...
...
Next Story

Anandita Sundar: సర్జరీలు చేయించుకోలేదు, ఓజెంపిక్ వాడలేదు.. బరువు తగ్గడంపై హీరోయిన్ ఖుష్బూ సుందర్ కూతురు ఆనందిత ఆవేదన!

Anandita Sundar About Weight Loss: స్టార్ హీరోయిన్, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ కుమార్తె ఆనందిత సుందర్ బాడీ షేమింగ్, సోషల్ మీడియా ట్రోలింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బరువు తగ్గడం వెనుక సర్జరీలు లేదా ‘ఓజెంపిక్’ వంటి బరువు తగ్గించే ఇంజెక్షన్లు ఉన్నాయంటూ వస్తున్న రూమర్లపై ఆవేదన వ్యక్తం చేశారు.

Published on: Jun 18, 2026, 11:24:20 IST
Advertisement

Anandita Sundar About Weight Loss: ఒకప్పటి తెలుగు, తమిళ స్టార్ హీరోయిన్ ఖుష్బూ సుందర్, దర్శకుడు సుందర్ సి దంపతుల చిన్న కుమార్తె ఆనందిత సుందర్ సోషల్ మీడియా వేదికగా సాగుతున్న దుష్ప్రచారంపై గట్టిగా స్పందించారు.

మానసిక వేదనను

సర్జరీలు చేయించుకోలేదు, ఓజెంపిక్ వాడలేదు.. బరువు తగ్గడంపై హీరోయిన్ ఖుష్బూ సుందర్ కూతురు ఆనందిత ఆవేదన!
సర్జరీలు చేయించుకోలేదు, ఓజెంపిక్ వాడలేదు.. బరువు తగ్గడంపై హీరోయిన్ ఖుష్బూ సుందర్ కూతురు ఆనందిత ఆవేదన!

సెలబ్రిటీల పిల్లలుగా పుట్టడం వల్ల చిన్న వయసు నుంచే తాము ఎలాంటి మానసిక వేదనను అనుభవించాల్సి వస్తుందో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తాను లావుగా ఉన్నప్పుడు ఎగతాళి చేసిన వారే, ఇప్పుడు సన్నబడటంతో సర్జరీలు చేయించుకుందంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఏడేళ్ల కష్టం.. లాక్‌డౌన్ సమయంలోనే మార్పు!

జెఎఫ్‌డబ్ల్యు (JFW) పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆనందిత తన వెయిట్ లాస్ జర్నీని వివరించారు. చిన్నప్పటి నుంచి తాను, తన సోదరి అవంతిక కాస్త బొద్దుగా ఉండేవారమని, వయసు పెరుగుతున్న కొద్దీ ఊబకాయం (Obesity) వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నామని చెప్పారు. ఫిట్‌గా మారాలనే ఉద్దేశంతోనే 2018 నుంచి తాము కష్టపడటం ప్రారంభించామని స్పష్టం చేశారు.

అకస్మాత్తుగా బరువు తగ్గలేదు

"నేను అకస్మాత్తుగా బరువు తగ్గలేదనే విషయాన్ని చాలా మంది గమనించడం లేదు. 2018 లేదా 2019లో నా ఫిట్‌నెస్ జర్నీ మొదలైంది. ఈ రూపానికి రావడానికి నాకు ఏడేళ్ల సమయం పట్టింది. మధ్యలో కోవిడ్ లాక్‌డౌన్ రావడంతో నేను బరువు తగ్గుతున్న విషయాన్ని ఎవరూ చూడలేదు" అని ఆనందిత సుందర్ తెలిపారు.

"లాక్‌డౌన్ మూడు సంవత్సరాల కాలంలోనే నాలో పెద్ద మార్పు వచ్చింది. కానీ, జనాలు మాత్రం ఏదేదో ఊహించుకుని సర్జరీలు చేయించుకుందంటూ కథలు అల్లారు. మమ్మల్ని అసలు చూడకుండానే ఎలా ఒక నిర్ణయానికి వచ్చేస్తారు?" అని ఆనందిత ప్రశ్నించారు.

ఓజెంపిక్ రూమర్లపై నవ్వు వస్తోంది

"ఇప్పుడు నన్ను చూస్తున్న వారు ఓజెంపిక్, మౌంజారో వాడిందంటూ లేనిపోని కథలు సృష్టిస్తున్నారు. వాటిని చూస్తే నాకు నవ్వు వస్తోంది. సోషల్ మీడియాలో వచ్చే ద్వేషాన్ని ఎవరూ ఆపలేరని నాకు అర్థమైంది. నేను ఇతరులను సంతోషపెట్టడానికి బరువు తగ్గలేదు. కేవలం నా ఆరోగ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను" అని చెప్పుకొచ్చారు.

"15 ఏళ్ల వయసులో నాపై అంత దారుణంగా ద్వేషం చూపించినప్పుడు, వాళ్లు మాట్లాడుతోంది ఒక చిన్న పిల్లతో అనే విచక్షణ కూడా ఎవరికీ లేదు. మా తల్లిదండ్రులు సెలబ్రిటీలు. కానీ, నేను కాదు కదా! నన్ను అంత దారుణంగా బాడీ షేమింగ్ చేసే హక్కు మీకెక్కడిది?" అని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

మణిరత్నం వద్ద శిక్షణ.. క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఎంట్రీ

కేవలం సెలబ్రిటీల కూతురిగానే కాకుండా పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ఆనందిత శ్రమిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'పొన్నియిన్ సెల్వన్ 2' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ విభాగంలో ఆమె పనిచేశారు.

ఆ తర్వాత కమల్ హాసన్ నటించిన 'థగ్ లైఫ్' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరినప్పటికీ, కాలు ఫ్రాక్చర్ కావడంతో ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ గాయమే తనను మరింత ఆరోగ్యంగా, ఫిట్‌గా మారేలా ప్రేరేపించిందని ఆనందిత ఖుష్బూ తెలిపారు.

క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా

ఇటీవలే జూన్ 12న విడుదలైన 'డబుల్ ఆక్యుపెన్సీ' సినిమా ద్వారా ఆనందిత క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అశ్విన్ కందసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఖుష్బూ, ఎసిఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. దీనితో పాటు హిప్‌హాప్ తమీజా ఆది నటిస్తున్న 'మీసయ మురుక్కు 2' సినిమా పనుల్లో కూడా ఆనందిత ప్రస్తుతం బిజీగా గడుపుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe