జేమ్స్ బాండ్ అభిమానులారా.. సిద్ధంగా ఉండండి! గూఢచారి 007 సాహసాలను ఇప్పుడు మీ ఫేవరెట్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించే సమయం వచ్చేసింది. ఓటీటీ రంగంలో బద్ధ శత్రువులుగా భావించే అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీల మధ్య కుదిరిన ఒక అనూహ్య ఒప్పందం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ యాజమాన్యంలోని ఎంజీఎం (MGM) స్టూడియోస్‌కు చెందిన జేమ్స్ బాండ్ సూపర్ హిట్ చిత్రాలు వచ్చే ఏడాది జనవరి 15 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే, కేవలం మూడు నెలలు మాత్రమే ఈ సినిమాలను నెట్‌ఫ్లిక్స్‌లో చూడగలరు.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయ్యే జేమ్స్ బాండ్ సినిమాలు :
1. డై అనదర్ డే (Die Another Day)
2. నో టైమ్ టు డై (No Time to Die)
3 క్వాంటం ఆఫ్ సోలేస్ (Quantum of Solace)
4. స్కైఫాల్ (Skyfall)
అయితే, జేమ్స్ బాండ్ చిత్రాలతో పాటు మరికొన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ కూడా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి అడుగుపెట్టబోతున్నాయి. వాటిలో 'రాకీ' (Rocky), 'క్రీడ్' (Creed), 'లీగల్లీ బ్లోండ్' (Legally Blonde) వంటి చిత్రాలు ఉన్నాయి.
అలాగే, అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'ది మ్యాన్ ఇన్ ద హై కాస్టల్' (The Man in the High Castle), డేవిడ్ వెయిల్ రూపొందించిన 'హంటర్స్' (Hunters) అనే క్రైమ్ డ్రామా సిరీస్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
ఏయే దేశాల్లో అందుబాటులో ఉండనున్నాయి?
డెడ్‌లైన్ నివేదిక ప్రకారం.. ఈ జేమ్స్ బాండ్ చిత్రాలు అమెరికా, జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, లాటిన్ అమెరికా వంటి దేశాల్లోని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. హంటర్స్ ఓటీటీ సిరీస్ మాత్రం ఈ దేశాల్లో ఏడాది పాటు స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది?
{{/usCountry}}డెడ్‌లైన్ నివేదిక ప్రకారం.. ఈ జేమ్స్ బాండ్ చిత్రాలు అమెరికా, జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, లాటిన్ అమెరికా వంటి దేశాల్లోని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. హంటర్స్ ఓటీటీ సిరీస్ మాత్రం ఈ దేశాల్లో ఏడాది పాటు స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది?
{{/usCountry}}సాధారణంగా అమెజాన్ తన సొంత కంటెంట్‌ను ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు ఇవ్వదు. కానీ, ఈసారి వ్యూహాత్మకమైన అడుగు వేసింది ప్రైమ్ వీడియో. జేమ్స్ బాండ్ వంటి భారీ బ్రాండ్‌ను మరిన్ని కోట్ల మంది ప్రేక్షకులకు చేరువ చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ వర్గాలు చెబుతున్నాయి.
దీనివల్ల కంపెనీకి భారీగా లైసెన్సింగ్ ఆదాయం లభిస్తుందని వారి అంచనా. గతంలో వార్నర్ బ్రదర్స్ సంస్థ కూడా తమ ‘హెచ్‌బీఓ’ షోలను నెట్‌ఫ్లిక్స్‌కు విక్రయించింది. అదే బాటలో ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ నడుస్తోంది.
ఈ సందర్భంగా అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ ప్రతినిధి క్రిస్ ఒట్టింగర్ మాట్లాడుతూ.. "జేమ్స్ బాండ్ అనేది సినిమా చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన ఫ్రాంచైజీ. నెట్‌ఫ్లిక్స్‌తో మాకున్న మంచి సంబంధాల వల్ల ఈ ఐకానిక్ చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరింత మంది ప్రేక్షకులకు దగ్గర చేయగలుగుతున్నాం" అని వివరించారు.
ఇండియన్ ఓటీటీ ఆడియెన్స్‌కు కూడా
ప్రస్తుతానికి ఈ క్రేజీ డీల్ ప్రకారం అమెరికా, జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, నార్డిక్స్, లాటిన్ అమెరికా దేశాలకు మాత్రమే పరిమితం అయింది. అయితే, భవిష్యత్తులో ఇండియన్ ఓటీటీ ఆడియెన్స్‌కు కూడా అమెజాన్ ప్రైమ్ కంటెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో చూసే అవకాశం దక్కే అవకాశం కూడా ఉంది.
సాధారణంగా ప్రతి ఏటా అక్టోబర్ నెలలో 'గ్లోబల్ బాండ్ డే' సందర్భంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి రావడం అనేది బాండ్ 007 ప్రియులకు నిజంగా పండగే అని చెప్పాలి.