...
...
Next Story

నవ్వుకుందామని వస్తే కంటతడి పెట్టించారని అంటున్నారు.. హీరో నవీన్ పోలిశెట్టి కామెంట్స్

సంక్రాంతి 2026కి థియేటర్లలో ఏకంగా ఐదు సినిమాలు విడుదల అయ్యాయి. వాటిలో ఒకటే అనగనగా ఒక రాజు. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జోడీ కట్టిన ఈ సినిమా జనవరి 14న విడుదలై మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో సక్సెస్ మీట్ నిర్వహించగా.. హీరో నవీన్ పోలిశెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Published on: Jan 17, 2026, 10:00:57 IST
Advertisement

ఈ సంక్రాంతిని నవ్వుల పండుగలా మార్చడానికి 'అనగనగా ఒక రాజు' చిత్రంతో థియేటర్లలో అడుగుపెట్టారు స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి. మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో రూపొందించారు.

నవీన్‌కు జోడీగా మీనాక్షి చౌదరి

నవ్వుకుందామని వస్తే కంటతడి పెట్టించారని అంటున్నారు.. హీరో నవీన్ పోలిశెట్టి కామెంట్స్
నవ్వుకుందామని వస్తే కంటతడి పెట్టించారని అంటున్నారు.. హీరో నవీన్ పోలిశెట్టి కామెంట్స్

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య అనగనగా ఒక రాజు సినిమాను నిర్మించారు. నూతన దర్శకుడు మారి డైరెక్టర్‌గా పరిచయం అయిన అనగనగా ఒక రాజు సినిమాలో నవీన్ పోలిశెట్టికి జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది.

సంక్రాంతి కానుకగా

మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన అనగనగా ఒక రాజు సినిమా భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, మొదటి ఆట నుంచే అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది ఈ సినిమా.

అసలు సిసలైన పండుగ

కడుపుబ్బా నవ్వించడమే కాకుండా, చివరిలో భావోద్వేగ సన్నివేశాలతో హృదయాలను హత్తుకొని.. అసలు సిసలైన పండగ సినిమాలా ఉందని 'అనగనగా ఒక రాజు' చూసిన ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు.

అనగనగా ఒక రాజు సక్సెస్ మీట్

మొదటి షో నుంచే 'అనగనగా ఒక రాజు' సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో.. మూవీ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అనగనగా ఒక రాజు సక్సెస్ మీట్‌లో హీరో నవీన్ పోలిశెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఓవర్సీస్ ప్రీమియర్ షోల నుంచి

"ఇంకా ఈ సినిమా చూడనివారు టికెట్ బుక్ చేసుకొని వెళ్లండి. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. జనవరి 14న ఉదయం హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూశాము. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అనే తేడా లేకుండా సినిమా అంతా నవ్వుతూనే ఉన్నారు ప్రేక్షకులు. అదే సమయంలో క్లైమాక్స్ లో ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయిందని అంటున్నారు" అని నవీన్ పోలిశెట్టి తెలిపాడు.

చివరిలో కంటతడి

"హాయిగా నవ్వుకుందామని వస్తే, చివరిలో కంటతడి పెట్టించారు అంటూ ఎందరో ప్రశంసిస్తున్నారు. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్‌ని ఇచ్చిన ప్రేక్షకులకు పేరు పేరునా కృతఙ్ఞతలు. మాకు మద్దతుగా నిలిచిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు" అని నవీన్ పోలిశెట్టి చెప్పాడు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe