Imran Khan Asked To Leave India By October 28th: బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ మేనల్లుడు, యంగ్ హీరో ఇమ్రాన్ ఖాన్కు భారత ప్రభుత్వం నుంచి ఊహించని షాక్ తగిలింది. ఈ నెల అంటే అక్టోబర్ 28వ తేదీలోగా దేశం విడిచి వెళ్లాలని ఫారెనర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) ఆయనకు నోటీసులు జారీ చేసింది.
నిబంధనలకు విరుద్ధంగా

ఓసీఐ (ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా) కార్డు ఆధారంగా భారతదేశంలో నివసిస్తున్న ఇమ్రాన్ ఖాన్, నిబంధనలకు విరుద్ధంగా ఒక రాజకీయ ఆందోళనలో పాల్గొన్నారనే ఆరోపణలతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
ముంబైలోని ఖార్ ప్రాంతంలో నివసిస్తున్న ఇమ్రాన్ ఖాన్ అమెరికా పౌరుడు. అక్టోబర్ 10న ముంబై సెంట్రల్లోని అగస్ట్ క్రాంతి మైదాన్లో 'కాక్రోచ్ జనతా పార్టీ' ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమం జరిగింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) విధానంలో అక్రమాలు జరిగాయంటూ సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా నిర్వహించారు. ఈ నిరసనల్లో హీరో ఇమ్రాన్ ఖాన్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
కిరీట్ సోమయ్య ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం
అమెరికా పాస్పోర్ట్, ఓసీఐ కార్డు ఉన్న విదేశీ పౌరుడు భారతదేశంలో రాజకీయ నిరసనల్లో ఎలా పాల్గొంటారని బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య ముంబై పోలీసులకు, ఎఫ్ఆర్ఆర్ఓ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇమ్రాన్ ఖాన్ అమెరికాలోనే పుట్టి చదువుకున్నారని, ఇక్కడ సినిమాలు చేస్తూ ఉపాధి పొందుతూనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని సోమయ్య ఆరోపించారు.
దీనిపై విచారణ చేపట్టిన కేంద్ర హోం శాఖ పరిధిలోని నిఘా యంత్రాంగం, నిబంధనల ఉల్లంఘన జరిగిందని స్పష్టం చేస్తూ ఆయన్ను అక్టోబర్ 28 లోపు దేశం విడిచి వెళ్లాలని ఉత్తర్వులు ఇచ్చింది. భారత ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం ఓసీఐ కార్డుదారులకు ఇక్కడ నివసించడానికి, వ్యాపార-ఉపాధి అవకాశాలు పొందేందుకు పూర్తి హక్కులు ఉంటాయి.
{{/usCountry}}దీనిపై విచారణ చేపట్టిన కేంద్ర హోం శాఖ పరిధిలోని నిఘా యంత్రాంగం, నిబంధనల ఉల్లంఘన జరిగిందని స్పష్టం చేస్తూ ఆయన్ను అక్టోబర్ 28 లోపు దేశం విడిచి వెళ్లాలని ఉత్తర్వులు ఇచ్చింది. భారత ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం ఓసీఐ కార్డుదారులకు ఇక్కడ నివసించడానికి, వ్యాపార-ఉపాధి అవకాశాలు పొందేందుకు పూర్తి హక్కులు ఉంటాయి.
{{/usCountry}}అయితే ఓటు వేసే హక్కు గానీ, రాజకీయ ప్రచారాలు, ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు, ధర్నాలలో పాల్గొనే హక్కు గానీ విదేశీ పౌరులకు ఉండవు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే ఓసీఐ రద్దు చేయడమే కాకుండా దేశం నుంచి పంపించే అధికారం ఎఫ్ఆర్ఆర్ఓకు ఉంటుంది.
"పౌరుడిగానే వచ్చాను" – ఇమ్రాన్ ఖాన్ వివరణ
ధర్నా స్థలి వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్ తన చర్యలను సమర్థించుకున్నారు. "నేను ఇక్కడ ఎటువంటి ప్రత్యేక డిమాండ్లతో రాలేదు. ఈ నగరంలో నివసిస్తున్న ఒక సాధారణ పౌరుడిగా మాత్రమే వచ్చాను. ప్రజల స్వేచ్ఛను ఎందుకు అడ్డుకుంటున్నారు, వారి గొంతును ఎందుకు నొక్కుతున్నారో తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చాను" అని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ ఆందోళన సమయంలో ఇమ్రాన్ ఖాన్తో పాటు ఆయన స్నేహితురాలు లేఖా వాషింగ్టన్, అమీర్ ఖాన్ మేనకోడలు, డెకాయిట్ నటి జైన్ మేరీ సహా సుమారు 400 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భౌతికదాడికి పాల్పడ్డారు
కస్టడీలో ఉన్న సమయంలో అధికారులు తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని, నెట్టివేశారని జైన్ మేరీ ఆరోపిస్తూ దెబ్బతిన్న గాయాలను వీడియో ద్వారా ప్రదర్శించడం తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం ఎఫ్ఆర్ఆర్ఓ జారీ చేసిన ఉత్తర్వులపై ఇమ్రాన్ ఖాన్ చట్టపరంగా ఎలా ముందుకు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది.