Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో దీపకు శివ నారాయణ కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తాడు. దాంట్లో ఏముందో కార్తీక్‌ను చదవమంటాడు. అందులో జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ సీఈఓగా ఎప్పటికీ దీపే కొనసాగుతుందని ఉందని కార్తీక్ అంటాడు.
దీపే శాశ్వత సీఈఓ

దాంతో పారిజాతం తెగ షాక్ అయిపోతుంది. ఇది అన్‌లిమిటెడ్, జ్యోత్స్న రెస్టారెంట్స్ ఉన్నంతకాలం ఉంటుంది. దీపే శాశ్వతంగా సీఈఓగా ఉంటుంది. ఒకవేళ దీపను తీసేయాలనుకుంటే రూ. 10 కోట్లు నష్టపరిహారంగా కట్టాలని కార్తీక్ అంటాడు. ఇలా ఎందుకు రాయించావ్ నాన్న అని కాంచన అడుగుతుంది. ఇది నా కోరిక కాదు జ్యోత్స్న కోరిక అని శివ నారాయణ అంటాడు.
ఇంతలో జ్యోత్స్న వచ్చి అవును, ఇది నా పెళ్లి కానుక అనుకో అని అంటుంది. కానుక అదిరిపోయిందని శ్రీధర్ అంటాడు. మనిద్దరం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని దీప చేయి పట్టుకుని అంటుంది. నాకు మిమ్మల్ని చూస్తే ఈర్శ్యగా ఉందని శ్రీధర్ అంటాడు. ఇదంతా జ్యోత్స్న మారడం వల్లే అని పారిజాతం అంటుంది. మీరు నాకు మాటిచ్చినట్లే జ్యోత్స్న పెళ్లి చేస్తున్నారు, సూరజ్‌తో కలిపారు అని సుమిత్ర అంటుంది.
తెలిసో తెలియకో బాధపెట్టుంటే క్షమించమని దీపను వేడుకుంటుంది సుమిత్ర. ఒక తల్లి కూతురును క్షమించమని అడక్కూడదు అని దశరథ అంటాడు. అంతా షాక్ అవుతారు. జ్యోత్స్న, పారిజాతం డౌట్ పడతారు. దీపకు కన్యాదానం చేశాం కాబట్టి మా కూతురే. అలా చూస్తే సుమిత్రకు ఇద్దరు కూతుళ్లు అని దశరథ్ అంటాడు. జ్యోత్స్న పెళ్లి అయితే నేనే పెద్దల్లుడు అని కార్తీక్ అంటాడు.
జీవితాలు మార్చే సర్‌ప్రైజ్ చెప్పొచ్చుగా
కానీ, చిన్నల్లుడే ముద్దు అని పారిజాతం అంటుంది. పార్టీ భలే మారుస్తావ్ అని కార్తీక్ అంటాడు. దీపకు అగ్రిమెంట్ పేపర్స్ ఇచ్చి తన దగ్గరే ఉంచుకోమంటాడు శివ నారాయణ. అందరం సంతోషంగా ఉన్నాం కదా. ఆ జీవితాలు మార్చే బిగ్ సర్‌ప్రైజ్ ఏంటో చెప్పేయొచ్చు కదా అని శ్రీధర్ అడుగుతాడు. పెళ్లి అయ్యాక చెబుతానని కార్తీక్ అంటాడు.
{{/usCountry}}కానీ, చిన్నల్లుడే ముద్దు అని పారిజాతం అంటుంది. పార్టీ భలే మారుస్తావ్ అని కార్తీక్ అంటాడు. దీపకు అగ్రిమెంట్ పేపర్స్ ఇచ్చి తన దగ్గరే ఉంచుకోమంటాడు శివ నారాయణ. అందరం సంతోషంగా ఉన్నాం కదా. ఆ జీవితాలు మార్చే బిగ్ సర్‌ప్రైజ్ ఏంటో చెప్పేయొచ్చు కదా అని శ్రీధర్ అడుగుతాడు. పెళ్లి అయ్యాక చెబుతానని కార్తీక్ అంటాడు.
{{/usCountry}}సూరజ్ రింగ్ తొడగనివ్వకపోవడం గుర్తు చేసుకుంటూ ఒంటరిగా కూర్చుని ఉంటుంది జ్యోత్స్న. అక్కడికి సూరజ్ వస్తాడు. సూరజ్‌ను పట్టించుకోదు జ్యోత్స్న. నాతో మాట్లాడకు అని జ్యో అంటే.. పెళ్లి కూడా చేసుకోవా అని సూరజ్ అంటాడు. నీకు బాగా అలుసై పోయానుగా. ఉంగరం పెట్టుకోలేదు అని జ్యో అంటుంది. నా దగ్గరే పెట్టుకున్నా అంటాడు సూరజ్.
నాకు మాటివ్వమని జ్యో అంటే.. సూరజ్ ఇవ్వనంటాడు. నీ ప్రవర్తన చూస్తుంటే అనుమానంగా ఉంది. భయంవల్ల కూడా వస్తుంది. నువ్వు నా సొంతం. నీ జీవితంలో జ్యోత్స్నకు తప్పా ఇంకెవరికి స్థానం ఉండదని, నాకు తప్పా నీ జీవితంలో ఇంకెవరికి చోటు లేదని నేనే నీ దగ్గర మాట తీసుకుంటున్నాను. నువ్వు ఇవ్వలేదు. నేనే తీసుకుంటున్నాను అని తన చేతిలో సూరజ్ చేయి పెట్టుకుంటుంది జ్యోత్స్న.
నీ ప్రేమ భరించలేకపోతున్నా
నీకు నా జ్ఞాపకాలన్నీ ఇవ్వాలని ఉంది. నా జ్ఞాపకాల్లో నిన్ను నింపేసుకోవాలని ఉందని పిచ్చిగా తన ప్రేమ చెబుతుంది జ్యోత్స్న. ఇంతలా మారిపోయావేంటీ అని సూరజ్ కాస్తా భయపడినట్లుగా కనిపిస్తాడు. తన ప్రేమ గురించి జ్యో చెబితే.. భరించలేకపోతున్నా అని సూరజ్ అంటాడు. మనం మనల్ని కోల్పోయే ప్రేమ మంచిది కాదేమో అని సూరజ్ అంటాడు.
కోల్పోయేది మన ప్రేమించినోడి దగ్గరే కదా అని జ్యోత్స్న అంటుంది. నీ నుంచి నేను జ్ఞాపకాలు కోరుకుంటున్నాను. నాకు ఒక్క చిన్న గిఫ్ట్ అయినా ఇచ్చావా అని జ్యోత్స్న అడుగుతుంది. నువ్వన్నా నేనన్నా మనమే అయినప్పుడు ఎవరిచ్చినా ఒక్కటే కదా అని సూరజ్ అంటాడు. అబ్బా లాజిక్ చెప్పావ్ అని చప్పట్లు కొడుతుంది జ్యోత్స్న.
సూరజ్ భుజంపై తల వాల్చి మనం త్వరగా పెళ్లి చేసుకుందాం. ఇదే ఇంట్లో హ్యాపీగా ఉందామని జ్యోత్స్న అంటుంది. నువ్వు అంటున్నావుగా. నేను ఉన్నట్లే అని సూరజ్ అంటాడు. మరుసటి రోజు ఉదయం పంతులు ఇంటికి వచ్చి సూరజ్, జ్యోత్స్నకు ముహుర్తం పెళ్లి చూస్తాడు. వారం రోజుల్లో దివ్యమైన ముహుర్తం ఉందంటాడు.
ఘోరమైన అవమానం ఇది
అంతకు ముందు ముహుర్తం లేదా అని సూరజ్ అడుగుతాడు. నాకు కూడా త్వరగా అయితే బాగుండనిపిస్తుంది. ఈ పెళ్లితో అందరి జీవితాలు అని శ్రీధర్ అంటుంటే కార్తీక్ అడ్డుకుంటాడు. అల్లుడు వాగుడు కాయ్ అంటూ పారిజాతం అంటుంది. ఇంటి అల్లుడికి గౌరవం లేదు. సూరజ్ ఇది మన సమస్య. మనం ఓసారి దీని గురించి మాట్లాడుకోవాలని శ్రీధర్ అంటాడు.
ఈ తరం అల్లుడికి నీ తరం అలవాట్లు నేర్పించకు అల్లుడు అని రెండు పెళ్లిళ్ల గురించి అంటుంది పారిజాతం. ఇది ఘోరమైన అవమానం. మావయ్య గారు మీరు ఏదోటి అనాల్సిందే అని శ్రీధర్ అంటాడు. మనం ముహుర్తం పెట్టాక మాట్లాడుకుందామని జ్యోత్స్న అంటుంది. అత్తారింట్లో అల్లుళ్లకు మర్యాదలు తగ్గొద్దని శ్రీధర్ అంటే.. అల్లుడు నేను ఇక్కడే ఉన్నా అని శివ నారాయణ అంటాడు.
శ్రీధర్ సైలెంట్ అవుతాడు. మరో మూడు రోజుల్లో దివ్యమైన ముహుర్తం ఉందని పంతులు అంటాడు. అలాంటప్పుడు ఇదే ముందు చెప్పొచ్చుగా సూరజ్ అడుగుతాడు. రెండు దివ్యమైనవే అని పంతులు అంటాడు. సూరజ్ కన్‌ఫ్యూజ్ చేస్తాడు. ముందు చెప్పింది జాతకం ప్రకారం బాగుంది, రెండోది పేరు బలంతో బాగుందని పంతులు అంటాడు.
3 రోజుల్లో సూరజ్, జ్యోకి పెళ్లి
అంటే ఇది జాతకంతో బాగా లేదన్నమాట అని సూరజ్ అంటాడు. నీతో కొంచెం కష్టమే బాబు అని పంతులు అంటాడు. ఇదంతా చూస్తుంటే నా పెళ్లి చూపులు గుర్తుకు వస్తున్నాయని శ్రీధర్ అంటే.. అయితే బయటకు వెళ్లు అల్లుడు. అప్పుడు బయటే కూర్చున్నావని పారిజాతం అంటుంది.
3 రోజుల్లో లగ్నముహుర్తమే ఉంది. కానీ, శివ నారాయణ మనవరాలి పెళ్లి మరి 3 రోజుల్లో అంటే ఏర్పాట్లు అవ్వవేమో అని పంతులు అంటాడు. ఏమంటావని శివ నారాయణ అడిగితే.. ఆ మూడు రోజుల్లో ముహుర్తమే ఖాయం చేయమని సూరజ్ అంటాడు. దాంతో 3 రోజుల్లో సూరజ్, జ్యోత్స్న పెళ్లికి పంతులు లగ్నపత్రిక రాస్తాడు. సూరజ్, జ్యో సిగ్గుపడతారు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.