Karan Johar Review On Raakh OTT Streaming Series: ఇటీవల ఓటీటీ వేదికలపై యథార్థ క్రైమ్ స్టోరీలకు ఎప్పుడూ ఆదరణ ఎక్కువే ఉంటుంది. అయితే, కొన్ని కథలు కేవలం వినోదాన్ని మాత్రమే ఇవ్వవు.. గుండెలను పిండేస్తాయి, సమాజంలోని చీకటి కోణాన్ని చూపిస్తూ భయాందోళనలకు గురిచేస్తాయి.
రాఖ్ ఓటీటీ స్ట్రీమింగ్

సరిగ్గా అలాంటి కోవకే చెందుతుంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సరికొత్త సిరీస్ 'రాఖ్' (Raakh). మీర్జాపూర్ ఫేమ్ అలీ ఫజల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఓటీటీ సిరీస్ చూసిన ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ అర్ధరాత్రి వేళ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకున్న తన నిర్ణయాన్ని పక్కనబెట్టి మరీ ఈ సిరీస్ గురించి సుదీర్ఘ పోస్ట్ పెట్టారు కరణ్ జోహార్. దేశ రాజధాని ఢిల్లీలో 1978లో జరిగిన గీతా చోప్రా, సంజయ్ చోప్రా అనే ఇద్దరు తోబుట్టువుల కిడ్నాప్, దారుణ హత్య ఆధారంగా ఈ షోను రూపొందించారు.
రంగా-బిల్లా అనే ఇద్దరు నేరగాళ్లు
అప్పట్లో 'రంగా-బిల్లా'లుగా పిలిచే ఇద్దరు నేరగాళ్లు సృష్టించిన ఈ దారుణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా, తల్లిదండ్రులలో పిల్లల భద్రతపై అపారమైన భయాన్ని నింపింది. యష్, రూహి అనే ఇద్దరు కవల పిల్లలకు సింగిల్ ఫాదర్‌గా ఉన్న కరణ్ జోహార్ ఈ ఓటీటీ సిరీస్ చివరి ఎపిసోడ్ చూశాక తన మనసులోని ఆవేదనను పంచుకున్నారు.
ఒక తండ్రిగా తట్టుకోలేకపోయాను
"ఇప్పుడు అర్ధరాత్రి ఒంటి గంట దాటి 35 నిమిషాలు అవుతోంది. 'రాఖ్' చివరి ఎపిసోడ్ చూసినప్పటి నుంచి నా మనసు అస్సలు బాలేదు. ఒక తండ్రిగా, ఒక మనిషిగా, ఈ సమాజంలో ఒక బాధ్యతగల పౌరుడిగా నేను తీవ్రంగా కలత చెందాను (డిస్టర్బ్). మానవత్వంలో దాగున్న అత్యంత క్రూరమైన, అసహ్యకరమైన కోణాన్ని ఈ ఓటీటీ సిరీస్ కళ్లముందుంచింది. చిన్నప్పుడు జరిగిన ఏదో ఒక చేదు అనుభవాన్ని సాకుగా చూపిస్తూ.. మనలో దాగున్న రాక్షసుడికి లొంగిపోవడాన్ని ఏ రకంగానూ సమర్థించలేం" అని కరణ్ జోహార్ పేర్కొన్నారు.
ఆ నరకం నుంచి తేరుకోలేకపోతున్నా
{{/usCountry}}"ఇప్పుడు అర్ధరాత్రి ఒంటి గంట దాటి 35 నిమిషాలు అవుతోంది. 'రాఖ్' చివరి ఎపిసోడ్ చూసినప్పటి నుంచి నా మనసు అస్సలు బాలేదు. ఒక తండ్రిగా, ఒక మనిషిగా, ఈ సమాజంలో ఒక బాధ్యతగల పౌరుడిగా నేను తీవ్రంగా కలత చెందాను (డిస్టర్బ్). మానవత్వంలో దాగున్న అత్యంత క్రూరమైన, అసహ్యకరమైన కోణాన్ని ఈ ఓటీటీ సిరీస్ కళ్లముందుంచింది. చిన్నప్పుడు జరిగిన ఏదో ఒక చేదు అనుభవాన్ని సాకుగా చూపిస్తూ.. మనలో దాగున్న రాక్షసుడికి లొంగిపోవడాన్ని ఏ రకంగానూ సమర్థించలేం" అని కరణ్ జోహార్ పేర్కొన్నారు.
ఆ నరకం నుంచి తేరుకోలేకపోతున్నా
{{/usCountry}}ఈ సిరీస్ తనపై చూపిన ప్రభావాన్ని వివరిస్తూ.. "ఈ మానసిక గాయం నుంచి నేను అంత త్వరగా కోలుకుంటానని అనుకోవడం లేదు. కానీ, దర్శకుడు ప్రోసిత్ రాయ్ కథను నడిపించిన తీరు, భావోద్వేగాలను ఎక్కడా డ్రామా చేయకుండా సహజంగా చూపించిన విధానాన్ని కచ్చితంగా అభినందించాలి. మేకింగ్ పరంగా ఇది అద్భుతమైన క్రాఫ్ట్" అని కరణ్ కొనియాడారు.
సోనాలి బింద్రే కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్
తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైన సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రే నటనను కరణ్ జోహార్ ప్రత్యేకంగా అభినందించారు. "నా మనసులో నుంచి అస్సలు చెరిగిపోనివి ఏవైనా ఉన్నాయంటే.. అవి సోనాలి బింద్రే, అమీర్ బషీర్ల నటన మాత్రమే. కొండంత విషాదాన్ని మోస్తున్న తల్లిదండ్రుల పాత్రల్లో వారిద్దరూ జీవించారు" అని కరణ్ జోహార్ పేర్కొన్నారు.
"ఆ బాధను, వేదనను వారు పలికించిన తీరు చూసి నేను నోరెళ్లబెట్టాను. వారు పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేశారు. నేను అనుభవించిన ఆ హృదయ విదారక అనుభూతిని మీరు కూడా పొందాలంటే వారి నటనను కచ్చితంగా చూడాల్సిందే. వారు అద్భుతంగా చేశారు.. శభాష్!" అంటూ ప్రశంసల జల్లు కురిపించారు కరణ్.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీకి థ్యాంక్స్
ముఖ్య పాత్ర పోషించిన అలీ ఫజల్ నటనతో పాటు ఆకాష్ మఖిజా, రమణ్‌దీప్ యాదవ్‌ల పనితీరును కూడా కరణ్ జోహార్ అభినందించారు. ఇంతటి బలమైన, ఆలోచింపజేసే ఓటీటీ సిరీస్‌ను వీక్షకులకు అందించినందుకు అమెజాన్ ప్రైమ్ టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సిరీస్ చూస్తున్నంతసేపు గుండె బరువెక్కుతుందని, అయినా ప్రతి ఒక్కరూ చూడాల్సిన అవసరమైన కథ ఇదని బాలీవుడ్ వర్గాలు సైతం అభిప్రాయపడుతున్నాయి.