Jr NTR Sent Homemade Cookies To Fans: వెండితెరపై తన పవర్‌ఫుల్ నటన, అదిరిపోయే డాన్సులతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. సాధారణంగా అగ్ర హీరోలు తమ ప్రొఫెషనల్ లైఫ్, సినిమా అప్‌డేట్లను మాత్రమే అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
మనసుకు హత్తుకునే వీడియో

కానీ, తారక్ తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక అరుదైన, మనసుకు హత్తుకునే వీడియోను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. బిగ్ బాస్ తర్వాత మరోసారి చెఫ్‌లా మారిన జూనియర్ ఎన్టీఆర్ వంటగదిలో బిస్కెట్లు తయారు చేశారు.
అయితే ఈ స్పెషల్ కుకీస్ ఆయన తిండానికి కాదు, తన ఇద్దరు బుజ్జి అభిమానుల కోసం కావడం విశేషం. ఎన్టీఆర్ చేసిన ఈ మధురమైన పనికి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
కొనుక్కొచ్చినవి కావు.. నేనే చేశా: ఎన్టీఆర్
శనివారం (జూన్ 6) ఉదయం జూనియర్ ఎన్టీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఆయన స్వయంగా కుకీస్ బేక్ చేస్తూ కనిపించారు. ఆ వీడియోకు "కొన్నవి కావు.. స్వయంగా తయారు చేసినవి" (Baked, not bought) అనే క్యాప్షన్ కూడా జోడించారు.
తారక్ హఠాత్తుగా ఈ వంట వీడియో పెట్టడమేంటని మొదట ఫ్యాన్స్ అంతా కాస్త అయోమయానికి గురయ్యారు. కానీ, కొద్దిసేపటికే ఈ వీడియో వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో బయటకు వచ్చింది.
గతంలో జరిగిన సంభాషణ
సాయి తేజ అనే ఎన్టీఆర్ హార్డ్‌కోర్ అభిమాని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కొన్ని ఫోటోలు, వీడియోలను పంచుకోవడంతో అసలు విషయం వెలుగుచూసింది. గతంలో జరిగిన ఒక చిన్న సంభాషణలో భాగంగా ఎన్టీఆర్ బిస్కెట్లు చేసి పంపుతానని సరదాగా అన్నారట.
{{/usCountry}}సాయి తేజ అనే ఎన్టీఆర్ హార్డ్‌కోర్ అభిమాని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కొన్ని ఫోటోలు, వీడియోలను పంచుకోవడంతో అసలు విషయం వెలుగుచూసింది. గతంలో జరిగిన ఒక చిన్న సంభాషణలో భాగంగా ఎన్టీఆర్ బిస్కెట్లు చేసి పంపుతానని సరదాగా అన్నారట.
{{/usCountry}}అన్న మాట ప్రకారం ఎన్టీఆర్ స్వయంగా వండిన ఆ కుకీలను ప్యాక్ చేసి, తన ఆటోగ్రాఫ్‌తో సహా ఆ అభిమాని ఇంటికి పంపించారు. ఆ బిస్కెట్లను తింటూ సాయి తేజ పిల్లలు స్మరణ్, స్థారక ఎంతో ఆనందంగా ఉన్న ఫోటోలు ఇప్పుడు నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి.
క్యాజువల్ కామెంట్.. ఊహించని సర్‌ప్రైజ్
"థాంక్యూ సో మచ్ తారక్ మామ. ఒక సాధారణ కామెంట్‌గా మొదలైన విషయం, ఈరోజు మా ఇంటికి స్వీట్ సర్‌ప్పైజ్‌గా మారింది. పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎన్టీఆర్ గారి ఆటోగ్రాఫ్ చూసి నా ఆనందానికి అవధులు లేవు. ఇదంతా చూస్తుంటే మా ముఖాల్లో నవ్వులు ఆగట్లేదు" అని తమ సంతోషాన్ని పంచుకున్నారు సాయి తేజ.
"సోషల్ మీడియా అనేది కేవలం గోల కోసం మాత్రమే కాదు.. అభిమానానికి, దయాగుణానికి, జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలకు మధ్య ఒక చిన్న వారధిగా కూడా మారుతుందని ఈరోజు రుజువైంది" అని తారక్ ఫ్యాన్ సాయి తేజ ఎమోషనల్ నోట్ రాశారు.
సోషల్ మీడియాలో ‘జై ఎన్టీఆర్’ రీసౌండ్
తారక్ చూపించిన ఈ అభిమానానికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కోట్లాది మంది అభిమానులు ఉండే ఒక గ్లోబల్ స్టార్, తన బిజీ షెడ్యూల్‌లోనూ ఒక సాధారణ ఫ్యాన్ అన్న మాట గుర్తుపెట్టుకుని సొంతంగా వంట చేసి పంపడం ఒక్క ఎన్టీఆర్‌కే సాధ్యమంటూ కామెంట్లు పెడుతున్నారు.
ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌లో తారక్ బిజీ
"ఆ పిల్లలు చాలా అదృష్టవంతులు", "అందుకే తారక్‌ను మేము హీరోలా కాకుండా మా సొంత అన్నయ్యలా భావిస్తాం" అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇదిలా ఉంటే, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన తదుపరి భారీ చిత్రం 'డ్రాగన్' (Dragon) షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు.
'కేజీఎఫ్', 'సలార్' చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై నందమూరి కల్యాణ్ రామ్, నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, కోసరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అనిల్ కపూర్, బిజు మీనన్, ఖుష్బూ సుందర్, అశుతోష్ రాణా, సిద్ధాంత్ గుప్తా వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు.
డ్రాగన్ రిలీజ్ డేట్
పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న డ్రాగన్ చిత్రం వచ్చే ఏడాది జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.