...
...
Next Story

OTT Horror: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన మ్యూజికల్ హారర్ కామెడీ- డ్యాన్సుతో భయపెట్టే 5 దెయ్యాలు- 8.3 రేటింగ్- తెలుగులోనే!

Karakkam OTT Streaming Today: ఓటీటీలోకి సరికొత్త మలయాళ మ్యూజికల్ హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమా కరక్కం వచ్చేసింది. డ్యాన్సుతో భయపెట్టే ఐదు దెయ్యాల కథతో తెరకెక్కిన కరక్కం 5 భాషల్లో ఓటీటీ రిలీజ్ అయింది. ఐఎమ్‌డీబీలో 10కి 8.3 రేటింగ్ సాధించిన కరక్కం ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jul 3, 2026, 16:01:59 IST
Advertisement

Karakkam OTT Release Today: తెలుగు రాష్ట్రాల్లోని సినిమా ప్రియులకు మలయాళ చిత్రాలపై క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. విభిన్నమైన కథాంశాలు, సహజత్వానికి దగ్గరగా ఉండే మేకింగ్ శైలి కారణంగా మాలీవుడ్ సినిమాలను ఓటీటీల్లో బాగా ఆదరిస్తున్నారు.

నేడు ఓటీటీలోకి కరక్కం

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన మ్యూజికల్ హారర్ కామెడీ- డ్యాన్సుతో భయపెట్టే 5 దెయ్యాలు- 8.3 రేటింగ్- తెలుగులోనే!
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన మ్యూజికల్ హారర్ కామెడీ- డ్యాన్సుతో భయపెట్టే 5 దెయ్యాలు- 8.3 రేటింగ్- తెలుగులోనే!

ఈ క్రమంలోనే థియేటర్లలో విడుదలైన ఒక వైవిధ్యభరితమైన మలయాళ చిత్రం ఇవాళ (జూలై 3) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చింది. శ్రీనాథ్ భాసి, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటించిన మ్యూజికల్ హారర్ కామెడీ డ్రామా 'కరక్కం' (Karakkam) నేటి నుంచే ఓటీటీలో సందడి చేస్తోంది.

కరక్కం రేటింగ్

మే 28, 2026న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్‌ను అలరించడానికి సిద్ధమైంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ కరక్కం సినిమాకు ఐఎమ్‌డీబీలో పదికి 8.3 రేటింగ్ వచ్చింది.

అసలు కథేంటంటే?

న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా విపరీతంగా మద్యం సేవించి, హాస్టల్‌లో గొడవ పడిన ఇద్దరు జులాయి స్నేహితులు ధనుష్, ఖాజా చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మత్తులో ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో, వారు స్థానిక చర్చి శ్మశానవాటికలోకి ప్రవేశిస్తారు. అక్కడ వేర్వేరు సమాధులపై ఉన్న ఐదు ఇత్తడి సిలువలను పెకిలిస్తారు.

మ్యూజికల్ దెయ్యాలు

పవిత్రమైన ఆ స్థలాన్ని అగౌరవపరచడంతో, అక్కడ నిద్రిస్తున్న ఐదు అశాంతి ఆత్మలు మేల్కొంటాయి. అగ్రహించిన ఆ దెయ్యాలు ఈ ఇద్దరు మిత్రులను వెంటాడటం ప్రారంభిస్తాయి. అంతేకాకుండా మ్యూజిక్‌కు తగినట్లుగా డ్యాన్స్ చేస్తాయి. అవి మ్యూజికల్ దెయ్యాలుగా తెలుస్తుంది. ఆ అతీంద్రియ శక్తుల బారి నుంచి తప్పించుకోవడానికి ధనుష్, ఖాజా ఒక లోకల్ లాడ్జ్‌లో ఆశ్రయం పొందుతారు.

ఆత్మలకు విముక్తి

ఈ చిత్రంలో శ్రీనాథ్ భాసి, ఫెమినా జార్జ్ నటన ఆకట్టుకుంటుంది. వీరితో పాటు ప్రవీణ్ టీజే, అభిరామ్ రాధాకృష్ణన్, షాన్ రోమీ, సిద్ధార్థ్ భరతన్, బిజుకుట్టన్ కీలక పాత్రలు పోషించారు. సుభాష్ లలిత సుబ్రహ్మణ్యన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు నిపిన్ నారాయణన్, అర్జున్ నారాయణన్, ధనుష్ వర్గీస్‌లతో కలిసి కథను అందించారు.

సామ్ సీఎస్ సంగీతం

తెలుగులో 'ఖైదీ', 'విక్రమ్ వేద' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్యామ్ సీఎస్ (Sam CS) ఈ చిత్రానికి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. క్రౌన్ స్టార్స్ ఎంటర్‌టైన్‌మెంట్, బ్లాక్ టర్టిల్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కింబర్లీ జి. ట్రినిడేడ్, అంకుష్ సింగ్ ఈ సినిమాను నిర్మించారు.

సోనీ లివ్ ఓటీటీలో

బాబ్లూ అజు సినిమాటోగ్రఫీ అందించగా, నిధిన్ రాజ్ అరోల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. డ్యాన్స్‌తో భయపెట్టే 5 దెయ్యాల కథగా తెరకెక్కిన కరక్కం ఓటీటీలోకి వచ్చేసింది. సోనీ లివ్‌లో కరక్కం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతోపాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ వంటి 5 భాషల్లో కరక్కం ఓటీటీ రిలీజ్ అయింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe