Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్న మెడలో కార్తీక్ తాళి కట్టినట్లు కాంచన కల కనడంతో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కల నిజం అవుతుందేమోనని కాంచన భయపడుతుంది. మరోవైపు బావను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని జ్యోత్స్న అనుకుంటుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక్ దీపం 2 టుడే ఏప్రిల్ 16 ఎపిసోడ్ లో చూద్దాం.
దీప కోపం

కాంచనకు వచ్చిన కల గురించి కార్తీక్ మాట్లాడుతుంటే దీప కోపంతో వెళ్లిపోతుంది. ఎందుకు చెప్పావమ్మా అని కార్తీక్ అడిగితే తప్పంతా నాదేరా అంటూ కాంచన కూడా లోపలికి వెళ్లిపోతుంది. తల్లి, భార్య ఎందుకు అలుగుతారో తెలియదు. మనం ఏ తప్పు చేయకున్నా సారీ చెప్పాల్సిందేనని కొడుక్కి శ్రీధర్ హితబోధ చేస్తాడు.
బావను పెళ్లి చేసుకుంటానని
బావతో మెడలో తాళి కట్టించుకుంటానని జ్యోత్స్న చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ గంగానదికి ఆనకట్ట వేయడం కష్టమనుకుంటూ కార్తీక్ వస్తాడు. ఆ కన్నీళ్లు ఏంటీ అని కార్తీక్ అడుగుతాడు. నీకు తెలియనట్లు నటించకు అని దీప అంటుంది. బావతో తాళి కట్టించుకోకపోతే తన పేరు జ్యోత్స్ననే కాదని జ్యోత్స్న సవాలు చేసింది. ఈ విషయం అత్తకు తెలియదు. కానీ అత్తకు కల వచ్చిందని దీప ఫీల్ అవుతుంది.
నువ్వే మొగుడిగా
ఇది నిజంగా జరిగి తీరుతుందని దీప గొడవ చేస్తుంది. జ్యోత్స్న అసలే రాక్షసి. దాన్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? దానికి ఎవరో ఒకరిని మొగుణ్ని చేస్తానని కార్తీక్ అంటాడు. అదే ఏదో నువ్వే అయ్యేలా ఉన్నావని దీప షాక్ ఇస్తుంది. నీకు నా మీద అనుమానం ఏంటే తల్లి? కలలన్నీ నమ్మి నా మీద లేనిపోని అనుమానం పెట్టుకోకు. ఊహలు మాత్రం ప్రశాంతాన్ని పోగొడుతాయి. ప్రాణాలు తీస్తాయని కార్తీక్ వివరిస్తాడు.
కార్తీక్ ఇంటికి ఫ్యామిలీ
కార్తీక్ ఎంత చెప్పినా దీప వినదు. మళ్లీ దాని నోటి నుంచి నిన్ను పెళ్లి చేసుకుంటాననే మాట రానివ్వు, చాలా పెద్ద గొడవ అవుతుంది. అది నీ కోసం మన ఇంటికి వస్తే అని దీప అడుగుతుంది. మన ఇంటి వాకిట్లో కూడా అడుగుపెట్టనివ్వనని కార్తీక్ అంటాడు. సరిగ్గా అదే సమయంలో జ్యోత్స్నతో సహా శివ నారాయణ ఫ్యామిలీ మొత్తం కార్తీక్ ఇంటికి వస్తుంది.
కాంచన అనుమానం
{{/usCountry}}కార్తీక్ ఎంత చెప్పినా దీప వినదు. మళ్లీ దాని నోటి నుంచి నిన్ను పెళ్లి చేసుకుంటాననే మాట రానివ్వు, చాలా పెద్ద గొడవ అవుతుంది. అది నీ కోసం మన ఇంటికి వస్తే అని దీప అడుగుతుంది. మన ఇంటి వాకిట్లో కూడా అడుగుపెట్టనివ్వనని కార్తీక్ అంటాడు. సరిగ్గా అదే సమయంలో జ్యోత్స్నతో సహా శివ నారాయణ ఫ్యామిలీ మొత్తం కార్తీక్ ఇంటికి వస్తుంది.
కాంచన అనుమానం
{{/usCountry}}నాన్న, అన్నయ్య, వదినను చూసి కాంచన హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇవన్నీ ఏంటీ అని కాంచన అడుగుతుంది. చూస్తుంటే కల నిజమయ్యేలా ఉంది. జ్యోత్స్నను కార్తీక్ కు ఇచ్చి పెళ్లి చేయమని అడిగేందుకు అయితే రాలేదు కదా అని కాంచన అనుమానపడుతుంది. నా అల్లుడు ఏడమ్మా అని దశరథ అంటే, అల్లుడు ఏంటి అన్నయ్య? మేనల్లుడు కదా అని కాంచన అంటుంది.
జ్యోత్న్స ప్లాన్
దీప, కార్తీక్ ను పారిజాతం పిలుస్తానంటే జ్యోత్స్న అడ్డుకుంటుంది. నేనే వెళ్లి పిలుస్తానని జ్యో వెళ్తుంది. జ్యోత్స్న మెడలో నువ్వు తాళి కట్టినట్లు అత్తకు తెల్లవారు జామున కల వచ్చినట్లు చెప్తే బాధపడకుండా ఎలా ఉంటాను? నీ భార్యగా ఈ మాట తీసుకోవడం కష్టంగా ఉంది బావ అని దీప చెప్పడం జ్యోత్స్న వింటుంది. బాధపెట్టే అవకాశం నువ్వే ఇచ్చావని జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
స్పీకర్ ఆన్ చేసి
పెరట్లో వాళ్లు లేరని తిరిగి ఇంట్లోకి వెళ్లి జ్యోత్స్న అబద్ధం చెప్తుంది. కార్తీక్ కు కాల్ చేస్తుంది. దీప ఫోన్ తీసుకుని జ్యోత్స్న మీద అరిచేస్తుంది. జ్యో కావాలనే స్పీకర్ ఆన్ చేస్తుంది. నీకు నచ్చినట్లు ఫోన్ చేసి, నచ్చినట్లు మాట్లాడొచ్చని అనుకున్నావా? డ్యూటీ టైమ్ లో తప్పా మామూలు టైమ్ లో నువ్వు ఫోన్ చేస్తే ఊరుకోనని దీప వార్నింగ్ ఇస్తుంది. ఈ మాటలను అందరూ వింటారు. బాధపడ్డట్లు జ్యో తెగ నటిస్తుంది.
సుమిత్ర సీరియస్
అప్పుడే పారు ఫోన్ తీసుకుని మేం కుటుంబంతో సహా మీ ఇంటికి వచ్చామని చెప్తుంది. కార్తీక్, దీప లోపలికి వెళ్తారు. దీప ఎందుకు అలా మాట్లాడిందని కాంచనను శివ నారాయణ అడుగుతాడు. కార్తీక్ వెళ్లి కవర్ చేయాలని ప్రయత్నిస్తాడు. మీ భార్య ఇలా మాట్లాడుతుందని తెలియక వచ్చాం. నువ్వు మాట్లాడిన ప్రతి మాట మేం విన్నాం దీప. నా కూతురిని పట్టుకుని బుద్ధి ఉందా లేదా అని అడుగుతావా? అని సుమిత్ర సీరియస్ అవుతుంది.
దీపకు సారె
సుమిత్రను కూల్ చేయాలని దశరథ, పారిజాతం ప్రయత్నిస్తారు. కానీ దీప ఇలా మాట్లాడుతుందని అసలు ఊహించలేదని సుమిత్ర అంటుంది. అప్పుడే దాసు, అనసూయ కూడా వస్తారు. మేం దీపకు పుట్టింటి సారె తెచ్చాం. దీప కడుపుతో ఉంది. తనకు పుట్టిల్లు లేదనే లోటు తీర్చేందుకు ఇలా చేస్తున్నామని పారిజాతం చెప్తుంది.
దీప నా మనవరాలు లాంటిది. సుమిత్రకు కూతురు లాంటిది. దశరథ, సుమిత్ర చేతుల మీదుగా పెళ్లి జరిగింది కాబట్టే వాళ్లే ఈ కార్యక్రమం నిర్వహించాలని పారు హడావుడి చేస్తుంది. దీప చేతులకు సుమిత్ర గాజులు వేస్తుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.