They Will Kill You OTT Release On 5 Platforms: మన టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో ‘కామెడీ ప్లస్ హారర్’ జోనర్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేటర్లలో ఈ తరహా సినిమాలు వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి.
ఓటీటీ హారర్ యాక్షన్ థ్రిల్లర్

సరిగ్గా ఇలాంటి విభిన్నమైన కథాంశంతో, రక్తపాతం, మైండ్ గేమ్, హింసతో థ్రిల్ పంచే అంతర్జాతీయ డార్క్ కామెడీ హారర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘దే విల్ కిల్ యూ’ (They Will Kill You) ఓటీటీ ప్రియులను పలకరించింది. ఒకటి, రెండు కాదు ఏకంగా 5 ఓటీటీల్లోకి దే విల్ కిల్ యూ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
2026 మార్చి 26న యూఎస్‌ఏ థియేటర్లలో విడుదలై, ప్రపంచవ్యాప్తంగా హారర్ థ్రిల్లర్ లవర్స్‌ను ఆకట్టుకున్న ఈ సినిమా 3 నెలలకు దే విల్ కిల్ యూ ఓటీటీలోకి రావడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.
మైండ్ గేమ్‌తో సీన్స్
కిరిల్ సోకోలోవ్, అలెక్స్ లిట్వాక్ సంయుక్తంగా దే విల్ కిల్ యూ సినిమా కథను అందిస్తూ దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. యాక్షన్, హారర్, సస్పెన్స్‌తో పాటు నవ్వించేలా డార్క్ కామెడీని సమానంగా దట్టించి ఈ సినిమాను అద్భుతంగా మలిచారు. సాధారణ హారర్ సినిమాల్లా కేవలం రక్తం చిందే దారుణమైన హింస కాకుండా, మైండ్ గేమ్‌తో నడిచే సస్పెన్స్ ఎలిమెంట్స్ ఈ చిత్రానికి ప్రధాన బలం అని చెప్పుకోవచ్చు.
హ్యారీపోటర్ స్టార్‌తో కూడిన భారీ తారాగణం
ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన జాజీ బీట్జ్ అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఆమెతో పాటు హాలీవుడ్ ప్రముఖ నటీనటులు ప్యాట్రిసియా ఆర్క్వెట్, మైహాలా కీలక పాత్రలు పోషించారు.
{{/usCountry}}ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన జాజీ బీట్జ్ అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఆమెతో పాటు హాలీవుడ్ ప్రముఖ నటీనటులు ప్యాట్రిసియా ఆర్క్వెట్, మైహాలా కీలక పాత్రలు పోషించారు.
{{/usCountry}}ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్న ‘హ్యారీ పోటర్’ సిరీస్ ఫేమ్ డ్రాకో మాల్‌ఫాయ్ (టామ్ ఫెల్టన్) ఈ సినిమాలో ఒక విభిన్నమైన పాత్రలో కనిపించి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. వీరితో పాటు హీథర్ గ్రాహం, ప్యాటర్సన్ జోసెఫ్ తమ నటనతో సినిమా స్థాయిని పెంచారు.
లగ్జరీ బిల్డింగ్ వెనుక దాగున్న భయంకర రహస్యం!
ఈ సినిమా కథాంశం మొత్తం న్యూయార్క్ నగరంలోని ‘వర్జిల్’ అనే ఒక అత్యంత విలాసవంతమైన భవనం చుట్టూ తిరుగుతుంది. నేరచరిత్ర ఉన్న ఆసియా రీవ్స్ (జాజీ బీట్జ్) అనే యువతి జైలు నుంచి విడుదలై వర్జిల్ బిల్డింగ్‌లో మెయిడ్‌గా పనికి చేరుతుంది.
అయితే, అలా ఆసియా ఉద్యోగంలో చేరడం వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది. అదే భవనంలో పనిచేస్తూ హఠాత్తుగా అదృశ్యమైన తన సోంత చెల్లెలు మరియా కోసం ఆమె వెతుకులాట ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో ఆ బిల్డింగ్‌లో నివసించే కోటీశ్వరులంతా ఒక భయంకరమైన సాతాను (Satanic Cult) అనే రహస్య హంతక ముఠాగా ఏర్పడిందని, వారు అమరత్వం కోసం మనుషులను బలి ఇస్తారని తెలుసుకుంటుంది ఆసియా.
5 ఓటీటీల్లోకి
అక్కడి నుంచి ఆమె తన ప్రాణాలను కాపాడుకుంటూ, చెల్లెలిని ఎలా వెతికి పట్టుకుందా?, ఆ హంతక ముఠా నుంచి తన చెల్లెలిని కాపాడుకుందా? ప్రాణాలతో ఆసియా బయటపడిందా? అనేదే ఈ సినిమా మిగిలిన కథ. ఈ కథను రక్తం పారే యాక్షన్ సీన్లతో చూపించారు.
ఇలా రక్తం ఏరులై పారే యాక్షన్ సీన్లతోపాటు భయపెట్టే హారర్ ఎలిమెంట్స్‌తో సాగే దే విల్ కిల్ యూ ఏకంగా 5 ఓటీటీల్లోకి వచ్చేసింది. భారత్‌లోని ఓటీటీ ఆడియెన్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), యాపిల్ టీవీ (Apple TV), గూగుల్ యూట్యూబ్ (YouTube) వేదికల ద్వారా ఈ సినిమాను అద్దెకు (Rental) తీసుకోవడం లేదా పూర్తిగా కొనుగోలు (Purchase) చేయడం ద్వారా వీక్షించవచ్చు.
దే విల్ కిల్ యూ ఓటీటీ స్ట్రీమింగ్
అయితే, హెచ్‌బీవో మ్యాక్స్ ఓటీటీలో (HBO Max OTT) రెంటల్ విధానం లేకుండా సబ్‌స్క్రిప్షన్‌తో ఫ్రీగా దే విల్ కిల్ యూ సినిమాను చూసేయొచ్చు. ఇదే కాకుండా ఫండంగో ఎట్ హోమ్ (Fandango at Home OTT) అనే మరో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో కూడా దే విల్ కిల్ యూ ఓటీటీ రిలీజ్ అయింది. ఇలా ఐదింట్లో జూన్ 12 నుంచి దే విల్ కిల్ యూ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.