Illu Illalu Pillalu June 29th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూన్ 29 ఎపిసోడ్ లో వల్లి కడుపు పోయేందుకు నర్మదనే కారణమని వేదవతి, చందు అంటారు. నర్మద చాలా ఫీల్ అవుతుంది. మరోవైపు డ్యాన్స్ కాంపిటీషన్ కోసం ఎలా వెళ్లాలా? అని ప్రేమ ఆలోచిస్తుంటుంది. ఇంకా ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.
నర్మద బాధ

అత్త కొట్టిన చెంప దెబ్బకు, అన్న మాటలకు బయట కూర్చుని నర్మద బాధ పడుతుంది. అప్పుడే ప్రేమ, ధీరజ్ వస్తారు. అత్తతో మాట్లాడి తేల్చుకుందామని ప్రేమ అంటుంది. కానీ నర్మద ఆపుతుంది. వల్లి కడుపు విషయం అత్తకు తెలియదు. నేను బండిపై తీసుకెళ్లడం వల్లే యాక్సిడెంట్ అయిందని, అబార్షన్ అయిందని అనుకుంటున్నారు. అత్తయ్యకు నా మీద కోపం ఉండటంలో తప్పేం ఉందని నర్మద అంటుంది.
ఆధారం లేదని
పెద్దోడు, నాన్న గురించి ఆలోచించి వల్లి వదినను వదిలేశాం. అసలు ఆమె ప్రెగ్నెన్సీ డ్రామా గురించి ముందే చెప్పేసి ఉంటే నువ్వు చేయని తప్పునకు నిందలు మోసే దానివి కాదు వదిన అని ధీరజ్ అంటాడు. ఇప్పుడు మనకు అనుమానం తప్ప, ఆధారం లేదు. ఎలా నిరూపిస్తాం ధీరజ్ అని నర్మద అడుగుతుంది. వల్లిని అత్తయ్య గుడ్డిగా నమ్ముతోంది. అందుకే చేయి చేసుకుంది కానీ, అంతకుమించి కోపం ఏం లేదు. ఆవిడే అర్థం చేసుకుంటుందని నర్మద చెప్తుంది.
మరోవైపు ఇంట్లో ఒంటరిగా కూర్చుని వేదవతి ఏడుస్తుంటుంది. వల్లికి అబార్షన్ అయిందనే మాటలను, నర్మదను కొట్టిన సంగతిని గుర్తు చేసుకుని బాధపడుతుంది.
రాజ పుష్పం కాల్
{{/usCountry}}మరోవైపు ఇంట్లో ఒంటరిగా కూర్చుని వేదవతి ఏడుస్తుంటుంది. వల్లికి అబార్షన్ అయిందనే మాటలను, నర్మదను కొట్టిన సంగతిని గుర్తు చేసుకుని బాధపడుతుంది.
రాజ పుష్పం కాల్
{{/usCountry}}ఇక ప్రేమ ఫొటోను చూస్తూ రాజ పుష్పం ఆమెకు కాల్ చేస్తాడు. ధీరజ్ ఆ కాల్ లిఫ్ట్ చేస్తాడు. రాజ పుష్పం విజిల్ వేస్తాడు. అప్పుడు ధీరజ్ కూడా విజిల్ వేస్తాడు. ధీరజ్ వాయిస్ వినగానే రాజ పుష్పం షాక్ అవుతాడు. ప్రేమ మొగుడిని అని ధీరజ్ చెప్పగానే.. ప్రేమకు పెళ్లి అయిపోయిందా అని రాజ పుష్పం అడుగుతాడు.
డ్యాన్స్ మేనేజర్ అని చెప్పగానే ప్రేమ ఫోన్ లాక్కుని మాట్లాడుతుంది. నిన్ను ఎప్పుడు ఎప్పుడు చూస్తానా అనిపిస్తుంది. నీ అందమైన డ్యాన్స్ ను లైవ్ లో చూడాలని వెయిట్ చేస్తున్నా. నువ్వు రాకపోతే నా జాబ్ పోతుందని రాజ పుష్పం అంటాడు. నాకు రావాలని ఉంది కానీ మా ఆయన ఒప్పుకోవడం లేదని ప్రేమ చెప్తుంది. ఈ మొగుళ్లు అంతా ఇంతే అని ప్రేమకు మాయ మాటలు చెప్తాడు రాజ పుష్పం. మా ఆయన్ని కన్విన్స్ చేస్తానని ప్రేమ చెప్తుంది.
ఆ మేనేజర్ అర్ధరాత్రి ఫోన్ చేయడం ఏంటి? అని ప్రేమపై ధీరజ్ సీరియస్ అవుతాడు. నేను వెళ్లననే అంటున్నా, కానీ అతనే రమ్మంటున్నాడని ప్రేమ చెప్తుంది. నేను వద్దన్నా వెళ్తావా? అని ధీరజ్ అడిగితే, వెళ్లనని ప్రేమ అబద్ధం చెప్తుంది. ఏదో ఒకటి చేసి వెళ్లాలని అనుకుంటుంది.
ఫీల్ అయిన రామరాజు
రామరాజు బెడ్ పై ఓ మూలన కూర్చుని ఫీల్ అవుతుంటాడు. అప్పుడే వేదవతి వచ్చి భోజనం చేద్దాం రమ్మని అడుగుతుంది. మరో నాలుగైదు నెలల్లో ఈ ఇంటికి మూడో తరం వారసుడు వస్తాడని కలలు కన్నానని రామరాజు తెగ ఫీల్ అయిపోతాడు. ఆ దేవుడు ఇలా చేశాడంటే, మనకేదో గొప్పదే ఇవ్వబోతున్నాడని అర్థం అని వేదవతి ఓదార్చుతుంది.
వినిపించుకోని చందు
మరోవైపు చందు బాధపడుతుంటే ధీరజ్, నర్మద అతని దగ్గరకు వెళ్తారు. అప్పుడే వచ్చిన సాగర్ ఏమైందని అడుగుతాడు. పెద్ద వదినకు అబార్షన్ అయిందని ధీరజ్ చెప్తాడు. ఎలా జరిగిందని సాగర్ అడిగితే, మా కర్మ కొద్ది అలా జరిగిపోయిందని చందు చెప్తాడు. సాగర్ లోపలికి వెళ్లగానే వల్లి కడుపు డ్రామా గురించి చెప్పాలని నర్మద ప్రయత్నిస్తుంది. కానీ చందు వినిపించుకోడు. తోడి కోడలు కడుపు పోగొట్టేంత కోపం ఉండటం కరెక్ట్ కాదు నర్మద అని చందు లోపలికి వెళ్లిపోతాడు.
వేదవతి కోపం
పొద్దున వల్లి మేకప్ వేసుకుంటూ సంబరపడిపోతుంది. ఇంత పొద్దునే రెడీ అవుతున్నావేంటీ అని సుకన్య అడుగుతుంది. మా అత్త నర్మదను చీ కొడితే చూడటానికి వెళ్తున్నానని వల్లి చెప్తుంది. మరోవైపు కిచెన్ లో వేదవతి వంట చేస్తుంటుంది. నర్మద వచ్చి గుడ్ మార్నింగ్ వేదవతి గారు అని అడిగితే.. వేదవతి కోపంతో గిన్నెలన్నీ కింద కొడుతుంది.
నేను చెప్పేది ఒక సారి వినండి. ఇన్ని రోజులు నిజమైన నా మాటలు ఇప్పుడు అబద్ధం అయ్యాయా? అని అత్తతో నర్మద అంటుంది. మీకు చెప్పాల్సిన నిజాలు, విషయాలు ఉన్నాయి అని నర్మద చెప్పే ప్రయత్నం చేస్తుంటే వేదవతి వినదు. కూర కావాలని అడిగితే, వేదవతి కోపంగా గిన్నెలను విసిరి కొడుతుంది. అప్పుడే రామరాజు వస్తాడు. వేరు పడ్డారు కదా మరి కూర అని ఎందుకు వస్తున్నారని వేదవతి అంటుంది.
ఇదంతా చూస్తూ వల్లి తెగ హ్యాపీగా సైకో ఆనందం పొందుతుంది. అత్తయ్య మాటలను ఏం పట్టించుకోకని నర్మదకు రామరాజు చెప్పడంతో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.