Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ లో.. కాంచన ఇంటికి వచ్చిన దక్షిణామూర్తి కార్తీక్ తో రాజీ గురించి మాట్లాడతాడు. సూరజ్, జ్యోత్స్న పెళ్లకి ఒప్పుకొంటాను కానీ శివ నారాయణ తన కాళ్లు పట్టుకోవాలంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన శివ నారాయణ కోపంతో ఊగిపోతాడు.
తాతను ఒప్పించు

ఎవరి కోసమైతే వచ్చానో ఆ మనిషినే దేవుడు నా దగ్గరకు పంపించాడు. నువ్వు మీ తాతతో నేను చెప్పిన దాని గురించి మాట్లాడి ఒప్పించు. బయట వెయిట్ చేస్తానని కార్తీక్ కు చెప్పి దక్షిణామూర్తి వెళ్తాడు. ఆరోగ్యం ఎలా ఉందని సుమిత్రను అడుగుతాడు. పరిచయం లేనివాళ్లతో మాట్లాడనని సుమిత్ర తెగేసి చెప్తుంది.
శివ నారాయణ ఫైర్
మరోవైపు బంధువులు, కావాల్సినవాళ్లు, స్నేహితులు మీ ఇంటికి వస్తారని కార్తీక్, దీపపై శివ నారాయణ సెటైర్లు వేస్తాడు. మీరు కూర్చొబెట్టి కాఫీలు ఇస్తారు. మధ్యవర్తులుగా కూడా ఉంటారు. దానితో నాకేం సంబంధం. నేను వచ్చింది బంధాలు తెంచుకోవడానికి అని శివ నారాయణ ఫైర్ అవుతాడు.
సూరజ్, జ్యో వీడియో కాల్
ఇటు జ్యోత్స్న జ్ణాపకాల్లో మునిగిపోతాడు సూరజ్. అప్పుడే జ్యోకు శౌర్య వీడియో కాల్ చేసి సూరజ్ ను చూపిస్తుంది. బాబాయి జ్యోతో మాట్లాడు అని ఫోన్ సూరజ్ చేతిలో పెట్టి శౌర్య వెళ్లిపోతుంది. ఆ ఇంటికి ఎందుకు వెళ్లావ్? అనుకోకుండా అందరూ ఒకే చోట కలిశారా? అని జ్యోత్స్న అడుగుతుంది. శౌర్యను పిలిచి సూరజ్ ఫోన్ ఇస్తాడు. అక్కడ జరుగుతున్న విషయాన్ని జ్యోకు శౌర్య చెప్తుంది.
దీపకు రూ.10 కోట్లు
అగ్రిమెంట్ గురించి దీపకు శివ నారాయణ గుర్తు చేస్తాడు. నేను నిన్న సీఈఓగా తీసేస్తే రూ.10 కోట్లు కట్టాలి. నిన్ను సీఈఓగా తీసేస్తున్నా. జ్యోత్స్న రెస్టారెంట్ ఆఫీస్ లో సీఈఓగా అడుగుపెట్టడానికి వీల్లేదు. రిజైన్ చేస్తున్నట్లు సంతకం పెట్టి, ఈ చెక్ తీసుకో అని దీపతో శివ నారాయణ అంటాడు.
చెక్ చించేసిన కార్తీక్
{{/usCountry}}అగ్రిమెంట్ గురించి దీపకు శివ నారాయణ గుర్తు చేస్తాడు. నేను నిన్న సీఈఓగా తీసేస్తే రూ.10 కోట్లు కట్టాలి. నిన్ను సీఈఓగా తీసేస్తున్నా. జ్యోత్స్న రెస్టారెంట్ ఆఫీస్ లో సీఈఓగా అడుగుపెట్టడానికి వీల్లేదు. రిజైన్ చేస్తున్నట్లు సంతకం పెట్టి, ఈ చెక్ తీసుకో అని దీపతో శివ నారాయణ అంటాడు.
చెక్ చించేసిన కార్తీక్
{{/usCountry}}నేను బతికి ఉండాలని కోరుకుంటే సంతకం పెట్టి, చెక్ తీసుకో అని శివ నారాయణ అనడంతో దీప సంతకం పెడుతుంది. అగ్రిమెంట్ ను తీసుకొని దీప చేతికి చెక్ ఇస్తాడు శివ నారాయణ. ఇది మాకు అవసరం లేదని చెక్ చించేసి షాకిస్తాడు కార్తీక్. వీలువైన వాటిని దూరం చేసుకోవడం మీకు అలవాటే కదా అని శివ నారాయణ కౌంటర్లు వేస్తాడు.
సూరజ్ కు చెంపదెబ్బ
రేప్పొద్దున డబ్బు అవసరం ఉన్నా నువ్వు వచ్చి తీసుకోవచ్చు. మేనేజర్ కు చెప్పి ఉంచుతానని శివ నారాయణ అంటాడు. ఇక మధ్యవర్తిత్వం చేయడానికి వీళ్లు రెడీగా ఉన్నారని కూడా బాధపెట్టేలా మాట్లాడతాడు. కాంచన మాట్లాడుతున్నా పట్టించుకోకుండా వెళ్లిపోతారు. బయట సూరజ్ ను కోపంగా చూస్తుంది సుమిత్ర. ఎంత మోసం చేశావ్ రా అని చెంపపై కొట్టినట్లు ఊహించుకుంటుంది.
దక్షిణామూర్తికి అవమానం
శివ నారాయణ, దక్షిణామూర్తి ఒకరినొకరు మాటలు అనుకుంటారు. మన రెండు కుటుంబాల కోసం తలదించుకుని క్షమాపణ చెప్పు చాలు అని దక్షిణామూర్తి అంటాడు. వెంటనే ఆపరా అని శివ నారాయణ ఆవేశంతో ఊగిపోతాడు. నా కొడుకును మీ కుటుంబం చంపిందని దక్షిణామూర్తి అంటాడు. నా కొడుకును మీరు చంపాలనుకున్నారని శివ నారాయణ ఫైర్ అవుతాడు. ఒకరి కాలర్ ఒకరు పట్టుకుంటారు.
దక్షిణామూర్తి చొక్కాను శివ నారాయణ చించేస్తాడు. ఈ పెనుగులాటలో అగ్రిమెంట్ పేపర్లు దూరంగా పడిపోతాయి. క్షమాపణ కావాలన్నావ్ కదా ఇది చాలా? అని శివ నారాయణ మండిపడతాడు. ఈ గొడవను ఆపేందుకు కార్తీక్ ప్రయత్నిస్తాడు. దయచేసి మా ఇంటి ముందు కొట్టుకోకండి అని సూరజ్ ను కార్తీక్ కంట్రోల్ చేస్తాడు.
రేయ్ దక్షిణామూర్తి ఈ అవమానం నీకు జీవితాంతం గుర్తుకురావాలి. ఫొటో ఫ్రేమ్ కట్టించుకో అని శివ నారాయణ సెటైర్లు వేస్తాడు. మీరు, మీరు ఒకటైపోయారు కార్తీక్. నువ్వు, సూరజ్ ఒకటే అని మళ్లీ నిందలు వేసి శివ నారాయణ వెళ్లిపోతాడు. ఇది ఇక్కడితో ఆగిపోదని దక్షిణామూర్తిని తీసుకొని సూరజ్ కూడా వెళ్లిపోతాడు. అంటే రివేంజ్ ఉంటుందని చెప్తాడు.
కార్తీక్ కు అండగా
దరిద్రంతో ఫ్రెండ్షిప్ చేస్తున్నట్లు మన బతుకులున్నాయి. మన ఇంటి ముందు కొట్టుకున్నారు. మనల్ని బలి పశువులను చేశారు. ఇక చాలు అన్ని వదిలేయండని కార్తీక్ కు శ్రీధర్ చెప్తాడు. కార్తీక్, నువ్వు ఏది వదిలొద్దురా. మాలిని కొడుకే సూరజ్ అని తెలియదు కదా. నమ్మినందుకు మోసపోయారు. అందరూ నువ్వు తప్పు చేశావంటున్నారు. కానీ నేను నమ్మను. నా కొడుకు ఎప్పుడూ తప్పు చేయడని కాంచన ఎమోషనల్ డైలాగ్ లు పేలుస్తుంది.
ఈ సమస్యలు అన్నీ నువ్వే పరిష్కరించాలి. కార్తీక్, దీప ఏ తప్పు చేయలేదని మా నాన్న అనాలి. మళ్లీ దీప సీఈఓగా ఆఫీస్ లో అడుగుపెట్టాలి. నా కొడుకు ఎవరి ముందు తలదించుకు నిలబడడు. దక్షిణామూర్తికి అవమానం అంటే మాలినికి చెప్పుదెబ్బలాంటిదేనని కాంచన అంటుంది. శ్రీధర్ తో కలిసి రేపు వరంగల్ భద్రకాళి గుడికి వెళ్తున్నట్లు చెప్తుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.