ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఆ సినిమానే హే బల్వంత్. హే బల్వంత్ సినిమాకు గోపి ఆచార్య దర్శకత్వం వహించటంతో పాటు కో రైటర్‌గానూ వర్క్ చేశారు. ఈ సినిమాలో సుహాస్, శివాని నాగరం హీరో హీరోయిన్లుగా నటించగా.. ప్రముఖ నటుడు వీకే నరేష్ కీలక పాత్రను పోషించారు.
తండ్రి చేసే వ్యాపారం తెలియడంతో

త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి.నరేంద్ర రెడ్డి ఈ మూవీని నిర్మించారు. గుంటూరు నేపథ్యంలో ‘హే బల్వంత్’ సినిమాను రూపొందించారు. యువకుడైన కృష్ణ(సుహాస్)కు తండ్రి వ్యాపారాన్ని కొనసాగించాలనే ఆసక్తి ఉంటుంది. అయితే తన తండ్రి చేసే వ్యాపారం ఏదో తెలియడంతో తను షాకవుతాడు.
ప్రేమ నైతిక విలువలు
అదే సమయంలో మిత్ర (శివానీ నాగరం)తో ప్రేమలో ఉంటాడు. మిత్ర ఓ ఎన్‌జీఓను నడుపుతుంటుంది. ప్రేమ, నైతిక విలువలు, తన తండ్రి రావు బాల్వంత్ చేసే బిజినెస్ విషయం తెలిస్తే ఏమవుతుందనే ఆలోచనల మధ్య కృష్ణ ఇరుక్కుపోతాడు.
నిజానిజాలు ఏంటీ
ఈ క్రమంలో వచ్చే కడుపుబ్బా నవ్వించే కామెడీ, తండ్రీ కొడుకు మధ్య అనుబంధం, అసలేం జరిగిందనే నిజానిజాలు, చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు?, తండ్రి చేసే వ్యాపారం ఏంటీ? అనేదే అసలు కథాంశంగా హే బలవంత్ సినిమా రూపొందింది.
హే బల్వంత్ ఓటీటీ స్ట్రీమింగ్
ఇలా ఫ్యామిలీ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన హే బల్వంత్ ఓటీటీలోకి వచ్చేయనుంది. మార్చి 31 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి నాలుగు భాషల్లో హే బల్వంత్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది. జీ5లో హే బల్వంత్ ఓటీటీ రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన విషయాన్ని తాజాగా ఇవాళ (మార్చి 27) అధికారికంగా ప్రకటించారు.
హీరో సుహాస్ కామెంట్స్
హే బల్వంత్ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ సందర్భంగా హీరో సుహాస్ మాట్లాడుతూ.. "ఈ సినిమా నాకెంతో నచ్చింది. ఎందుకంటే ఇది ఆశయాలు, కుటుంబం, మనం ఎక్కువగా పట్టించుకోని నైతిక సందిగ్ధత గురించి చెబుతుంది" అని అన్నాడు.
జీ5 ఓటీటీ ద్వారా
{{/usCountry}}హే బల్వంత్ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ సందర్భంగా హీరో సుహాస్ మాట్లాడుతూ.. "ఈ సినిమా నాకెంతో నచ్చింది. ఎందుకంటే ఇది ఆశయాలు, కుటుంబం, మనం ఎక్కువగా పట్టించుకోని నైతిక సందిగ్ధత గురించి చెబుతుంది" అని అన్నాడు.
జీ5 ఓటీటీ ద్వారా
{{/usCountry}}"సినిమాలో మంచి కామెడీ ఉంది. అలాగే హృదయాన్నిహత్తుకునే భావోద్వేగం ఉంది. నిజాయతీతో చేసిన ప్రయత్నం కనిపిస్తుంది. ఈ సినిమా ఇప్పుడు జీ5 ఓటీటీ ద్వారా ప్రేక్షకుల దగ్గరకు చేరుతుండటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుందని నమ్మకముంది" అని సుహాస్ తెలిపాడు.
వైవిధ్యమైన, అర్థవంతమైన కథలు
అలాగే, సీనియర్ నటుడు వీకే నరేష్ మాట్లాడుతూ.. "హే బల్వంత్ సినిమాలో తండ్రీ కొడుల మధ్య ఉన్న అనుబంధాన్ని ఎంతో అందంగా చూపించారు. ఇందులో బల్వంత్ పాత్ర చేయటం సాధారణ విషయం కాదు. నటుడిగా నాలో భిన్నమైన కోణాన్ని ఆవిష్కరించిన సినిమా ఇది. వైవిధ్యమైన, అర్థవంతమైన తెలుగు కథలను ఎప్పటికప్పుడు ప్రోత్సహించే జీ5 ఓటీటీలో ఈ సినిమా విడుదలవడం నాకు చాలా సంతోషంగా ఉంది" అని పేర్కొన్నారు.