...
...
Next Story

Janhvi Kapoor: నేను తప్పిపోతే శిఖర్‌కు అప్పగించండి- జాన్వీ కపూర్ నైట్‌సూట్‌పై రాతలు- బాయ్‌ఫ్రెండ్‌కు లవ్ సిగ్నల్స్!

Janhvi Kapoor Nightsuit Message To Shikhar Pahariya: పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ తన ప్రియుడు శిఖర్ పహారియాతో నడుపుతున్న ప్రేమాయణం మరోసారి చర్చల్లోకి వచ్చింది. తాజాగా ఆమె ధరించిన ఒక పింక్ నైట్‌సూట్, దానిపై ఉన్న ప్రేమ రాతలు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆ కథ ఏంటో ఇక్కడ చూద్దాం.

Published on: Jun 21, 2026, 15:06:59 IST
Advertisement

Janhvi Kapoor Nightsuit Message To Shikhar Pahariya: అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా టాలీవుడ్, బాలీవుడ్‌లలో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది జాన్వీ కపూర్. సినిమాల విషయాలు పక్కన పెడితే, ఈ ముద్దుగుమ్మ వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా ఆమె ప్రేమ వ్యవహారాలు ఎప్పుడూ మీడియాలో హాట్ టాపిక్‌గానే ఉంటాయి.

డేటింగ్ రూమర్స్

నేను తప్పిపోతే శిఖర్‌కు అప్పగించండి- జాన్వీ కపూర్ నైట్‌సూట్‌పై రాతలు- బాయ్‌ఫ్రెండ్‌కు లవ్ సిగ్నల్స్!
నేను తప్పిపోతే శిఖర్‌కు అప్పగించండి- జాన్వీ కపూర్ నైట్‌సూట్‌పై రాతలు- బాయ్‌ఫ్రెండ్‌కు లవ్ సిగ్నల్స్!

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాన్వీ కపూర్ గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, వీరు అధికారికంగా తమ బంధాన్ని ప్రకటించకపోయినా, తరచూ కలిసి తిరుగుతూ కెమెరాలకు చిక్కుతుంటారు. తాజాగా జాన్వీ కపూర్ ధరించిన ఒక నైట్‌సూట్ వారిద్దరి రిలేషన్‌షిప్‌ను మరోసారి నెట్టింట ట్రెండింగ్‌లోకి తెచ్చింది.

పింక్ కలర్ నైట్ సూట్

శనివారం (జూన్ 20) నాడు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఫోటోలో జాన్వీ కపూర్ పింక్ కలర్ నైట్‌సూట్, గ్రే జాకెట్ ధరించి కనిపించింది. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది ఆమె నైట్‌సూట్ కాదు.. దానిపై ప్రింట్ చేసి ఉన్న క్రేజీ క్యాప్షన్.

శిఖర్‌కు అప్పగించండి

"నేను ఒకవేళ తప్పిపోతే.. దయచేసి శిఖర్ పహారియాకు అప్పగించండి" (If lost, please return to Shikhar Pahariya) అనే ఆసక్తికరమైన లైన్ ఆ డ్రెస్‌పై రాసి ఉంది. ఈ ఫోటో బయటకు రాగానే నెటిజన్లు, ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. "నిజమైన రిలేషన్‌షిప్ గోల్స్ అంటే ఇదే" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

నెక్లెస్ నుంచి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వరకు..

గత ఏడాది ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జాన్వీ కపూర్ అప్పుడు తన అప్‌కమింగ్ మూవీ 'హోమ్‌బౌండ్' రెడ్ కార్పెట్ ప్రీమియర్ కోసం వెళ్లినప్పుడు కూడా శిఖర్ ఆమె వెంటే ఉన్నాడు. జాన్వీ నటించే ప్రతి సినిమాను అభినందిస్తూ ఆయన పెట్టే పోస్టులు ఇండస్ట్రీలో వీరిద్దరి బాండింగ్‌ను చెప్తుంటాయి.

పెద్ది నటీనటులు

కాగా, జాన్వీ కపూర్ ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన 'పెద్ది' చిత్రంలో నటించింది. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించిన ఈ భారీ యాక్షన్ డ్రామాలో జగపతి బాబు, శివ రాజ్‌కుమార్, బోమన్ ఇరానీ లాంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషించారు.

గ్లామర్ సీన్స్ రచ్చ

పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ, ఇందులో జాన్వీ కపూర్ పాత్రను చూపించిన విధానంపై, కొన్ని గ్లామర్ సీన్లపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి.

బుచ్చిబాబు సాన క్షమాపణలు

హీరోయిన్ క్యారెక్టర్‌ను మరీ అంత అల్ట్రా గ్లామరస్‌గా చూపించాల్సిన అవసరం లేదంటూ ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై బుచ్చిబాబు సాన క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe