...
...
Next Story

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2-సూర‌జ్‌ను నిల‌దీసిన సుమిత్ర‌-జ్యోత్స్న‌కు దీప ధైర్యం-మాలిని వర్సెస్ జ్యో

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఆగస్టు 13 ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. తన మనసులో ఎవరూ లేరని సూరజ్ కు జ్యో చెప్తుంది. మరోవైపు రెస్టారెంట్ విషయంలో మాలిని వర్సెస్ జ్యోత్స్నగా పోటీ మారుతుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

Published on: Aug 13, 2026, 07:10:51 IST
Advertisement

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఆగస్టు 13 ఎపిసోడ్ లో.. కార్తీక్ ఇంటి నుంచి బయటకు వచ్చిన జ్యోత్స్న క్యాబ్ బుక్ చేసేందుకు ట్రై చేస్తుంది. క్యాబ్ సర్వీస్ లేదు, క్యాన్సిల్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా ఇంటికి వెళ్లాలని జ్యోత్స్న అనుకుంటుంది. అప్పుడే స్కూటీపై సూరజ్ వస్తాడు. వర్షం వచ్చేలా ఉంది. స్కూటీ ఎక్కమని సూరజ్ అడిగితే జ్యోత్స్న వద్దంటుంది.

సూరజ్ లిఫ్ట్

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

స్కూటీపై మళ్లీ వస్తా లిఫ్ట్ అడగమని జ్యోత్స్నతో సూరజ్ అంటాడు. ఇది నీ స్కూటీ, నేను డ్రైవర్ అనుకో. నేను పరాయివాడిని అనుకో. లిఫ్ట్ అడుగు అని ఎలాగోలా జ్యోత్స్న స్కూటీ ఎక్కేలా చేస్తాడు సూరజ్. స్కూటీ అద్దంలో నుంచి జ్యోత్స్నను చూస్తూ సైట్ కొడతాడు సూరజ్.

జ్యోత్స్న క్లారిటీ

జ్యోత్స్న, సూరజ్ ఇంటికి చేరుకుంటారు. నీ మనసులో ఎవరూ లేరని నన్ను నమ్మించడానికి చాలా కష్టపడుతున్నట్లున్నావ్ అని సూరజ్ అడుగుతాడు. నేను ఎవరినీ నమ్మించాల్సిన అవసరం లేదు. నా మనసులో ఎవరికీ స్థానం లేదని జ్యోత్స్న క్లారిటీగా చెప్తుంది. నాకు చిన్నప్పటి నుంచి చిక్కుడుకాయ అంటే ఇష్టం. ఆ కర్రీ బయట పడేసి ఇష్టం పోయిందంటే నమ్ముతావా? అలాగే వస్తువులు ఇచ్చేస్తే సరిపోతుందా? అని సూరజ్ ప్రశ్నిస్తాడు.

బావ మీద పంతం

నువ్వు ఏం అడుగుతున్నావో అర్థమవుతోంది. ఒకప్పుడు బావ అంటే నాకు ప్రాణం. అందుకే ఇచ్చిన వస్తువులు జాగ్రత్తగా పెట్టుకున్నా. ఇప్పుడు ఆ ఇష్టం పోయింది. బావ మీద నాకు ఉంది ప్రేమ కాదు, పంతం అని రియలైజ్ అయ్యా. అందుకే వస్తువులు ఇచ్చేశా. నాకు చేయాలనిపించింది చేశా. నా మనసులో ఎవరికీ స్థానం లేదు. నా కోసం నేను బతుకుతా. ఇలా ఒంటరిగానే బతుకుతానని జ్యో లోపలికి వెళ్లిపోతుంది.

జ్యోత్స్న వేదన

జ్యోత్స్న మనసులో కార్తీక్ ఉన్నాడని తెలుసు. చిన్నప్పటి నుంచి జ్యోత్స్న, కార్తీక్ కు పెళ్లి చేయాలనుకున్నారు. కానీ కార్తీక్ పెళ్లి అయిన తర్వాత కూడా జ్యో అలాగే ఉంది. మీరు జ్యోత్స్నను మార్చలేకపోయారు. మీరు మనసును మార్చాలని ప్రయత్నించలేదు. అందుకే ఫెయిల్ అయ్యారని సూరజ్ అంటాడు. నువ్వు మనసు మార్చాలని అనుకుంటున్నావని కార్తీక్ చెప్తాడు.

సూరజ్ ప్రేమ

ఇప్పుడు జ్యోత్స్న ఎంతో బాధపడుతుంది. మాట్లాడి కూడా మనసు మార్చొచ్చు అని కార్తీక్ అడుగుతాడు. జ్యోత్స్న మారిన రోజున కన్నీళ్లు రావు. ఆమె అంటే ఇప్పటికీ ఇష్టమేనని సూరజ్ చెప్తుంటే పై నుంచి ఈ మాటలన్నీ జ్యోత్స్న వింటుంది. ఫొటోలు, గిఫ్ట్ లు వెనక్కి ఇస్తే మనసు మారినట్లు కాదు. నేను కోరుకున్నట్లు జ్యో మారిపోతే నాకు అర్థమవుతుంది. జ్యోత్స్నతో జీవితాంతం కలిసి బతికేంత ప్రేమ నాలో ఉందని సూరజ్ చెప్తాడు.

రెస్టారెంట్ కోసం

మరోవైపు గౌరీ ప్రసాద్ రెస్టారెంట్ ను కొనాలని శివ నారాయణ ట్రై చేస్తాడు. కానీ గౌరీ ప్రసాద్ ఏమో అమ్మలేనంటాడు. మీరు మాకు అమ్మొచ్చు లేదంటే జ్యోత్స్న గ్రూప్ లో భాగం చేయొచ్చని కార్తీక్ రెండు ఆఫర్లు ఇస్తాడు. కానీ ఇవి రెండూ చేయలేను, మాలినికి రెస్టారెంట్ ఇస్తానని మాటిచ్చానని గౌరీ ప్రసాద్ చెప్తాడు. అప్పుడే దక్షిణామూర్తి, మాలిని ఎంట్రీ ఇస్తారు.

గౌరీ ప్రసాద్ కండీషన్లు

మాకు మాటిచ్చిన మనిషి మీకు రెస్టారెంట్ ఎలా అమ్ముతాడని దక్షిణామూర్తి ప్రశ్నిస్తాడు. అమౌంట్ ఎంతో చెప్పండి సెటిల్ చేసుకుందామని మాలిని అంటుంది. స్టాఫ్ ను మార్చొద్దని, దీన్ని రెస్టారెంట్ గానే ఉంచాలని రెండు కండీషన్లు పెడతాడు గౌరీ ప్రసాద్. మీ కండీషన్లు నాకు ఓకే అని శివ నారాయణ అంటాడు. దక్షిణామూర్తి, శివ నారాయణ సై అంటే సై అంటారు.

దీప, మాలిని వాగ్వాదం

నాకు ఈ రెస్టారెంట్ కావాలి దీప. మీరంతా ఏం చేస్తారో చేయండి. నేను బయట ఉంటానని శివ నారాయణ వెళ్లిపోతాడు. మాలిని అగ్రిమెంట్ రాయించుకొని రా అని దక్షిణామూర్తి కూడా వెళ్తాడు. మాలిని మాత్రం గౌరీ ప్రసాద్ కండీషన్లకు ఒప్పుకోదు. కానీ తాను ఒప్పుకొంటున్నట్లు దీప షాక్ ఇస్తుంది. దీప, మాలిని వాగ్వాదం చేసుకుంటారు. నాకే కావాలి అంటే నాకే కావాలి అని గొడవ పడతారు.

గౌరీ ప్రసాద్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతాడు. ఎవరిని ఎంచుకోవాలనేది స్టాఫ్ మెంబర్స్ కే వదిలేద్దామని కార్తీక్ సలహా ఇస్తాడు. స్టాఫ్ మీటింగ్ ఏర్పాటు చేయమంటారు.

గెలుపు నాదే అంటూ

బయట శివ నారాయణ, దక్షిణామూర్తి ఒకరిపై ఒకరు పంచ్ లు వేసుకుంటారు. నువ్వు ముసుగు కప్పుకున్న దొంగవని దక్షిణామూర్తి సంచలన వ్యాఖ్యలు చేస్తాడు. గెలుపు నాది అంటే నాది అని ఇద్దరూ వాదించుకుంటారు. ఇక స్టాఫ్ మీటింగ్ అరెంజ్ చేస్తాడు గౌరీ ప్రసాద్. స్టాఫ్ నిర్ణయమే నా నిర్ణయం. వాళ్లు సెలెక్ట్ చేసినవాళ్లకే రెస్టారెంట్ ఇస్తానని గౌరీ ప్రసాద్ అంటాడు.

మాలిని ఆఫర్

రెస్టారెంట్ కొన్న తర్వాత మీ అందరినీ జాబ్ లో నుంచి తీసేస్తా. మీకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఇస్తా. ఇక్కడ పనిచేస్తూ రూ.5 లక్షలు సంపాదించాలంటే చాలా కాలం పడుతుందని మాలిని ఆఫర్ ఇస్తుంది. అప్పుడు జ్యోత్స్నను మాట్లాడమని దీప అడుగుతుంది. ఈ బాధ్యతను నీకు అప్పజెప్తున్నా. నీకు సపోర్ట్ గా సూరజ్ ఉన్నాడు. ధైర్యంగా మాట్లాడమని దీప ధైర్యం ఇస్తుంది.

మాలినికి పోటీగా నిన్ను నిలబడుతున్నానని దీప అంటుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe