Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూలై 3 ఎపిసోడ్ లో జ్యోత్స్న, సూరజ్ మధ్య రివేంజ్ డ్రామా హైలైట్ గా నిలిచింది. తనతో స్కూటీ నెట్టించిన జ్యోకు లిప్ స్టిక్ మరకతో సూరజ్ అదిరిపోయే కౌంటర్ ఇస్తాడు. ఇక శివ నారాయణ ఆఫీసులోకి దక్షిణామూర్తి ఎంట్రీతో కథ కొత్త మలుపు తీసుకుంటుంది. ఇంకా కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.
స్కూటీపై జంటగా

నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ లో సూరజ్ స్కూటీపై జ్యోత్స్న రివర్స్ లో కూర్చుని ప్రయాణిస్తుంది. "నువ్వు కేవలం మంత్లీ శాలరీ కోసం పనిచేసే ఎంప్లాయ్ వి మాత్రమే. నీ అకౌంట్ బ్లాక్ చేశారు, నీ దగ్గర మనీ లేదు కాబట్టి నేను డ్రాప్ చేస్తున్నా. నేను ఎలా నడిపినా కామ్ గా కూర్చోవాల్సిందే" అని సూరజ్ అంటాడు. పెళ్లయిన కార్తీక్ ను వదిలేయమని సూరజ్ చెప్పిన విషయాన్ని జ్యో గుర్తు చేసుకుంటుంది.
మొగుడు పెళ్లాలా?
దారిలో ఓ వ్యక్తి సూరజ్, జ్యోత్స్నను చూసి "ఏంటీ మొగుడు పెళ్లాల గొడవా? కొత్త జంటలా ఉన్నారు" అని కామెంట్ చేసి వెళ్లిపోతాడు. ఆ మాటలకు జ్యోత్స్న రగిలిపోతుంది. స్కూటీ ఆపించి, సూరజ్ ను వాటర్ బాటిల్ తెమ్మని పంపిస్తుంది. ఆ గ్యాప్ లో పిన్నీసుతో టైర్ పంక్చర్ చేస్తుంది. ఆఫీస్ కి వెళ్లాల్సిందేనని పట్టుబట్టడంతో.. సూరజ్ వెనకాల జ్యోను కూర్చోబెట్టుకుని స్కూటీని తోసుకుంటూ వెళ్తాడు.
జ్యోత్స్న పొగరు
ఆఫీస్ లో దీప ముందు అన్ని బ్రాంచ్ ల ఫైల్స్ పెడతాడు కార్తీక్. "ఎవరితో ఏం చేయించాలో నాకు తెలుసు దీప" అని కార్తీక్ ధైర్యం చెబుతుండగా.. సూరజ్, జ్యోత్స్న వస్తారు. "నువ్వు పడిన కష్టానికి నేను కట్టిన ఖరీదు ఇది" అంటూ జ్యోత్స్న పొగరుగా రూ.500 నోటు సూరజ్ చేతిలో పెడుతుంది. పంక్చర్ చేసిందీ తానే అని చెబుతుంది. అయితే జ్యో బ్యాగులో నుంచి కిందపడిన లిప్ స్టిక్ ను తీసుకున్న సూరజ్.. ఆమెపై రివేంజ్ కు ప్లాన్ చేస్తాడు.
లిప్స్ మార్క్
సూరజ్ వైట్ షర్ట్ వెనుకాల ఉన్న 'లిప్స్ మార్క్' ను కార్తీక్ చూసి, దీపకు చూపిస్తాడు. "మా ముందు మీరిద్దరూ కొట్టుకున్నట్లు బిల్డప్ ఇస్తూ, మీరు మీరు ఒకటైపోతారా? అప్పుడే ముద్దుల దాకా వెళ్లిపోయారా?బావ అని ట్యాగ్ సూరజ్ కు ఇచ్చేశావు కదా" అంటూ జ్యోతో కార్తీక్ ఓ రేంజ్ లో ఆడుకుంటాడు. ఆ లిప్ మార్క్ చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇదంతా అబద్ధం అని చెప్పమన్నా సూరజ్ సైలెంట్ గా ఉండటంతో జ్యోత్స్న రగిలిపోతుంది.
{{/usCountry}}సూరజ్ వైట్ షర్ట్ వెనుకాల ఉన్న 'లిప్స్ మార్క్' ను కార్తీక్ చూసి, దీపకు చూపిస్తాడు. "మా ముందు మీరిద్దరూ కొట్టుకున్నట్లు బిల్డప్ ఇస్తూ, మీరు మీరు ఒకటైపోతారా? అప్పుడే ముద్దుల దాకా వెళ్లిపోయారా?బావ అని ట్యాగ్ సూరజ్ కు ఇచ్చేశావు కదా" అంటూ జ్యోతో కార్తీక్ ఓ రేంజ్ లో ఆడుకుంటాడు. ఆ లిప్ మార్క్ చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇదంతా అబద్ధం అని చెప్పమన్నా సూరజ్ సైలెంట్ గా ఉండటంతో జ్యోత్స్న రగిలిపోతుంది.
{{/usCountry}}ఆ తర్వాత సూరజ్ లాజిక్ గా మాట్లాడి జ్యో లిప్ స్టిక్ తో పాటు ఆమె ఇచ్చిన రూ.500 నోటును కూడా తిరిగి ఇచ్చేసి షాకిస్తాడు.
దక్షిణామూర్తి ఎంట్రీ
ఆఫీస్ లోకి శివ నారాయణ వియ్యంకుడు దక్షిణామూర్తి సడెన్ ఎంట్రీ ఇస్తాడు. జ్యోత్స్నను అసిస్టెంట్ గా చూడటం, శివ నారాయణ అక్కడికి రావడంతో వాతావరణం వేడెక్కుతుంది. శివ నారాయణ క్యాబిన్ లో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది.
"మాదాపూర్ లో మీ రెస్టారెంట్ కు ఎదురుగా ఉన్న పాత రెస్టారెంట్ ను తీసుకున్నా. రేపే ఓపెనింగ్. నీ బ్రాంచ్ లు ఎక్కడున్నాయో అక్కడ పోటీగా నేను బ్రాంచ్ లు ఏర్పాటు చేశా. నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టను" అని దక్షిణామూర్తి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు.
సూరజ్ పై డౌట్
దీంతో తన మనుషుల్లో ఎవరైనా కోవర్టులు ఉన్నారా? అని శివ నారాయణకు డౌట్ వస్తుంది. సరిగ్గా అదే సమయానికి.. ఆఫీస్ బయట దక్షిణామూర్తితో సూరజ్ మాట్లాడటం శివ నారాయణతో పాటు కార్తీక్, దీప చూస్తారు. అంతా షాక్ అవుతారు. "నువ్వు దక్షిణామూర్తి మనిషివా?" అని సూరజ్ ను శివ నారాయణ నిలదీయడంతో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ఉత్కంఠగా ముగుస్తుంది.