69 ఏళ్లలోనూ అదే గ్రేస్, అదే జోష్! పెళ్లి వేడుకలో తన సాంగ్ 'రంభా హో'కి స్టెప్పులేసిన కల్పనా అయ్యర్- సెలబ్రిటీలంతా ఫిదా!
అలనాటి మేటి నటి, డ్యాన్సర్ కల్పనా అయ్యర్ తన ఐకానిక్ సాంగ్ 'రంభా హో హో హో'కు మళ్లీ ప్రాణం పోశారు. ఒక కుటుంబ పెళ్లి వేడుకలో కల్పనా అయ్యర్ చేసిన డ్యాన్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 40 ఏళ్ల తర్వాత 69 ఏళ్ల వయసులో కూడా ఆమెలో అదే ఉత్సాహం ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
బాలీవుడ్ వెండితెరపై ఒకప్పుడు తన డ్యాన్స్‌తో ఉర్రూతలూగించిన హీరోయిన్ కల్పనా అయ్యర్. ఆమె పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది 'రంభా హో హో హో' పాట. దశాబ్దాలు గడిచినా ఆ పాట క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఒక పెళ్లి వేడుకలో ఈ సూపర్ హిట్ సాంగ్‌కు కల్పనా అయ్యర్ అదిరిపోయే స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

స్టేజీపై 'ఒరిజినల్' డ్యాన్సింగ్ క్వీన్ సందడి!
కల్పనా అయ్యర్ తన సోషల్ మీడియాలో ఈ డ్యాన్స్ వీడియోను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. "నిన్న రాత్రి జరిగిన సిద్ధాంత్ పెళ్లి వేడుక ఇది. నేను మళ్లీ ఇలా డ్యాన్స్ చేస్తానని ఊహించలేదు. ఒక స్నేహితుడు ఈ క్లిప్ పంపిస్తే చూసుకున్నాను.. నేనేనా ఇలా చేసింది అని నాకే నమ్మకం కలగడం లేదు. చాలా కాలం తర్వాత డ్యాన్స్ చేశాను, ఆ సాయంత్రం నాకు చాలా ప్రత్యేకం" అని కల్పనా అయ్యర్ పేర్కొన్నారు.
ఈ వీడియోలో కల్పనా అయ్యర్ నిండుగా ఊదా రంగు (Purple) పట్టు చీర కట్టుకుని, సాంప్రదాయ బ్లాక్ అండ్ గోల్డ్ బ్లౌజ్‌లో మెరిశారు. వయసు పెరిగినా కల్పనా అయ్యర్ గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తూ స్టేజీని తన ఎనర్జీతో షేక్ చేశారు. 69 ఏళ్ల వయసులో కూడా అదే గ్రేస్, అదే జోష్‌తో చేసిన సీనియర్ హీరోయిన్, డ్యాన్సర్ కల్పనా అయ్యర్ డ్యాన్స్‌కు అక్కడున్న వారంతా ఫిదా అయిపోయి కేరింతలు కొట్టారు.
తిరిగి వెలిగిన 'రంభా' మేజిక్!
1981లో వచ్చిన 'అర్మాన్' సినిమాలోని ఈ పాట కల్పనా అయ్యర్‌ను రాత్రికి రాత్రే స్టార్‌ను చేసింది. అప్పట్లో ఇదొక సంచలనం. అయితే తాజాగా రణ్‌వీర్ సింగ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'ధురంధర్'లో ఈ పాటను మళ్లీ వాడటంతో ప్రస్తుత తరానికి కూడా ఈ రంభా హో హో హో సాంగ్ బాగా దగ్గరైంది.
ప్రశంసల జల్లు.. 'ది ఓజీ' అంటూ సెలబ్రిటీల కామెంట్స్!
కల్పనా అయ్యర్ డ్యాన్స్ వీడియో చూసి చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు మురిసిపోతున్నారు. నటి శిల్పా శిరోద్కర్ ఆమెను "ది బెస్ట్" అని కొనియాడగా, కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ "డ్యాన్సింగ్ క్వీన్" అని బిరుదు ఇచ్చారు.
నటి డెల్నాజ్ ఇరానీ "ది ఓజీ" (The OG - Original) అని కల్పనా అయ్యర్‌ను సంబోధించగా, ఖుష్బూ సుందర్, దివ్య దత్తా తదితరులు తమ ప్రేమను వ్యక్తం చేశారు. నెటిజన్లు అయితే "వయసు పెరిగితే ఇలాగే పెరగాలి" అంటూ కల్పనను ఆకాశానికెత్తుతున్నారు.
కల్పనా అయ్యర్ ప్రయాణం
కేవలం ఐటమ్ సాంగ్స్ మాత్రమే కాకుండా.. 'సత్తే పే సత్తా', 'లాడ్లా', 'అంజామ్' వంటి చిత్రాల్లో కల్పనా అయ్యర్ కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమాలో రీమా లాగూ స్నేహితురాలిగా (సంగీత పాత్రలో) ఆమె నటన ఇప్పటికీ గుర్తుండిపోతుంది. 1999లో బాలీవుడ్‌కు గుడ్ బై చెప్పిన కల్పనా అయ్యర్ దుబాయ్‌కు షిఫ్ట్ అయ్యారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


