులు తనుశ్రీ పాండే, నిధి సురేష్, భీమ్ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ 'రావణ్', సీనియర్ యాంకర్ రుబికా లియాకత్ వంటి ప్రముఖుల విశ్లేషణలు కథనానికి మరింత బలాన్నిచ్చాయి. అంజలి శివరామన్, పవేల్ గులాటీ, కుముద్ మిశ్రా తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. సమర్ ఖాన్, ఆదిత్య పిత్తి నిర్మించిన ఈ ఓటీటీ సిరీస్‌కు ప్రముఖ సంస్థ ఐఎమ్‌డీబీ (IMDb) 7.6/10 రేటింగ్ ఇచ్చింది.
కేవలం 3 ఎపిసోడ్లు.. నిమిష నిమిషం ఉత్కంఠ!
{{/usCountry}}ఈ సిరీస్ నిడివి తక్కువగా ఉండటం ఓటీటీ ప్రేక్షకులకు పెద్ద ప్లస్ పాయింట్. మొత్తం మూడు ఎపిసోడ్లుగా దీనిని తీర్చిదిద్దారు. మొదటి ఎపిసోడ్ 33 నిమిషాలు, రెండో ఎపిసోడ్ 34 నిమిషాలు, మూడో ఎపిసోడ్ 28 నిమిషాల నిడివితో సాగుతాయి. ప్రతి ఎపిసోడ్ గడిచేకొద్దీ కేసులోని అసలు నిజాలు బయటపడుతూ ప్రేక్షకుడిని స్క్రీన్‌కు కట్టిపడేస్తాయి.
హత్రాస్ 16 డేస్ ఓటీటీ స్ట్రీమింగ్
సమాజంలో జరిగే అన్యాయాలు, వ్యవస్థలోని లోపాలను కళ్లకు కట్టినట్లు చూపే 'హత్రాస్: 16 డేస్' కేవలం వినోదం మాత్రమే కాకుండా, ఒక సామాజిక స్పృహను రగిలిస్తుంది. 'జీ5' (ZEE5)లో హత్రాస్ 16 డేస్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ధైర్యం చేసి చూడాలనుకునే క్రైమ్ థ్రిల్లర్ ప్రియులు ఈ సిరీస్‌ను జీ5 ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు.