Horror Thriller Immaculate OTT Release In 3 Platforms: హాలీవుడ్ హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులలో ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. థియేటర్లలో మిస్ అయినా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఇలాంటి మిస్టరీ హారర్ చిత్రాలను చూసేందుకు సినిమా ప్రియులు విపరీతమైన ఆసక్తి చూపిస్తుంటారు.
స్వచ్ఛమైనది అని అర్థం

ఈ క్రమంలోనే అంతర్జాతీయ వేదికలపై ఆకట్టుకున్న మిస్టరీ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'ఇమ్మాక్యులేట్' (Immaculate) ఓటీటీలోకి వచ్చేసింది. ఇమ్మాక్యులేట్ అంటే నిర్మలమైన, పరిశుభ్రమైన, స్వచ్ఛమైన అనే అర్థాలు వస్తాయి. ప్రస్తుతం 3 ఓటీటీల్లో ఇమ్మాక్యులేట్ స్ట్రీమింగ్ అవుతోంది.
అసలు కథేంటంటే?
'యుఫోరియా', 'ఎనీవన్ బట్ యూ' చిత్రాలతో గ్లోబల్ క్రష్‌గా మారిన బోల్డ్ బ్యూటీ సిడ్నీ స్వీనీ లీడ్ రోల్ పోషించింది. ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ మిస్టరీ హారర్ థ్రిల్లర్ ఇమ్మాక్యులేట్ సినిమా కథ మొత్తం ఒక వింత మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. సిసిలియా అనే యువతి ఒక గడ్డకట్టిన సరస్సులో పడి ప్రాణాపాయ స్థితి నుంచి తృటిలో తప్పుకుంటుంది.
దేవుడే తనను కాపాడాడని నమ్మిన సిసిలియా, పూర్తిగా క్రైస్తవ మతం వైపు మళ్లుతుంది. ఈ క్రమంలోనే ఆమెకు ఇటలీలోని ఒక పురాతన కాన్వెంట్ (కన్యల ఆశ్రమం) నుంచి ఫాదర్ సాల్ టెడెస్చీ ద్వారా ఆహ్వానం అందుతుంది. దేవుడి సేవలో తరించాలని సిసిలియా సంతోషంగా ఇటలీ బయలుదేరుతుంది. అక్కడ సన్యాసిని (నన్) మారడానికి దీక్ష తీసుకుంటుంది.
కన్య గర్భం దాలిస్తే..?
అయితే, ఆ ఆశ్రమంలో అడుగుపెట్టిన కొన్ని రోజులకే కథ ఊహించని మలుపు తిరుగుతుంది. కన్య అయిన సిసిలియా గర్భం దాలుస్తుంది. శారీరక బంధాలకు దూరంగా ఉండే ఆ ఆశ్రమంలో నన్ ప్రెగ్నెంట్ ఎలా అయిందో ఎవరికీ అర్థం కాదు. అసలు ఈ గర్భం వెనుక ఉన్న రహస్యం ఏంటి? దేవుడి మహిమా లేక ఎవరిదైనా కుతంత్రామా అని సిసిలియా అన్వేషించడం మొదలుపెడుతుంది.
{{/usCountry}}అయితే, ఆ ఆశ్రమంలో అడుగుపెట్టిన కొన్ని రోజులకే కథ ఊహించని మలుపు తిరుగుతుంది. కన్య అయిన సిసిలియా గర్భం దాలుస్తుంది. శారీరక బంధాలకు దూరంగా ఉండే ఆ ఆశ్రమంలో నన్ ప్రెగ్నెంట్ ఎలా అయిందో ఎవరికీ అర్థం కాదు. అసలు ఈ గర్భం వెనుక ఉన్న రహస్యం ఏంటి? దేవుడి మహిమా లేక ఎవరిదైనా కుతంత్రామా అని సిసిలియా అన్వేషించడం మొదలుపెడుతుంది.
{{/usCountry}}ఆ క్రమంలోనే కాన్వెంట్‌లో జరిగే కొన్ని అతీత శక్తుల (పారానార్మల్) భయానక సంఘటనలను సిసిలియా ఎదుర్కొంటుంది. అక్కడ నుంచి ప్రాణాలతో బయటపడేందుకు పారిపోవాలని చూసిన సిసిలియాను కొన్ని శక్తులు అడ్డుకుంటాయి. చివరికి ఆ గర్భంలో పెరుగుతున్న పిండం వెనుక ఉన్న భయంకరమైన సత్యాన్ని ఆమె ఎలా కనుగొంది? తన ప్రాణాలను ఎలా కాపాడుకుంది? అనేదే మిగతా కథ.
ప్రతిభావంతులైన నటీనటులు
ఇమ్మాక్యులేట్ సినిమాలో సిస్టర్ సిసిలియాగా సిడ్నీ స్వీనీ తన నటనతో భయపెట్టడమే కాకుండా గ్లామర్ పరంగానూ మెప్పించింది. 'మనీ హైస్ట్' ఓటీటీ సిరీస్‌లో 'ప్రొఫెసర్' పాత్రతో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకున్న స్పానిష్ నటుడు అల్వారో మోర్టె ఇందులో ఫాదర్ సాల్ టెడెస్చీగా కీలక పాత్ర పోషించారు.
సిస్టర్ గ్వెన్‌గా బెనెడెట్టా పొరకరోలి, మదర్ సుపీరియర్‌గా డోరా రొమానో, కార్డినల్ ఫ్రాంకో మెరోలాగా జార్జియో కొలాంగేలి నటించారు. ఆండ్రూ లోబెల్ అందించిన అద్భుతమైన స్క్రిప్ట్‌తో దర్శకుడు మైఖేల్ మోహన్ ఈ హారర్ థ్రిల్లర్‌ను సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్‌గా తెరకెక్కించారు.
మరో ఓటీటీలోకి
ఈ చిత్రాన్ని బ్లాక్ బేర్ పిక్చర్స్, మిడిల్ చైల్డ్ పిక్చర్స్, ఫిఫ్టీ ఫిఫ్టీ ఫిల్మ్స్ బ్యానర్లపై డేవిడ్ బెర్నాడ్, సిడ్నీ స్వీనీ, జోనాథన్ డేవినో, మైఖేల్ హీమ్లర్ సంయుక్తంగా నిర్మించారు. ఇదివరకు రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోన్న హారర్ థ్రిల్లర్ ఇమ్మాక్యులేట్ ఇటీవల మరోదాంట్లోకి వచ్చేసింది.
2024లో థియేట్రికల్ రిలీజ్ అయిన ఇమ్మాక్యులేట్ అదే సంవత్సరం సెప్టెంబర్ 6న బుక్ మై షో ఓటీటీలోకి వచ్చేసింది. అయితే, రూ. 149 చెల్లింపుతో రెంటల్ విధానంలో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అయింది. అనంతరం అమెజాన్ ప్రైమ్‌లో ఎలాంటి అద్దె పద్ధతి లేకుండా ఇంగ్లీష్‌లో ఇమ్మాక్యులేట్ ఓటీటీ రిలీజ్ అయింది.
జియో హాట్‌స్టార్ ఓటీటీలో
ఇటీవల జూన్ 5 నుంచి జియో హాట్‌స్టార్‌లో ఇమ్మాక్యులేట్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, జియో హాట్‌స్టార్ ఓటీటీలో కేవలం ఇంగ్లీష్‌లో మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, హిందీ వంటి నాలుగు భాషల్లో ఇమ్మాక్యులేట్ అందుబాటులోకి వచ్చేసింది.
హారర్ జోనర్ ఇష్టపడేవారికి 3 ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఇమ్మాక్యులేట్ సినిమాను చూసేయొచ్చు. తెలుగులో కావాలనుకునేవారు జియో హాట్‌స్టార్ ఓటీటీని ఎంచుకోవడం బెటర్.