...
...
Next Story

Isakapatnam Review: ఇసకపట్నం రివ్యూ- ఓటీటీలోకి ఇవాళ వచ్చిన క్రైమ్ డ్రామా- సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ సిరీస్ ఎలా ఉందంటే?

OTT Series Isakapatnam Review In Telugu: ఓటీటీలోకి ఇవాళ తెలుగు పొలిటికల్ రివేంజ్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ఇసకపట్నం. సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ తండ్రికూతుళ్లుగా నటించిన ఇసకపట్నం అమెజాన్ ప్రైమ్‌లో 7 ఎపిసోడ్లతో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో నేటి ఇసకపట్నం రివ్యూలో చూద్దాం.

Published on: Jul 2, 2026, 13:20:20 IST
Advertisement

OTT Series Isakapatnam Review In Telugu And Rating: తెలుగు డిజిటల్ ఓటీటీ స్పేస్‌లో ఇటీవల కాలంలో రా అండ్ రస్టిక్ క్రైమ్ థ్రిల్లర్లకు ఆదరణ బాగా పెరిగింది. ఈ కోవలోనే ఒక రేవు నగరం, అక్కడి అండర్ వరల్డ్ మాఫియా సామ్రాజ్యం చుట్టూ తిరిగే పవర్ పాలిటిక్స్, రివేంజ్, క్రైమ్ కథాంశంతో ఓటీటీ రిలీజ్ అయిన సరికొత్త తెలుగు వెబ్ సిరీస్ 'ఇసకపట్నం'.

ఇసకపట్నం ఓటీటీ రివ్యూ

ఇసకపట్నం రివ్యూ- ఓటీటీలోకి ఇవాళ వచ్చిన క్రైమ్ డ్రామా- సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ సిరీస్ ఎలా ఉందంటే?
ఇసకపట్నం రివ్యూ- ఓటీటీలోకి ఇవాళ వచ్చిన క్రైమ్ డ్రామా- సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ సిరీస్ ఎలా ఉందంటే?

ఎడిటర్ నుంచి దర్శకుడిగా మారిన గ్యారీ బిహెచ్ ఈ ఓటీటీ సిరీస్‌ను డైరెక్ట్ చేశారు. సముద్రఖని, ఐశ్వర్య రాజేష్, నరేష్ అగస్త్య, సునీల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇవాళ్టీ (జూలై 2) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఇసకపట్నం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఏడు ఎపిసోడ్‌లతో ఉన్న ఈ ఓటీటీ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో నేటి ఇసకపట్నం రివ్యూలో తెలుసుకుందాం.

టైటిల్: ఇసకపట్నం

నటీనటులు: సముద్రఖని, ఐశ్వర్య రాజేష్, నరేష్ అగస్త్య, సునీల్, సుధాకర్ కోమాకుల, మైమ్ గోపి, రాజా చెంబోలు, రాజీవ్ కనకాల బెనర్జీ తదితరులు

దర్శకత్వం: గ్యారీ బీహెచ్

సంగీతం: ప్రవీణ్ లక్కరాజు

సినిమాటోగ్రఫి: వంశీ పచ్చిపులుసు

నిర్మాతలు: రాహుల్ తమడ, సందీప్ రెడ్డి బొర్ర

ఓటీటీ రిలీజ్ డేట్:

ఓటీటీ వేదిక: అమెజాన్ ప్రైమ్

కథేంటంటే?

విశాఖపట్నం నగరానికి ప్రత్యామ్నాయంగా ఇక్కడ 'ఇసకపట్నం' అనే పోర్ట్ టౌన్‌ను చూపించారు. ఈ ఊరిని తన గుప్పిట్లో పెట్టుకుని శాసిస్తుంటాడు క్రూరుడైన గ్యాంగ్‌స్టర్ నాయుడు (సముద్రఖని). భయం, హింసతోనే దేన్నైనా అదుపు చేయవచ్చని నమ్మే రకం అతను. కోటయ్య (బెనర్జీ) మాత్రమే అతనికి బాగా నమ్మకస్థుడు.

పైకి చూస్తే పక్కా కమర్షియల్ క్రైమ్ రివేంజ్ పొలిటికల్ డ్రామాగా అనిపించే 'ఇసకపట్నం' కథనం ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. అయితే స్టోరీ చూస్తే పాతదే అయినప్పటికీ టేకింగ్ మాత్రం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగిపోతుంది. పాత్రల పరిచయానికి కాస్తా టైమ్ తీసుకున్నారు.

దాంతో ఏడు ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ మొదట కాస్తా స్లోగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. మొదటి 3 ఎపిసోడ్స్‌లో కథనం నెమ్మదిగా సాగిన తర్వాత ఊపందుకుంటుంది. పాత్రల పరిచయం, ఆ వెంటనే వారు చనిపోవడం వంటివి ఉత్కంఠతను కలిగిస్తాయి. ఇది కొంచెం గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఓటీటీ సిరీస్ తరహాలో అనిపిస్తుంది.

ఇక పాత డ్రామాల్లో లాగే విలన్ తన ముఠాను ఎలా పెంచుకున్నాడు, అధికారాన్ని ఎలా చేజిక్కించుకున్నాడనే సీన్లు కొంచెం పాతగా అనిపిస్తాయి. కథనం బాగున్నప్పటికీ ట్విస్టులు ముందే తెలిసిపోతాయి. నెక్ట్స్ ఏం జరుగుతుందో అనేది ప్రేక్షకుడుకు ఊహించేలా సాగుతాయి.

తండ్రీ కూతుళ్ల వైరం

1980 నాటి సామాజిక పరిస్థితులు, నాయుడు గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన తీరు, ఆ తర్వాత ఏం చేశాడు వంటివి పర్వాలేదనిపిస్తాయి. తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే వైరుధ్యం, నాయుడు సామ్రాజ్యాన్ని కూలగొట్టేందుకు సొంత మనుషులు చేసే కుట్రలు, మధ్యలో పోలీసు పాత్రతో ఒకింత క్యూరియాసిటీగానే సాగుతుంది.

చాలా వరకు సీన్లు ఊహించేలా ఉన్నా అక్కడక్కడ కొన్ని ట్విస్టులు పేలాయి. అవి సిరీస్‌కు మంచి ఇంపాక్ట్ ఇచ్చేలా ఉన్నాయి. క్లైమాక్స్ బాగుంది. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. 1980 కాలాని తగినట్లుగా ఆర్ట్ వర్క్, విజువల్స్ చాలా బాగున్నాయి. బీజీఎమ్ కూడా మెప్పించేలా ఉంది. సిచ్యువేషన్‌కి తగినట్లుగా మూడ్ క్రియేట్ చేసేలా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

ఎవరెలా చేశారంటే?

నటీనటుల పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. సముద్రఖని తనదైన క్రూరత్వంతో మెప్పించగా, ఐశ్వర్య రాజేష్ ఎమోషనల్ సీన్లలో బాగా రాణించింది. సముద్ర ఖని, ఐశ్వర్య రాజేష్ పోటాపోటీగా నటించారు. వీరితోపాటు బెనర్జీ, సుధాకర్ కోమాకుల అద్భుతంగా నటించారు. నాయుడు ఇవ్వలేని తండ్రి ప్రేమను భారతికి ఇచ్చే పాత్రలో బెనర్జీ ఒదిగిపోయారు.

అమాయకంగా ఇతరుల చేతిలో పావుగా మారే పాత్రలో సూరి నటన ఆకట్టుకుంటుంది. నరేష్ అగస్త్య కూడా పరిస్థితులకు తలవంచే యువకుడిగా మంచి నటన కనబరిచాడు. దర్శకుడు గ్యారీ బీహెచ్ తీసుకున్న పాయింట్ రొటీన్‌దే అయిన టేకింగ్‌తో మెప్పించారు.

ఫైనల్‌గా చెప్పాలంటే

తండ్రి గతం తెలిసిన కూతురి వేదన, అధికారం కోసం పాకులాడే మనుషుల నైజం బాగా చూపించారు. ఫైనల్‌గా చెప్పాలంటే క్రైమ్ యాక్షన్ పొలిటికల్ రివేంజ్ థ్రిల్లర్ అంశాలను ఇష్టపడేవారు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఇసకపట్నంపై టైమ్ ఉంటే ఓ లుక్కేయవచ్చు.

రేటింగ్: 2.75/5

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks