...
...
Next Story

Musical Event: కళ్యాణి మాలిక్, గీతా మాధురి మ్యూజికల్ ఈవెంట్- 23 ఏళ్ల తర్వాత- ఏడుగురు సింగర్స్‌తో- లైవ్ షో ఎప్పుడంటే?

Kalyani Malik Geetha Madhuri Musical Event: ప్రముఖ సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్, సింగర్ గీతా మాధురి ఆధ్వర్యంలో ది నైట్ ఆఫ్ ది స్టార్స్ మ్యూజికల్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ ఈవేడుకలో ఏడుగురు సింగర్స్ పాటలతో అలరించనున్నారు. మరి ఈ లైవ్ షో ఎప్పుడు అనే వివరాలు చూద్దాం.

Published on: Jun 7, 2026, 14:42:28 IST
Advertisement

Kalyani Malik Geetha Madhuri Musical Event: సీన్ సెటర్స్, అసెంబ్లీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక సంగీత వేడుక "ది నైట్ ఆఫ్ ది స్టార్స్" జూన్ 12, 2026న హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అసెంబ్లీలో జరగనుంది.

ఆర్గనైజర్‌గా యాంకర్

కళ్యాణి మాలిక్, గీతా మాధురి మ్యూజికల్ ఈవెంట్- 23 ఏళ్ల తర్వాత- ఏడుగురు సింగర్స్‌తో- లైవ్ షో ఎప్పుడంటే?
కళ్యాణి మాలిక్, గీతా మాధురి మ్యూజికల్ ఈవెంట్- 23 ఏళ్ల తర్వాత- ఏడుగురు సింగర్స్‌తో- లైవ్ షో ఎప్పుడంటే?

ప్రముఖ సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్, ప్రముఖ నేపథ్య గాయని గీతా మాధురి, అలాగే సాకేత్, వినూత్న, కశ్యప్, అదితి , భార్గవి తమ అద్భుతమైన సంగీత ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు. ప్రముఖ యూట్యూబర్, యాంకర్ నిఖిల్ విజయేంద్ర సింహ ఈ వేడుకని ఆర్గనైజ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నిఖిల్ విజయేంద్ర సింహ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మనందరం చిన్నప్పటి నుంచి పాటలను మధురమైన జ్ఞాపకాలుగా, నోస్టాల్జిక్ ఫీలింగ్స్‌గా ఆస్వాదిస్తూ పెరిగాం. ఆ నోస్టాల్జిక్ పాటలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం" అని అన్నారు.

23 ఏళ్ల తర్వాత

"దాదాపు 23 సంవత్సరాల తర్వాత కళ్యాణి మాలిక్ గారి ఆధ్వర్యంలో ఈ మ్యూజికల్ లైవ్ షో జరగడం చాలా సంతోషంగా ఉంది. జూన్ 12న అసెంబ్లీ వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మాకు ఈ వేదికను అందించిన శ్రీకాంత్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు" అని నిఖిల్ విజయేంద్ర సింహా తెలిపారు.

"అలాగే కళ్యాణి మాలిక్ గారికి, గీతా మాధురి గారికి, సాకేత్ గారికి, వినూత్న గారికి, అదితి గారికి ధన్యవాదాలు. వీరందరూ కలిసి ఈ వేడుకను మరింత గ్రాండ్‌గా తీర్చిదిద్దుతున్నారు. మీరు అందరూ ఈ కార్యక్రమానికి హాజరై, మాతో కలిసి ఈ సంగీత వేడుకను ఆస్వాదించాలని కోరుకుంటున్నాం. టికెట్ల కోసం డిస్ట్రిక్ట్ యాప్, మేము అందించిన ఫోన్ నంబర్లను కూడా సంప్రదించలని కోరుతున్నాం" అని యాంకర్ నిఖిల్ విజయేంద్ర సింహా పేర్కొన్నారు.

అదే ఉత్సాహంగా ఉన్నా

సింగర్ గీతా మాధురి మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. కళ్యాణి మాలిక్ గారు మొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ షో గురించి నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. అందరూ ఈ కార్యక్రమం గురించి ఆసక్తిగా అడుగుతున్నారు. కళ్యాణి గారి పాటలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు" అని అన్నారు.

గీతా మాధురి కామెంట్స్

"నాకు లైవ్ మ్యూజిక్ షోలు అంటే చాలా ఇష్టం. అలాంటి ప్రత్యేకమైన కార్యక్రమంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. అసెంబ్లీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఈ కార్యక్రమం జరగడం మరో ప్రత్యేకత. ఈ వేదిక చాలా అద్భుతంగా ఉంది. టికెట్లు డిస్ట్రిక్ట్ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. అలాగే నిర్వాహకులు ఇచ్చిన ఫోన్ నంబర్ల ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా కూడా సంప్రదించవచ్చు" అని గీతా మాధురి తెలిపారు.

"కళ్యాణి మాలిక్ గారి పాటలను ఈ వేదికపై పాడబోతుండటం నాకు ఎంతో ఆనందంగా ఉంది" అని సింగర్ గీతా మాధురి పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో గాయకులు, నిర్వాహకులు, కార్యక్రమానికి సంబంధించిన ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe