...
...
Next Story

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్నకు తాత ఘోర అవమానం.. నా మనవరాలు దీప అంటూ షాక్.. సూరజ్ 'ఐ లవ్ యూ' ట్విస్ట్!

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూన్ 11 ఎపిసోడ్ లో ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయి. జ్యోత్స్నను శివ నారాయణ దారుణంగా అవమానిస్తాడు. తన కుటుంబం నుంచి వెలేస్తాడు. మరోవైపు జ్యోత్స్నకు ఐ లవ్యూ అని చెప్పి సూరజ్ బిగ్ ట్విస్ట్ ఇస్తాడు.

Published on: Jun 11, 2026, 06:49:06 IST
Advertisement

Karthika Deepam 2 Today Episode: బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందుతున్న 'కార్తీక దీపం 2' సీరియల్ రోజురోజుకూ ఆసక్తికరమైన ట్విస్ట్‌లతో సాగుతోంది. జూన్ 11 నాటి ఎపిసోడ్‌లో జ్యోత్స్న వేసిన కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడటంతో కథ తీవ్రమైన మలుపు తిరిగింది. మరి కార్తీక దీపం 2 టుడే జూన్ 11 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

జ్యోత్స్నను ఛీత్కరించుకున్న తాత

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

బిర్యానీలో బొద్దింక వేసి దీపను ఇరికించాలనుకున్న జ్యోత్స్న కుట్ర బట్టబయలవుతుంది. దీంతో తాత శివ నారాయణ తీవ్ర ఆగ్రహానికి లోనవుతాడు. "ఈ రోజు నుంచి నా కుటుంబంలో నువ్వు లేవు.. నిన్ను ఈ క్షణమే మర్చిపోతున్నా. నా మనవరాలిని నేను దీపలో చూసుకుంటున్నా" అంటూ జ్యోత్స్నకు కోలుకోలేని షాక్ ఇస్తాడు.

ఎవరూ మాట్లాడొద్దని

ఎదుటివాళ్లను మోసం చేయాలనుకునే వాళ్లను క్షమిస్తే 'క్షమాపణ' అనే పదానికే అర్థం పోతుందని మండిపడతాడు. ఇకపై మన ఇంట్లో జ్యోత్స్న ఉన్నా లేనట్లేనని గట్టిగా అనౌన్స్ చేస్తాడు. నిజం నిరూపించిన సూరజ్‌కు థ్యాంక్స్ చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. తల్లి సుమిత్ర కూడా జ్యోత్స్నతో ఎవరూ మాట్లాడొద్దని దశరథ్, పారిజాతానికి తెగేసి చెప్తుంది.

సూరజ్ 'ఐ లవ్ యూ' ట్విస్ట్

మరోవైపు ఒంటరిగా ఉన్న జ్యోత్స్న దగ్గరకు వెళ్లిన సూరజ్.. "నువ్వు ఉసిగొల్పిన కుక్కలు ఒక్కోసారి నిన్నే కరుస్తాయి" అంటూ కౌంటర్ ఇస్తాడు. దీంతో కోపంతో రగిలిపోయిన జ్యోత్స్న.. బయటకు వచ్చాక సూరజ్ చెంప పగలగొడుతుంది. అయినా సూరజ్ నవ్వుతూ కంట్రోల్ చేసుకోవడంతో.. "నిన్ను చంపేస్తా, చావడానికి సిద్ధంగా ఉండు" అని జ్యోత్స్న వార్నింగ్ ఇస్తుంది.

ఇక కిచెన్‌లో దీపకు కార్తీక్ జ్యూస్ తాగిస్తుండగా.. "మా అమ్మ నా గురించి ఏమందో చెప్పవా బావ" అని దీప ముద్దుగా అడుగుతుంది. "దీప నా కడుపున పుట్టి ఉంటే బాగుండేదని అమ్మ అంది" అని కార్తీక్ చెప్పడంతో దీప మురిసిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన జ్యోత్స్న.. "మీరు అలా అనేలా చేశారు" అంటూ వెటకారం చేస్తుంది.

దానికి దీప గట్టిగా సమాధానమిస్తూ.. "హే డూప్లికేట్.. మా అమ్మ కడుపున మోస్తే నువ్వు కూతురు కాలేదు. ఊయలలు మారిస్తే అయ్యావ్. నా కన్నతల్లి ప్రేమతో నన్ను అన్న మాటలు ఇవి" అని కౌంటర్ ఇస్తుంది. ఇకపై ఈ డూప్లికేట్‌ను అందరూ వదిలేశారు కాబట్టి టిఫిన్ కూడా పెట్టరని దీప అనడంతో.. జ్యోత్స్న రగిలిపోతుంది. "నన్ను ఇంటికి దూరం చేస్తారా?" అని జ్యోత్స్న అడగడంతో.. కార్తీక్, దీప కలిసి జ్యోత్స్న బుగ్గలు గిల్లి.. "మంచి ముహూర్తం చూసి నీకు పెళ్లి చేసి పంపించేస్తాం బుజ్జమ్మా" అంటూ ఎగతాళి చేస్తారు.

దీపను చూసి ఏడ్చిన సుమిత్ర

పగతో రగిలిపోతున్న జ్యోత్స్న మళ్లీ రౌడీలకు ఫోన్ చేసి, సూరజ్ కనిపించకుండా చేయాలని చెప్తుంది. అలాగే దీపను ఈ ఇంట్లో ఉండనివ్వకూడదని అనుకుంటుంది. మరోవైపు దీప రావడంతో సుమిత్ర తన బాధను వెళ్లగక్కుతుంది. "నా కూతురు పద్ధతిగా లేదు.. తన తరపున నిన్ను సారీ అడుగుతున్నా. నా కూతురు కూడా నీలా ఉంటే ఎంత బాగుండేది" అని ఏడుస్తుంది. ఇక్కడితో ఈ రోజు కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe