...
...
Next Story

OTT 7 Today: ఏకంగా 7 ఓటీటీల్లోకి ఇవాళ వచ్చిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్- 7.8 రేటింగ్-తెలుగులోనూ స్ట్రీమింగ్, కానీ!

Kaalidas 2 OTT Streaming On 7 Platforms Today: ఓటీటీలోకి ఇవాళ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కాళిదాస్ 2 స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అయితే, ఏకంగా 7 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో కాళిదాస్ 2 రిలీజ్ అయింది. ప్రేమిస్తే భరత్ హీరోగా చేసిన కాళిదాస్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం.

Published on: May 12, 2026, 09:32:53 IST
Advertisement

Kaalidas 2 OTT Release Today On 7 Platforms: తెలుగు ప్రేక్షకులకు 'ప్రేమిస్తే', 'బాయ్స్' చిత్రాలతో సుపరిచితుడైన హీరో భరత్. మహేశ్ బాబు స్పైడర్ సినిమాలో విలన్‌గా మెప్పించిన భరత్ ప్రస్తుతం విలక్షణమైన కథలతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నారు. 2019లో భరత్ నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'కాళిదాస్' కోలీవుడ్‌లో పెద్ద విజయాన్ని సాధించింది.

7.8 ఐఎమ్‌డీబీ రేటింగ్

ఏకంగా 7 ఓటీటీల్లోకి ఇవాళ వచ్చిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్- 7.8 రేటింగ్-తెలుగులోనూ స్ట్రీమింగ్, కానీ!
ఏకంగా 7 ఓటీటీల్లోకి ఇవాళ వచ్చిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్- 7.8 రేటింగ్-తెలుగులోనూ స్ట్రీమింగ్, కానీ!

ఆ చిత్రానికి సీక్వెల్‌గా, ఒక కొత్త కథాంశంతో దర్శకుడు శ్రీ సెంథిల్ తెరకెక్కించిన చిత్రమే 'కాళిదాస్ 2'. ఏప్రిల్ 3, 2026న థియేటర్లలో విడుదలైన కాళిదాస్ 2 సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7.8 రేటింగ్ కూడా సాధించింది. తాజాగా ఇవాళ (మే 12) ఏకంగా 7 ఓటీటీల్లోకి కాళిదాస్ 2 స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

గెటెడ్ కమ్యూనిటీ.. అదృశ్యమైన చిన్నారి!

కాళిదాస్ 2 సినిమా కథాంశం విషయానికి వస్తే.. న్యూ ఇయర్ వేడుకల సమయంలో ఒక హై-ప్రొఫైల్ గెటెడ్ కమ్యూనిటీ నుంచి నాలుగేళ్ల చిన్నారి అదృశ్యమవుతుంది. ఈ కేసును ఛేదించే బాధ్యత ఇన్‌స్పెక్టర్ కాళిదాస్ (భరత్) భుజాన పడుతుంది. ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతున్న కొద్దీ ఆ అపార్ట్‌మెంట్ అసోసియేషన్ సెక్రటరీ, ఒక యంగ్ లాయర్ ఇలా ప్రతి ఒక్కరూ అనుమానితులుగా కనిపిస్తారు.

ఈ క్రమంలోనే డీఎస్పీ వైష్ణవి ఈ కేసులోకి ప్రవేశిస్తుంది. కేసును ఛేదించే విషయంలో కాళిదాస్, వైష్ణవి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడం.. అడుగడుగునా ఊహించని మలుపులు ఎదురవ్వడం ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయి. క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం ఒక పక్కా వినోదం అందిస్తుందని చెప్పొచ్చు.

హేమాహేమీలతో కూడిన తారాగణం

సాధారణంగా ఏదైనా సినిమా ఒకటో రెండో ఓటీటీల్లో విడుదలవుతుంది. కానీ 'కాళిదాస్ 2' మాత్రం ఏకంగా ఏడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ కావడం విశేషం. అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్ నెక్ట్స్ (Sun NXT), ఆహా (Aha), సింప్లీ సౌత్, టెంట్ కొట్టా, షార్ట్ ఫ్లిక్స్, లయన్స్‌గేట్ ప్లేలలో కాళిదాస్ 2 ఓటీటీ రిలీజ్ అయింది.

మే 12 అంటే నేటి నుంచి ఈ ఏడింటిల్లో కాళిదాస్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, వీటిలో ఒక్క అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో మాత్రమే కాళిదాస్ 2 తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంది. కాకపోతే అది కూడా రెంటల్ విధానంలో ఉంది. తమిళ వెర్షన్‌లో మాత్రం అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్స్ ఫ్రీగా చూసేయొచ్చు.

తెలుగు వెర్షన్

ఇతర ప్లాట్‌ఫామ్స్‌లలో కూడా త్వరలోనే కాళిదాస్ 2 తెలుగు వెర్షన్ ఓటీటీ ప్రీమియర్ అయ్యే అవకాశం ఉంది. క్రైమ్, ఇన్వెస్టిగేషన్, సైకలాజికల్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన కాళిదాస్ 2ని ఈ 7 ఓటీటీల్లో ఎంచక్కా చూసేయొచ్చు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe