Karthika Deepam 2 Today Episode: కాశీకి స్వప్న షాక్- అసలు దొంగ జ్యోత్స్న- నిజం చెప్పిన వైరా-కార్తీక్‌కు మైండ్ బ్లాక్
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 25 ఎపిసోడ్ లో వసంత్ తో పెళ్లికి స్వప్న ఓకే చెప్తుంది. ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చేయమంటుంది. దాసును జ్యో నానా మాటలు అంటుంది. మరోవైపు కిడ్నాప్ డ్రామా అంతా జ్యోత్స్న ప్లాన్ అని కార్తీక్ కు వైరా చెప్తాడు.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో దీప ముందే కావాలనే కార్తీక్ ను జ్యోత్స్న హగ్ చేసుకుంటుంది. కన్ను కొట్టి మరీ దీపను జ్యో రెచ్చగొడుతుంది. మరోవైపు కార్తీక్ చేతికి బుల్లెట్ తగలడంతో శ్రీధర్ చాలా బాధపడతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఏప్రిల్ 25 ఎపిసోడ్ లో చూద్దాం.

షాక్ ఇచ్చిన వసంత్
వసంత్ తో స్వప్న పెళ్లి గురించి శ్రీధర్, కావేరి మాట్లాడుకుంటారు. పెళ్లి వద్దని వసంత్ కు చెప్పమని శ్రీధర్ తో కావేరి అంటుంది. అప్పుడే వసంత్ ఎంట్రీ ఇస్తాడు. స్వప్నను పిలిచి ఎంగేజ్మెంట్ ప్లాన్ గురించి చెప్తాడు. ఎల్లుండి మంచి ముహూర్తం ఉందని, అందుకే క్యాంప్ కు వెళ్లకుండా ఆగిపోయానని వసంత్ షాక్ ఇస్తాడు.
ఇప్పుడే ఎందుకు?
అప్పుడే ఎంగేజ్మెంట్ ఏంటి బాబు? మేం ఇంకా నిర్ణయం పూర్తిగా తీసుకోలేదని కావేరి అంటుంది. స్వప్నకు, నాకు ఓకే అయినప్పుడు మీతో పనేంటి అన్నట్లు వసంత్ మాట్లాడుతాడు. స్వప్నకు టైమ్ కావాలా? అని వసంత్ అంటే స్వప్న సైలెంట్ గా ఉంటుంది. మధ్యలో కాశీ మాట్లాడతాడు. మౌనం అర్ధాంగీకారం అని కాశీ అంటాడు.
బాంబ్ పేల్చిన స్వప్న
నాకు ఈ పెళ్లి ఇష్టమే అని స్వప్న బాంబ్ పేలుస్తుంది. రెండు రోజుల్లో ఎంగేజ్మెంట్ కు ఏర్పాట్లు చేయండని స్వప్న చెప్పడంతో యాహూ అంటూ వసంత్ అరుస్తాడు. మమ్మీ, డాడీకి ఈ గుడ్ న్యూస్ చెప్పాలని వసంత్ హుషారుగా వెళ్లిపోతాడు. ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావ్ స్వప్న అని కావేరి మండిపడుతుంది. శ్రీధర్ మందు తాగే విషయాన్ని ప్రస్తావిస్తూ తప్పులు చేయడం మారరు అని స్వప్న ఏదో చెప్తుంది. నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేయమని స్వప్న స్పష్టం చేస్తుంది.
స్వప్న పెళ్లి చేసుకుంటే చేసుకోని అల్లుడు, నువ్వు కూడా మంచి సంబంధం చూసి చేసుకో దానికి బుద్ది వచ్చేలా చేయమని కాశీతో కావేరి అంటుంది. స్వప్నకు నేను భర్తగా ఉంటానో లేదో తెలియదు కానీ స్వప్న మాత్రం ఎప్పటికీ నా భార్యగానే ఉంటుందని కాశీ ఎమోషనల్ డైలాగ్ పేలుస్తాడు.
జ్యో ఫైర్
సీన్ శివ నారాయణ ఇంటికి మారుతుంది. ఏడుస్తూ కూర్చున్న దాసును చూసి జ్యోత్స్న వెటకారంగా మాట్లాడుతుంది. నేను చావనందుకా? లేదా అల్లుడికి బుల్లెట్ తగిలినందుకా? ఈ ఏడుపు ఎందుకు? అని జ్యో అడుగుతుంది. నిన్ను ఎవరో కిడ్నాప్ చేశారని తెలియగానే నేను ఎంత బాధపడ్డానో తెలుసా అని దాసు అంటాడు. ఆ బుల్లెట్ నాకు తగిలి పోయి ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయేదాన్ని. నువ్వు చేతగాని తండ్రివి అని జ్యో ఫైర్ అవుతుంది.
బావ తాళి కట్టడం
నువ్వు సుమిత్ర కూతురు కాదని చెప్పేయ్. నా దగ్గరకు వచ్చేయమని జ్యోను దాసు అడుగుతాడు. పురింట్లోనే చచ్చిపోయానని అనుకో నాన్న. నేను యావదాస్తికి వారసురాలు కావడం, బావ నా మెడలో తాళి కట్టడం నువ్వు చూడాలని దాసుకు జ్యో షాకిస్తుంది. నువ్వు ఇంకా మారవా? అని దాసు అడుగుతాడు. దాసును జ్యో నానామాటలు అంటుంది. జాగ్రత్త అని చెప్పి దాసు వెళ్లిపోతాడు.
దీప భయం
మరోవైపు కార్తీక్ తో మాట్లాడుతూ.. బాధతో నేను ఏడుస్తున్న బావ. నీకు ఏమైనా అయితే మేం అనాథలం అయిపోతాం. జరిగేవన్నీ చూస్తుంటే నేను ఊహించని ప్రమాదం ఏదో జరుగుతుందని అనిపిస్తుందని దీప భయపడుతుంది. అమ్మ ప్రేమను అడ్డుపెట్టుకుని జ్యోత్స్న ఇలా చేస్తుందని కార్తీక్ అంటాడు.
జ్యోత్స్న ప్లాన్
అప్పుడే వైరా నుంచి కార్తీక్ కు కాల్ వస్తుంది. ఏం దెబ్బ కొట్టావ్ రా? నీ కారణంగా రెండు సార్లు మోసపోయానని వైరా అంటాడు. ఇంకోసారి ప్లాన్ చేయకు. నా మరదలును అడ్డుపెట్టుకునే కదా రూ.30 కోట్లు కొట్టేయాలనుకున్నావని వైరాను కార్తీక్ అడుగుతాడు. నీ మరదలు చాలా పెద్ద దొంగ. అసలు ఈ కిడ్నాపే పెద్ద డ్రామా. అదంతా జ్యోత్స్న ప్లాన్ అని అంతా చెప్పేస్తాడు వైరా. అది విని కార్తీక్, దీప షాక్ అవుతారు.
నీ ఫ్యామిలీకి నీ మరదలే డేంజర్. అసలు అది మీ ఫ్యామిలీనే కాదు. ముందు దాన్ని ఇంట్లో నుంచి తరిమేయండి. జ్యోత్స్న నీ ఇంటి దొంగ. జ్యోత్స్నతో జాగ్రత్తగా ఉండు. రివేంజ్ తీర్చుకోవడానికి మళ్లీ వస్తా అని వైరా కాల్ కట్ చేస్తాడు.
లెక్క సరిచేయాల్సిందే
జ్యోత్స్నను ఏం చేద్దామో చెప్పు బావ అని కార్తీక్ ను దీప అడుగుతుంది. పెద్ద మేడం గారికి రేపు గుడ్ మార్నింగ్ గట్టిగానే చెప్పాలి. ఇక క్షమించాల్సిన అవసరం లేదు. పాపాల చిట్టా నిండిపోయింది. మేడం లెక్క రేపు సరిచేయాల్సిందేనని కార్తీక్ గట్టిగానే చెప్తాడు.
పారిజాతంపై ప్రేమ
మరోవైపు పారిజాతంపై శివ నారాయణ తెగ ప్రశంసలు కురిపించేస్తాడు. పారుకు ఓ నోట్ల కట్ట ఇస్తాడు. అడక్కుండానే రూ.50 వేలు ఇస్తున్నారని పారు ఆశ్చర్యపోతుంది. ఈ రోజు నువ్వు, కార్తీక్ పెద్ద సాహసం చేశారు. వాడికి బుల్లెట్ గాయం మినహా అంతా బాగానే జరిగిందని శివ నారాయణ అంటాడు.
అగ్రిమెంట్ చించేయొచ్చు కదా అని పారు అడిగితే, అది వాడు వేసుకున్న సంకెళ్లు. తాతా నాకు ఇది కావాలని అడిగితే చేసేందుకు నేను రెడీగా ఉన్నానని శివ నారాయణ చెప్పడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


