Khatron Ke Khiladi 15 Rubber Bullets Injury: బుల్లితెర, ఓటీటీ తెరపై అత్యంత ఆదరణ పొందిన సాహసాల రియాలిటీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ 15' (Khatron Ke Khiladi 15) కొత్త సీజన్ వివాదాలకు నిలయంగా మారింది. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ వేదికగా చిత్రీకరించిన ఈ ఓటీటీ షోలోని ఒక స్టంట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది.
వెన్నుపై 40 రబ్బరు బుల్లెట్ల వర్షం!

ఎంటర్టైన్మెంట్ పేరిట కంటెస్టెంట్లను తీవ్రంగా హింసించడమేంటని ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. ఈ షోలో భాగంగా నిర్వహించిన 'పెయిన్ ఆక్షన్' (Pain Auction) టాస్క్‌లో నటులు శగున్ శర్మ, గౌరవ్ ఖన్నా, విశాల్ ఆదిత్య, కరణ్ వాహి పాల్గొన్నారు.
ఒక వ్యక్తి సైనిక దుస్తుల్లో వచ్చి, వారి వెనుక నిలబడి వరుసగా రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపాడు. పోటీదారులు కేవలం స్లీవ్‌లెస్ వేస్ట్, వెన్నుభాగానికి చిన్న ప్రొటెక్టర్ మాత్రమే ధరించారు. సమీప దూరం నుంచి ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిపించడంతో పోటీదారులు నొప్పితో అల్లాడిపోయారు.
యాక్షన్ డైరెక్టర్, హోస్ట్ రోహిత్ శెట్టి ఈ దృశ్యాలను చూస్తూ నవ్వుతుండగా, ప్రతీ ఒక్కరూ దాదాపు 40 రబ్బరు తులటాల (Pellets) దెబ్బలు తిన్నారని తర్వాత వెల్లడించారు. తట్టుకోలేక ముందుగా శగున్ శర్మ, ఆ తర్వాత గౌరవ్ ఖన్నా పోటీ నుంచి తప్పుకోగా.. విశాల్, కరణ్ చివరివరకు నిలబడ్డారు.
ఒళ్లంతా గాయాలు.. సోషల్ మీడియాలో పోస్టులు
ఈ టాస్క్ ముగిసిన తర్వాత మిగతా కంటెస్టెంట్లు వారి వెన్నుపై ఉన్న రక్తపు గాయాలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఓటీటీ షో పూర్తయిన వెంటనే శగున్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో గాయాల వీడియోను షేర్ చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
"బయట నుంచి చూసేవారికి ఇది కేవలం ఒక టాస్క్‌లా కనిపించవచ్చు. కానీ, లోపల అనుభవించిన ఆ భయంకరమైన నరకం నుంచి నేను ఇంకా కోలుకోలేదు" అని శగున్ శర్మ తన ఆవేదనను వెళ్లగక్కారు. మరో నటుడు గౌరవ్ ఖన్నా కూడా తన గాయాల ఫోటోలను షేర్ చేస్తూ.. "నా జీవితంలో అనుభవించిన అత్యంత దారుణమైన నరకం ఇది. టీవీలో చూస్తున్నప్పుడు కూడా ఆ నొప్పి మళ్లీ అనిపించింది" అని పేర్కొన్నారు.
"ఇది ఆట కాదు.. పక్కా హింస": విరుచుకుపడుతున్న నెటిజన్లు
{{/usCountry}}"బయట నుంచి చూసేవారికి ఇది కేవలం ఒక టాస్క్‌లా కనిపించవచ్చు. కానీ, లోపల అనుభవించిన ఆ భయంకరమైన నరకం నుంచి నేను ఇంకా కోలుకోలేదు" అని శగున్ శర్మ తన ఆవేదనను వెళ్లగక్కారు. మరో నటుడు గౌరవ్ ఖన్నా కూడా తన గాయాల ఫోటోలను షేర్ చేస్తూ.. "నా జీవితంలో అనుభవించిన అత్యంత దారుణమైన నరకం ఇది. టీవీలో చూస్తున్నప్పుడు కూడా ఆ నొప్పి మళ్లీ అనిపించింది" అని పేర్కొన్నారు.
"ఇది ఆట కాదు.. పక్కా హింస": విరుచుకుపడుతున్న నెటిజన్లు
{{/usCountry}}ఈ ఎపిసోడ్ ప్రసారమైన క్షణం నుంచే ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లలో నిర్వాహకాలపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. టీఆర్పీ రేటింగ్స్ కోసం మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
"ఆటల పేరిట కంటెస్టెంట్లను ఇలా ప్రత్యక్షంగా గాయపరచడం ఏ రకమైన వినోదం? ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు" అని ఒక నెటిజన్ తీవ్రంగా ఖండించారు. సాధారణంగా ప్రమాదవశాత్తు గాయపడటం వేరని, కానీ కావాలనే బుల్లెట్లతో కొట్టించి గాయపరచడం ఏ రకమైన క్రీడ అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
కలర్స్ టీవీ అండ్ జియో హాట్‌స్టార్ ఓటీటీలో
అసలు ఇటువంటి డేంజరస్ టాస్క్‌లకు చట్టపరంగా ఎలా అనుమతి ఇస్తారని నెటిజన్లు నిలదీస్తున్నారు. ప్రస్తుతం కలర్స్ టీవీ, జియో హాట్‌స్టార్‌లలో ఖత్రోన్ కే ఖిలాడీ 15 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
మరి ఈ షోపై వస్తున్న ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.