Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో దీపకు మెయిల్ వస్తే మేనేజర్ ఫుడ్ ఆర్డర్ వచ్చినట్లుందని చెబుతాడు. చదివి చెప్పమని దీప అంటే.. వద్దు మేడమ్, నా మీద మీకు నమ్మకం లేదుగా సూరజ్ గారితోనే చదివించుకోండని చెప్పి వెళ్లిపోతాడు మేనేజర్.
కల్తీదానా అన్న దీప

కార్తీక్ ఇచ్చిన యాప్ ఐడియా గుర్తుకు వచ్చి మెయిల్ ఏది వచ్చిందో ఫొటో తీసి ట్రాన్స్‌లేట్ చేస్తుంది దీప. మెయిల్ ఏం వచ్చిందో చూద్దామని జ్యోత్స్న వస్తుంది. ఏమే ఫిఫ్త్ క్లాస్ అని జ్యో అంటే.. పోయి పని చూసుకోవే కల్తీదానా అని జ్యోత్స్న అంటుంది. ఏయ్ అని జ్యో అంటే.. ఏంటే.. రెస్టారెంట్‌లో కల్తీ చేసింది నువ్వేగానే అని దీప గట్టిగా అంటుంది.
నువ్వేమో గొప్పదానివినట్టుగా మాట్లాడుతున్నావ్. నువ్వేం మోసాలు చేయలేదా. ఫొటో తీసి ట్రాన్స్‌లేట్ చేయడం కాదు వారికి రిప్లై ఇవ్వాలి. అది ఇంగ్లీషులోనే ఇవ్వాలి. మనకది రాదు అని జ్యోత్స్న ఎగతాళి చేస్తుంది. కార్తీక్ ఎంట్రీ ఇచ్చి ఒకరికి రాని విషయాన్ని వెలెత్తి చూపి ఎగతాళి చేయడం సంస్కారం కాదని అంటాడు.
నువ్వేందుకు ఇన్వాల్వ్ అవుతున్నావ్. దేనికైనా సూరజ్‌ను పెట్టుకుందిగా. అతనే చూసుకోవాలని జ్యో అంటే.. ఇప్పుడు గాయాలతో ఉన్న సూరజ్ హాస్పిటల్‌కి రావాల అని కార్తీక్ అంటాడు. వాడికి దెబ్బ తగిలిన విధానానికి వారం రోజుల వరకు బెడ్ దిగడు. లేచినా నడవలేడు. నడిచిన ఇక్కడికి రాలేడు. ఈలోపు ఏం చేసిన దీపే చేయాలని జ్యోత్స్న అంటుంది.
పని రాక్షసుడిలా ఉన్నావ్
కానీ, సూరజ్ వచ్చి జ్యోత్స్నకు పెద్ద ట్విస్ట్ ఇస్తాడు. జ్యో షాక్ అయిపోతుంది. ఏమైంది బ్రదర్. నువ్వేమో మేడమ్‌ని హీరోలా కాపాడవని తాత చెప్పాడు. ఈవిడమే నువ్వు బెడ్డు దిగలేవంది. ఫోన్స్, మెసేజెస్‌కు రిప్లై లేదు. ఎక్కడుంటావో అడ్రస్ తెలియదు. నీ అడ్రస్ చెప్పు. ఏది ఉన్న డైరెక్ట్ వస్తాను. ఇలాంటి పరిస్థితుల్లో ఆఫీస్‌కు ఎందుకు వచ్చావ్ అని కార్తీక్ అంటాడు.
{{/usCountry}}కానీ, సూరజ్ వచ్చి జ్యోత్స్నకు పెద్ద ట్విస్ట్ ఇస్తాడు. జ్యో షాక్ అయిపోతుంది. ఏమైంది బ్రదర్. నువ్వేమో మేడమ్‌ని హీరోలా కాపాడవని తాత చెప్పాడు. ఈవిడమే నువ్వు బెడ్డు దిగలేవంది. ఫోన్స్, మెసేజెస్‌కు రిప్లై లేదు. ఎక్కడుంటావో అడ్రస్ తెలియదు. నీ అడ్రస్ చెప్పు. ఏది ఉన్న డైరెక్ట్ వస్తాను. ఇలాంటి పరిస్థితుల్లో ఆఫీస్‌కు ఎందుకు వచ్చావ్ అని కార్తీక్ అంటాడు.
{{/usCountry}}దెబ్బలు తగలడం నా పర్సనల్. దీప గారికి సహాయంగా ఉండటం నా ప్రఫొషెన్. నా వల్ల ఏ పని ఆగకూడదు అని సూరజ్ అంటాడు. మరి పనిరాక్షసుడిలా ఉన్నావుగా బ్రదర్. ఎనీ వే మా ఫ్యామిలీ మెంబర్‌ను కాపాడినందుకు థ్యాంక్స్ చెబుతాడు కార్తీక్. దీప కూడా చెబుతుంది. అసలు చెప్పాల్సింది పెద్ద మేడమ్ అని కార్తీక్ అంటాడు.
ఈయనేమో గొప్ప పని చేసినట్లు అంటావు. ఈయనను కాపాడమని చెప్పామా. మమ్మల్ని కాపాడుకోవడం మాకు చేతకాదు. అనవసరమైన విషయాల్లో తలదూరిస్తే ఇలాగే దెబ్బలు తగులుతాయ్ అని జ్యోత్స్న వెళ్లి కూర్చుంటుంది. దీప తన చైర్‌లో సూరజ్‌ను కూర్చోబెడుతుంది. కార్తీక్ వెళ్లిపోతాడు. మెయిల్స్ వచ్చాయి, చూడమని చెప్పి దీప కూడా వెళ్తుంది.
రౌడీలపై కార్తీక్ డౌట్
జ్యోత్స్న ఎందుకు థ్యాంక్స్ చెప్పలేదని దీప అంటే.. కోపం ఉండొచ్చుగా. రౌడీలు ఎందుకు సూరజ్ చుట్టూనో, జ్యోత్స్న చుట్టూనో తిరుగుతున్నారని, ఈ అటాక్ కూడా జ్యోత్స్న ఏమైనా చేయించిందా. జ్యోత్స్న మీదే అటాక్ చేశారు. అదే మిస్టరీగా ఉంది అని కార్తీక్ డౌట్ పడతాడు. తర్వాత దీపను చెకప్‌కి హాస్పిటల్‌కు వెళ్దామని కార్తీక్ అంటాడు.
ఆడతనం, అమ్మతనం, పుట్టుక, బాధ్యతల గురించి గొప్పగా మాట్లాడుకుంటారు కార్తీక్, దీప. మరోవైపు జ్యోత్స్నకు సూరజ్ సైట్ కొడతాడు. పక్కన ఉన్న పేపర్స్‌లో ఐ లవ్ యూ అని రాసి ఉండటం చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. సూరజ్ రాసాడనుకుని వెళ్లి అతని టేబుల్ ముందు పెడుతుంది. అది చూసి ఇలాంటివన్ని నాకు ఇష్టం లేదని సూరజ్ అంటాడు.
ఇక్కడ ఏముంది ఐ లవ్ యూ అని కోపంగా చెబుతుంది జ్యోత్స్న. నేను వచ్చింది ఆఫీస్‌లో వర్క్ చేయడానికి, నీతో ఐ లవ్యూ చెప్పించుకోడానికి కాదని సూరజ్ అంటాడు. ఇది ఎందుకు రాశావని నిలదీస్తుంది జ్యోత్స్న. నేను రాయడం నువ్వు చూశావా. మీ టేబుల్‌పై పెట్టడం చూశారా. మీరు చూడనిది మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారు అని సూరజ్ అంటాడు.
సూరజ్ రివర్స్ లవ్ ట్రాక్
నువ్వు నాకు నిన్న ఐ లవ్యూ చెప్పావుగా అని జ్యో అంటే.. ఎప్పుడు అని సూరజ్ అంటాడు. దాంతో మరింత షాక్ అయిన జ్యో నిన్న నేను కొట్టినప్పుడు అని అంటే.. మీరు నన్ను కొట్టారా. ఎప్పుడు అని అసలు ఏం గుర్తు లేనట్లు మాట్లాడి మరింత ట్విస్ట్ ఇస్తాడు సూరజ్. రేయ్ నేను నిన్ను కొట్టానురా అని జ్యోత్స్న అంటుంది.
రెస్టారెంట్‌లో జరిగినిదానికి డిస్టర్బ్ అయి జరగనిది జరిగినట్లుగా కనిపిస్తుందని నాకు అర్థమైంది. నాకు మీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. మీరు నన్ను ప్రేమించడం నా తప్పు కాదు అని రివర్స్ లవ్ ట్రాక్‌లో వస్తాడు సూరజ్. నేను చెప్పింది దీంట్లో రాసి ఉంది అని జ్యో అంటే.. ఇందులో అలా లేదే అని సూరజ్ అంటాడు. ఇంతలో శివ నారాయణ వస్తాడు.
పేపర్ తీసి దాస్తుంది జ్యో. రెస్ట్ తీసుకోమన్న కదా, ఎందుకు వచ్చావని శివ నారాయణ కోప్పడుతాడు. వర్క్ చేస్తేనే ప్రశాంతంగా ఉంటుందని సూరజ్ అంటే.. భలే విచిత్రమైన మనిషిలా ఉన్నావే అని శివ నారాయణ అంటాడు. అవును, ఏం రాశాడో చూడు తాత అని పేపర్ చూపిస్తుంది జ్యో. నిజానికి ఇది రాయాల్సింది నువ్వు అని తాత అంటాడు.
అడుగడుగునా జ్యోకి షాక్
దాంట్లో థ్యాంక్యూ అని రాసి ఉంటుంది. అది చూసి జ్యోత్స్న ఫ్యూజులు అవుట్ అవుతాయి. దీంట్లో ఐ లవ్యూ అని ఉండాలిగా అని అనుకుంటుంది జ్యో. సూరజ్ చేసిన దానికి నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సిందిపోయి అతను చెప్పాడని కంప్లైంట్ చేస్తావేంటీ అని శివ నారాయణ అంటాడు. థ్యాంక్యూ అని జ్యోత్స్న గారే రాశారు. నేను రాశానని ఆటపట్టిస్తున్నారని సూరజ్ అంటాడు.
అలా జ్యోత్స్నకు సూరజ్ అడుగడుగునా షాక్ ఇస్తాడు. ఎక్కడుంటావని శివ నారాయణ అడిగితే.. మణికొండలో, ఆఫీస్‌కు దగ్గరిలో రూమ్ వెతుకుతున్నానని, అప్పుడే రౌడీలు కనిపించారని సూరజ్ చెబుతాడు. పెళ్లయిందా అని తాత అడిగితే.. లేదని, లైఫ్ పార్టనర్ కోసం వెతుకుతున్నానని, దగ్గరిలోనే ఉందని సూరజ్ అంటాడు. దానికి జ్యో షాక్ అవుతుంది.
నా ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి. ఇంటికెళ్లేటప్పుడు చెప్పు నీతో పని ఉందని శివ నారాయణ వెళ్లిపోతాడు. సరిగా నిద్రలేక మైండ్ సరిగా పనిచేయట్లేదని జ్యోత్స్నతో సూరజ్ అంటే.. నీకు మైండ్ పని చేయకుండా చేస్తానని వెళ్లిపోతుంది. కానీ, సూరజ్ కాళ్ల దగ్గరే ఐ లవ్యూ అని రాసి పేపర్ పడి ఉంటుంది. అది చూసి సూరజ్ నవ్వుకుంటాడు.
తాత ఇంట్లో సూరజ్
కట్ చేస్తే శివ నారాయణ ఇంటికి సూరజ్‌ను తీసుకొస్తాడు కార్తీక్. ఇక్కడికెందుకు తీసుకొచ్చారని సూరజ్ అంటే.. ఘనంగా సన్మానిద్దామని జ్యో వెటకారంగా అంటుంది. తాత తీసుకురమ్మన్నాడని కార్తీక్ చెబుతాడు. ఇంట్లో అందరికి సూరజ్ కాపాడింది చెబుతాడు శివ నారాయణ. సూరజ్ ఆఫీస్‌కు దూరంగా ఉంటున్నాడు. కొంతకాలం సూరజ్ మన ఇంట్లోనే ఉంటాడని శివ నారాయణ చెబుతాడు.
దాంతో జ్యో అవాక్కవుతుంది. మనింట్లో సూరజ్ ఉండటమేంటని జ్యో అంటే.. ఇక్కడ కాదు అవుట్ హౌజ్‌లో అని శివ నారాయణ అంటాడు. పారిజాతం ఉలిక్కిపడుతుంది. వద్దు అని పారిజాతంకు పిట్స్ వచ్చినట్లు చేస్తుంది. తాళాల గుత్తి అడుగుతాడు కార్తీక్. వద్దు. నాకేం కాలేదంటుంది పారిజాతం.
మరెందుకు భయపడ్డావని కార్తీక్ అడిగితే.. అవుట్ హౌజ్ అంటే వైట్ హౌజ్ అంత పవర్‌ఫుల్‌రా. ఇదివరకు అవుట్ హౌజ్‌లో దీప అడుగుపెడితే తుఫాను వచ్చింది. ఇప్పుడు సూరజ్ అడుగుపెడితే సునామీ వస్తుందేమో అని పారిజాతం అంటుంది.
అవుట్ హౌజ్‌లో దెయ్యాలు
ఏమైందని శివ నారాయణ అంటే.. అవుట్ హౌజ్‌లో దెయ్యాలు తిరుగుతున్నాయని పారుకు కల వచ్చిందట అని కార్తీక్ కవర్ చేస్తాడు. దానికి ఎందుకు కంగారు. పారిజాతం అటువైపు వెళ్లకుంటే సరిపోద్దని శివ నారాయణ అంటాడు. తిరిగే దెయ్యం నువ్వేనని తాత అంటున్నాడని కార్తీక్ పారుతో అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.