...
...
Next Story

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్:దీపే కూతురు-సుమిత్ర‌తో ద‌శ‌ర‌థ‌-దీప‌కు కాలు అడ్డుపెట్టిన జ్యో-దశరథ ఉగ్రరూపం-ప‌నిమనిషిగా జ్యో

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఫిబ్రవరి 27 ఎపిసోడ్ భలే రసవత్తరంగా సాగుతుంది. సుమిత్ర దగ్గరకు దీపను తీసుకెళ్లిన దశరథ ఆమెనే కన్నకూతురని చెప్తాడు. కాలు అడ్డుపెట్టి దీపను పడగొట్టాలని చూసిన జ్యోత్స్న, పారుపై దశరథ ఆవేశంతో ఊగిపోతాడు. జ్యోత్స్ననే వంట పనులు చేయాలని చెప్తాడు.

Published on: Feb 27, 2026, 07:09:13 IST
Advertisement

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఫిబ్రవరి 27 ఎపిసోడ్ లో.. దాసు మామయ్య కనిపించకపోవడానికి కారణం కిడ్నాప్ ఏమోనని పారు భయపడుతుందని శివనారాయణ ముందు పారిజాతాన్ని ఇరికించాలని కార్తీక్ ట్రై చేస్తాడు. సుమిత్ర ఆపరేషన్ కోసం టెన్షన్ పడుతున్నానని పారు కవర్ చేస్తుంది.

సుమిత్ర దగ్గరకు దీప

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

వీడేంటే మనతో ఫుట్ బాల్ ఆడుకుంటున్నాడు. చూస్తుంటే మన గుట్టంతా వీడికి తెలిసినట్లే ఉందని కార్తీక్ గురించి జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. మరోవైపు గదిలో ఉన్న సుమిత్ర దగ్గరకు దీపను దశరథ తీసుకెళ్తాడు. కొందరికి కొన్ని నిజాలు తెలియకపోతే హాయిగా నిద్రపోతారు. కానీ కొందరికి తెలిసిన నిజాలు చెప్పుకొనేవరకు నిద్ర రాదమ్మా. చక్కగా టిఫిన్ చేసి, ట్యాబ్లెట్స్ వేసుకుని మీ అమ్మ హాయిగా నిద్ర పోతుందని దీపతో దశరథ అంటాడు.

దీపే కన్నకూతురు

తన కూతురు తనను కాపాడుతుందని నమ్మకం మీ అమ్మకు వచ్చింది. మరి ఆ కూతురు ఎవరో తెలియాలి కదా. నా కథను దేవుడు కొత్తగా రాశాడు. ఈ రోజు నేను కన్నతల్లికి కన్నకూతురిని పరిచయం చేయబోతున్నానని దశరథ అంటాడు. పడుకుంటున్న సుమిత్రను పిలిచి దీపే మన కన్న కూతురు. తన పుట్టుక గురించి ఎవరికి చెప్పొద్దని నీ కన్నకూతురు మాట తీసుకుంది. లేదంటే ఇప్పటికే తన గురించి అందరికీ తెలిసేది అని దశరథ ఎమోషనల్ అవుతాడు.

తల్లి చనిపోయిందని

అత్త ఏదీ మోయలేదు. ముందు అత్తకు ఆపరేషన్ జరగాలి. పూర్తిగా కోలుకున్నాకే నిజం చెప్పాలని దీపను తీసుకుని కార్తీక్ గది నుంచి వెళ్లిపోతాడు. జ్యోత్స్న, పారిజాతం కలిసి దీప, కార్తీక్ ను ఏడిపించాలని అనుకుంటారు. దీపను పారు కాఫీ తెమ్మంటుంది. జ్యో కాలు అడ్డం పెట్టడంతో కాఫీ అంత పారు మీద పడుతుంది. కళ్లు నెత్తికెక్కి కావాలని పోస్తే చూసుకోవా? అని అడుగుతావేంటీ అని జ్యోత్స్న అంటుంది. దీపను కొట్టడానికి పారు చేయి ఎత్తుతుంది.

దశరథ ఆవేశం

అప్పుడే వచ్చిన దశరథ పారిజాతంపై సీరియస్ అవుతాడు. దీప మీద చేయి ఎందుకు ఎత్తుతున్నావ్ పిన్ని అని గట్టిగా అరుస్తాడు. దీపకు నువ్వు కాలు ఎందుకు అడ్డుపెట్టావ్? చెప్పు జ్యోత్స్న అని దశరథ అడుగుతాడు. మొబైల్ చూస్తూ కాలు ముందుకు పెట్టానని జ్యో చెప్తుంది. జరిగిన దాంట్లో దీప పొరపాటు లేనట్లే కదా. తప్పంతా నువ్వే చేశావు పిన్ని. నీకు తెలియదా? నేను అర్థమయ్యేలా చెప్తానని దశరథ అరుస్తాడు.

పిన్ని తప్పు చేశావ్

కార్తీక్ చెప్పినా దశరథ వినడు. పెద్ద పొరపాటే జరిగింది. దీప కింద పడిపోయి ఉంటే ఏం జరిగేది? పిన్ని నువ్వు ఏ తప్పు చేశావో నీకు తెలియదా? అని గట్టిగట్టిగా దశరథ అరుస్తాడు. పనిమనిషిని కాఫీ అడగడం తప్పు కాదు కదా దశరథ అని పారు అంటుంది. దీప పని మనిషి కాదు, నా మేనల్లుడి భార్య. నా చెల్లెలి కోడలు. నీకు దీప పనిమనిషి ఏమో కానీ నాకు మాత్రం ఆప్తురాలు. ఒక గతం మరొకరికి కథే కావచ్చు. కానీ అనుభవించిన వాళ్లకు జీవితం అని పారుకు గట్టిగా తగిలేలా దశరథ అంటాడు.

దీప ఎవరో చెప్పు జ్యోత్స్న? దీప కడుపుతో ఉన్న మనిషి. కడుపుతో ఉన్న మనిషికి పని చెప్పడం తప్పా కాదా? కాఫీ కావాలంటే జ్యోత్స్నను అడగాలి. జ్యోత్స్న తీసుకురాదా? ఇక మీదట నువ్వు పని చేయడం చూడాలనుకుంటున్నా. దీప పని చేయదు. ఈ రోజు నుంచి దీప నీకు కానీ పిన్నికి కానీ కాఫీలు, టిఫిన్లు ఇవ్వదు. జ్యోత్స్న ప్రిపేర్ చేసి ఇస్తుందని దశరథ ఆవేశంగా మాట్లాడతాడు.

భర్తకు కాఫీ పెట్టదా?

జ్యోత్స్న మీద ఎందుకు ఇంత కోపం చూపిస్తున్నావ్? ఇప్పుడు కొత్త పనులు ఎలా వస్తాయని శివనారాయణ అడుగుతాడు. నేర్చుకోవాలి కదా నాన్న. పెళ్లి చేసుకుని వెళ్లిపోయే మనిషే కదా. అక్కడ భర్తకు కాఫీ పెట్టదా? పని చేయకపోతే మన పెంపకం గురించి తప్పుగా చెప్పుకుంటారు. ఈ రోజు నుంచి జ్యోత్స్న ఇంటి పనులు నేర్చుకోవాల్సిందేనని దశరథ అంటాడు. నా వల్ల కాదు డాడీ అని జ్యోత్స్న చెప్తుంది. నీ వల్ల కాకపోతే గ్రానీని చేయమను అని దశరథ అంటాడు.

దశరథను కార్తీక్ బయటకు తీసుకెళ్తాడు. దశరథ బాధ మీకు అర్థమైందా? దీప కడుపులో పెరుగుతుంది వాళ్ల అమ్మ అని దశరథ, కాంచన నమ్ముతున్నారు. దీప పడపోయిందంటే వాడి బాధ నేను అర్థం చేసుకోగలను. కడుపులో బిడ్డ కోసం నువ్వు కొన్ని పనులు తగ్గించుకో అని దీపకు శివనారాయణ చెప్తాడు. నాన్న దీపను ఒక్క మాట కూడా అననివ్వడం లేదని జ్యోత్స్న పారుతో అంటుంది.

మామయ్య ఎందుకు ఇంత ఆవేషం అని దశరథను కార్తీక్ అడుగుతాడు. సుమిత్రను చూస్తుంటే పాపం చేస్తున్నానేమోనని అనిపిస్తుంది. జ్యోత్స్న, పారును చూస్తుంటే వాళ్ల పాపాలు గుర్తుకు వస్తున్నాయని దశరథ అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks