కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మీ నాన్న తప్పు చేశాడని నీకు అనిపిస్తుందా అని స్వప్నను అడుగుతాడు శ్రీధర్. కాశీ తప్పు చేశాడు. అతని బుద్ధి మారిపోయిందని స్వప్న అంటుంది. అయినా శ్రీధర్ బాధపడుతుంటాడు. దాంతో తండ్రి ఒడిలో పడుకుని ఏడుస్తూ శ్రీధర్ బాధ గురించి చెబుతుంది.
నువ్వు గెలిచావ్, కాశీ ఓడిపోయాడు

మీ రెండో పెళ్లి బయట పడ్డాక నా జీవితం ఏమైపోతుందో అని భయపడ్డారు. ఇప్పుడు నాకోసం అలాగే బాధపడుతున్నారు. మేము అందరి ప్రేమ కోరుకుంటాం. మీ మీద మాకున్న ప్రేమను ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తాం. నేను పెట్టిన టెస్టుల్లో నువ్వే గెలిచావ్ నాన్న. కానీ, కాశీ ఓడిపోయాడు అని ఏడుస్తూ చెబుతుంది. ఆ మాటలు విని కావేరి కూడా ఏడుస్తుంది.
నమ్మకాన్ని కాశీ దించేసుకున్నాడు. నువ్వింకా మోస్తూనే ఉన్నావ్ అని స్వప్న ఏడిపిస్తుంది. మరోవైపు హాస్పిటల్ నుంచి కార్తీక్ వాళ్లు వస్తారు. సుమిత్రకు ఏ సమస్య లేదన్నారు. మనసు ప్రశాంతంగా ఉందని దశరథ్ వెళ్లిపోతాడు. కార్తీక్‌ను నిజంగానే ఏం పర్లేదా అని అడుగుతుంది దీప. మావయ్య చెప్పారుగా అని లోపలికి తీసకెళ్తాడు కార్తీక్.
దశరథ్ గురించి కార్తీక్‌ను కంగారుగా అడుగుతుంది సుమిత్ర. ఇంతలో శివ నారాయణ ఏమైందని అడుగుతాడు. ప్రతి ఆరు నెలలకు టెస్ట్‌లు చేయించుకోవాలిగా అని కార్తీక్ అంటే.. రిపోర్టులో ఏముందని శివ నారాయణ అడుగుతాడు. రక్తం తక్కువ ఉందని అబద్ధం చెబుతాడు కార్తీక్. అందరూ అంతే అని అడిగితే అంతే అని కార్తీక్ ఇబ్బందిగా చెబుతాడు.
రిపోర్ట్స్ చూపించురా
సరే రిపోర్ట్స్ ఇటువ్వురా. సెకండ్ ఒపినీయన్ తీసుకుందామని శివ నారాయణ అడుగుతాడు. మేము మూడో ఒపినీయన్ కూడా అడిగాం అని కార్తీక్ అంటాడు. సరే మెడిసిన్ ఇవ్వు. అవి దేనికి పనిచేస్తాయో చూస్తా అని శివ నారాయణ అడుగుతాడు. డీ విటమిన్ ట్యాబ్లెట్స్‌లో ఏముంటుంది తాత. మాకు తెలియదా అని కార్తీక్ అంటాడు. కానీ, నీ మొహం చూస్తే ఏదో దాస్తూ ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తుందని శివ నారాయణ అంటాడు.
{{/usCountry}}సరే రిపోర్ట్స్ ఇటువ్వురా. సెకండ్ ఒపినీయన్ తీసుకుందామని శివ నారాయణ అడుగుతాడు. మేము మూడో ఒపినీయన్ కూడా అడిగాం అని కార్తీక్ అంటాడు. సరే మెడిసిన్ ఇవ్వు. అవి దేనికి పనిచేస్తాయో చూస్తా అని శివ నారాయణ అడుగుతాడు. డీ విటమిన్ ట్యాబ్లెట్స్‌లో ఏముంటుంది తాత. మాకు తెలియదా అని కార్తీక్ అంటాడు. కానీ, నీ మొహం చూస్తే ఏదో దాస్తూ ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తుందని శివ నారాయణ అంటాడు.
{{/usCountry}}వాడికి ఏం బాధ ఉండదు లెండి. అంత నచ్చినట్లే జరుగుతుంది కదా. సొంత చెల్లి అయితే బామ్మర్దిని జైలు నుంచి తీసుకొచ్చేవాడు కదా అని పారిజాతం అంటుంది. చెప్పిందే ఎన్నిసార్లు చెబుతావ్. నీకు వాడుకోడానికి బంధాలు కావాలి. కానీ, వాడు బంధాల కోసం ఎంత దూరమైన వెళ్తాడు అని కార్తీక్ గురించి గొప్పగా చెబుతాడు శివ నారాయణ.
దానికి కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. రేయ్ కార్తీక్ నీ మాట నేను నమ్ముతారా అని శివ నారాయణ అంటాడు. కార్తీక్‌ను సోఫాలో కూర్చోబెడుతుంది సుమిత్ర. దశరథ్‌ను కూడా పక్కన కూర్చోమంటాడు శివ నారాయణ. నీకోసం పాయసం చేశానురా. నాకు అన్ని తినాలనిపిస్తుంది. అందరికి అన్ని వడ్డించి పెట్టాలనిపిస్తుంది. అందరిని చూడాలనిపిస్తుంది అని సుమిత్ర అంటుంది.
మిస్ అయిన జ్యోత్స్న ఫైల్స్
డాక్టర్ చెప్పినదానికి నువ్వు చెప్పినదానికి సరిపోయింది అత్త అని కార్తీక్ లోపలే ఏడుస్తుంటాడు. బావ మొహంలో అంత బాధ ఎందుకు అని దీప అనుకుంటుంది. బావ ఎందుకు సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నాడు అని జ్యోత్స్న అనుకుంటుంది. కార్తీక్‌కు సుమిత్ర తినిపిస్తుంది. బావ ఏదో దాస్తున్నాడు అని దీప, జ్యోత్స్న ఒకేలా ఆలోచిస్తారు.
ఆఫీస్‌లో జరిగింది అంతా గుర్తు చేసుకుంటాడు శ్రీధర్. కార్తీక్ నీకోసం ఏదైనా చేయాల్సి వచ్చిన రోజున కచ్చితంగా చేస్తాను. జ్యోత్స్న జాతకం మన చేతిలో ఉందిగా. మనవరాలి గురించి మావయ్యకు చెబితే ఆయనే చూసుకుంటాడు అనుకున్న శ్రీధర్ మొత్తం వెతుకుతాడు. ఎక్కడ కనిపించవు.
ల్యాప్‌ట్యాప్‌లో డేటా ఉంటుందిగా అని చూస్తే అదంతా ఖాళీగా ఉండటంతో శ్రీధర్ షాక్ అవుతాడు. ఫైల్స్ ఎవరో కావాలనే డిలీట్ చేసినట్లుంది. ఇది చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది. జ్యోత్స్సకు తప్ప ఎవరికి లేదు. జ్యోత్స్న ఆఫీస్‌కు వచ్చిందా. అసలు ఈ విషయం జ్యోత్స్నకు ఎలా లీక్ అయింది తల బాదుకుంటాడు శ్రీధర్. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.