ఒకప్పుడు మన సినిమాలు వేరు, వాళ్ల సినిమాలు వేరు అనే భావన ఉండేది. కానీ, 2025 నాటికి ఆ గీతలు పూర్తిగా చెరిగిపోయాయి. ఇప్పుడు భారతీయ సినిమా అంటే కేవలం ఒక ప్రాంతానికో, భాషకో పరిమితం కాకుండా పోయింది.

ఉత్తరాది స్టార్లు దక్షిణాది సినిమాల్లో మెరుస్తుంటే.. మన సౌత్ సూపర్ స్టార్లు బాలీవుడ్‌లో సత్తా చాటుతున్నారు. ‘పాన్ ఇండియా’ అనేది కేవలం ఒక పదంలా కాకుండా, ఇప్పుడు నిజమైన వాస్తవంగా మారిపోయింది. అలా ఇయర్-ఎండర్ 2025లో భాగంగా ఈ ఏడాది ఇతర ఇండస్ట్రీలో నటించి ఎంట్రీ ఇచ్చిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో లుక్కేద్దాం.
రజనీకాంత్‌తో అమీర్ ఖాన్
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ సాధారణంగా గెస్ట్ రోల్స్ చేయరు. కానీ, సూపర్ స్టార్ రజనీకాంత్‌పై ఉన్న అభిమానంతో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'కూలీ' సినిమాలో ఒక కీలకమైన అతిథి పాత్రలో కనిపించారు.
ఆగస్టు 14, 2025న విడుదలైన కూలీ సినిమాలో అమీర్ ఖాన్ ‘దాహా’ అనే పవర్‌ఫుల్ పాత్రలో మెరిశారు. క్లైమాక్స్‌లో రజనీ-అమీర్ మధ్య వచ్చే సీన్లు అభిమానులకు చాలా నచ్చాయి. వీరిద్దరూ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వెండితెరపై కలిసి కనిపించడం విశేషం.
బాలీవుడ్‌లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ
‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. హృతిక్ రోషన్‌తో కలిసి ఆయన నటించిన 'వార్ 2' బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా వచ్చిన వార్ 2 సినిమాలో తారక్ ఎనర్జీ, హృతిక్ స్టైల్ కలిసి ప్రేక్షకులకు కనువిందు చేశాయి. ముఖ్యంగా వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
హిందీలోకి మురుగదాస్-థగ్ లైఫ్‌లో అలీ ఫజల్
సౌత్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ చాలా కాలం తర్వాత సల్మాన్ ఖాన్‌తో 'సికందర్' సినిమా చేసి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక అటు మణిరత్నం-కమల్ హాసన్ కాంబినేషన్లో దశాబ్దాల తర్వాత వచ్చిన 'థగ్ లైఫ్'మూవీలో బాలీవుడ్ పాపులర్ నటుడు అలీ ఫజల్ నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా కోసం అలీ ఏకంగా తమిళం నేర్చుకోవడం విశేషం.
కొత్త కొత్త కాంబినేషన్లు
{{/usCountry}}సౌత్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ చాలా కాలం తర్వాత సల్మాన్ ఖాన్‌తో 'సికందర్' సినిమా చేసి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక అటు మణిరత్నం-కమల్ హాసన్ కాంబినేషన్లో దశాబ్దాల తర్వాత వచ్చిన 'థగ్ లైఫ్'మూవీలో బాలీవుడ్ పాపులర్ నటుడు అలీ ఫజల్ నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా కోసం అలీ ఏకంగా తమిళం నేర్చుకోవడం విశేషం.
కొత్త కొత్త కాంబినేషన్లు
{{/usCountry}}సారా అర్జున్: 'దైవతిరుమగళ్' (నాన్న)లో చిన్నారిగా మెప్పించిన చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ రణ్‌వీర్ సింగ్‌తో కలిసి 'ధురంధర్' అనే భారీ యాక్షన్ థ్రిల్లర్‌లో హీరోయిన్‌గా తన సత్తా చాటింది.
సోనాక్షి సిన్హా: టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటించిన హారర్ థ్రిల్లర్ 'జటాధర' సినిమాతో సోనాక్షి సిన్హా తెలుగులోకి అడుగుపెట్టారు. ఇందులో ఆమె 'ధన పిశాచిని' అనే విలక్షణమైన పాత్రలో కనిపించి మెప్పించారు.
గుల్షన్ దేవయ్య: 'కాంతార: చాప్టర్ 1'లో విలన్ కులశేఖరుడిగా నటించి కన్నడ ఇండస్ట్రీలోనూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య.
సినిమా రంగానికి భాషా పరమైన అడ్డంకులు లేవని, ప్రతిభ ఉంటే ఏ పరిశ్రమలోనైనా రాణించవచ్చని 2025 నిరూపించింది. ఈ క్రాస్-ఇండస్ట్రీ కొల్లాబరేషన్స్ భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.