...
...
Next Story

Karthika Deepam 2: కార్తీక దీపం 2లో ఊహించని మలుపు.. మాలిని మాస్టర్ ప్లాన్.. జ్యోత్స్నతో సూరజ్ పెళ్లి.. మైండ్ గేమ్ ఇదేనా?

Karthika Deepam 2: స్టార్ మా టాప్ సీరియల్ 'కార్తీక దీపం 2'లో కథనం ఊహించని మలుపులు తిరుగుతోంది. జ్యోత్స్న, సూరజ్ పెళ్లి కోసమే మాలిని మాస్టర్ ప్లాన్ వేసిందనే చర్చ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అసలు సూరజ్ ఎవరు? మాలిని తన కొడుకును నిజంగానే పంపించిందా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Published on: Jul 29, 2026, 12:43:57 IST
Advertisement

Karthika Deepam 2: బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ, రేటింగ్స్ లో దూసుకెళ్తున్న 'కార్తీక దీపం 2' (ఇది నవవసంతం) సీరియల్ రోజురోజుకూ మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. కార్తీక్, దీపల మధ్య ఎమోషనల్ బాండింగ్ ఒకవైపు సాగుతుండగానే, మరొకవైపు మాలిని వేస్తున్న కుట్రలు సీరియల్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా గత కొన్ని ఎపిసోడ్లుగా జ్యోత్స్న వివాహం చుట్టూ తిరుగుతున్న హై-వోల్టేజ్ డ్రామా ప్రేక్షకులను టీవీ స్క్రీన్లకు కట్టిపడేస్తోంది.

మాలిని మాస్టర్ ప్లాన్

కార్తీక దీపం 2లో ఊహించని మలుపు.. మాలిని మాస్టర్ ప్లాన్.. జ్యోత్స్నతో సూరజ్ పెళ్లి.. మైండ్ గేమ్ ఇదేనా? (jiohotstar)
కార్తీక దీపం 2లో ఊహించని మలుపు.. మాలిని మాస్టర్ ప్లాన్.. జ్యోత్స్నతో సూరజ్ పెళ్లి.. మైండ్ గేమ్ ఇదేనా? (jiohotstar)

కార్తీక దీపం 2 సీరియల్ కథా పరిణామాలను పరిశీలిస్తే, జ్యోత్స్నను తన వైపు తిప్పుకోవడం ద్వారా శివ నారాయణపై ప్రతీకారం తీర్చుకోవాలని మాలిని పక్కా స్కెచ్ వేసినట్లే కనిపిస్తోంది. అందుకే ఇంటికి పిలిపించి మరీ సగం ఆస్తి ఆఫర్ చేసింది. కానీ జ్యోత్స్న అందుకు ఒప్పుకోలేదు.

సూరజ్ తో పెళ్లి

కార్తీక దీపం 2 సీరియల్ లో శివ నారాయణ ఫ్యామిలీలో ఒకడిగా మారిన సూరజ్ స్వయంగా మాలిని కొడుకే అనే చర్చ జోరుగా సాగుతోంది. సీరియల్ కథ కూడా అదే విధంగా సాగుతుంది. మొదటి నుంచి జ్యోత్స్న చుట్టూ పెళ్లి అని సూరజ్ తిరుగుతున్నాడు.

తన ప్లాన్ లోనే భాగంగానే సూరజ్‌ను రంగంలోకి దించి, జ్యోత్స్న మనసును గెలుచుకునే బాధ్యతను అతనికి మాలిని అప్పగించిందనిపిస్తోంది. మాలిని దిశానిర్దేశంలో సాగుతున్న సూరజ్.. శివ నారాయణ కుటుంబంలో తన స్థానాన్ని బలపరచుకోవడానికి అత్యంత తెలివిగా ప్రవర్తిస్తున్నాడు.

జ్యోత్స్నకు సంబంధం

తాజా సన్నివేశాల్లో సూరజ్ కేవలం జ్యోత్స్నను మాత్రమే కాకుండా, ఇంటి పెద్ద అయిన శివ నారాయణతో పాటు కుటుంబ సభ్యులందరినీ తన మాటకారితనంతో, మర్యాదపూర్వకమైన ప్రవర్తనతో ఇంప్రెస్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. శివ నారాయణతో సహా ఇంట్లో అందరి మనసులు గెలుచుకున్నాడు.

ఇప్పుడు మాలిని రెచ్చగొట్టడంతో జ్యోత్స్న పెళ్లి వీలైనంత త్వరగా చేసేందుకు శివ నారాయణ, దశరథ, సుమిత్ర, కార్తీక్, దీప ప్రయత్నించే అవకాశం ఉంది. వరుడిగా ఇంకా ఎవరినో ఎందుకు సూరజ్ నే అడుగుదామనే సీన్ వచ్చేలాగే సీరియల్ కథ సాగుతున్నట్లు అనిపిస్తోంది. మాలినికి కావాల్సింది కూడా అదే.

ఏ మలుపు తిరుగుతుందో?

బుల్లితెర ట్రెండ్స్, టీఆర్పీ (TRP) విశ్లేషణ ప్రకారం.. రొటీన్ రొమాంటిక్ సన్నివేశాల కంటే కుటుంబంలో జరిగే మైండ్ గేమ్స్, పెళ్లి మలుపులు సీరియల్స్ రేటింగ్స్ ను పెంచడంలో కీలకంగా మారుతాయి. రాబోయే ఎపిసోడ్లలో సూరజ్, జ్యోత్స్న పెళ్లి జరుగుతుందా? సూరజ్ అసలు రంగును కార్తీక్ కనిపెడతాడా? అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe