...
...
Next Story

Kiara Advani: అదొక సుడిగుండంలా నన్ను లాగేస్తోంది, రొమాంటిక్ సీన్ తగ్గించమనడం పచ్చి అబద్ధం: టాక్సిక్ భామ కియారా అద్వానీ

Kiara Advani About Social Media Negativity And Toxic: టాక్సిక్ హీరోయిన్ కియారా అద్వానీ సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్, రూమర్లపై ఘాటుగా స్పందించారు. నెగెటివిటీకి దూరంగా ఉండటం ఎంత ముఖ్యమో వివరిస్తూనే, యశ్ సినిమా టాక్సిక్‌లో రొమాంటిక్ సీన్‌పై వస్తున్న వార్తలను కియారా అద్వానీ ఖండించారు.

Published on: May 11, 2026, 10:50:20 IST
Advertisement

Kiara Advani About Social Media Negativity And Toxic: గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్ల మీద రూమర్లు రావడం కొత్తేమీ కాదు. కానీ, కొన్నిసార్లు ఆ ప్రచారం హద్దులు దాటి మనశ్శాంతిని దెబ్బతీస్తుంది. తాజాగా ఇదే అంశంపై స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ మనసు విప్పారు.

అదొక సుడిగుండంలా నన్ను లాగేస్తోంది, రొమాంటిక్ సీన్ తగ్గించమనడం పచ్చి అబద్ధం: టాక్సిక్ భామ కియారా అద్వానీ
అదొక సుడిగుండంలా నన్ను లాగేస్తోంది, రొమాంటిక్ సీన్ తగ్గించమనడం పచ్చి అబద్ధం: టాక్సిక్ భామ కియారా అద్వానీ

రాజ్ శమానీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కియారా అద్వానీ సోషల్ మీడియాలో కనిపించే నెగెటివిటీ (Negativity) తనపై ఎలాంటి ప్రభావం చూపిందో వివరించారు. ఒక దశలో ఎదుటివారి అభిప్రాయాలే నిజమని నమ్మే స్థాయికి వెళ్లానని, కానీ ఇప్పుడు తన ఆలోచనా దృక్పథం పూర్తిగా మారిందని కియారా అద్వానీ పేర్కొన్నారు.

సెల్ఫ్ వ్యాలిడేషన్ ముఖ్యం

సోషల్ మీడియా ప్రభావం గురించి కియారా అద్వానీ మాట్లాడుతూ.. "ఖాళీ సమయం దొరికినప్పుడు ఫోన్ స్క్రోల్ చేస్తుంటే, నా అల్గారిథమ్‌లో వచ్చే చిన్నపిల్లల వీడియోలు మినహా మిగిలినవన్నీ నెగెటివిటీగానే కనిపిస్తున్నాయి. అదొక సుడిగుండంలా నన్ను లాగేస్తోంది. ఎదుటివారి అభిప్రాయం నా వ్యక్తిత్వాన్ని మార్చలేదు కదా అని నాకు నేను ప్రశ్నించుకున్నాను" అని చెప్పారు.

"ఎవరైనా ఏదైనా అంటే అది వారి అభిప్రాయం మాత్రమే అవుతుంది కానీ వాస్తవం (Fact) కాదు. ఈ విషయం నాకు 18 ఏళ్ల వయసులో తెలిసుంటే బాగుండేదనిపిస్తుంది. సమాజం నుంచి గుర్తింపు కోరుకోవడం కంటే, మనపై మనకు నమ్మకం ఉండటం (Self-validation) అన్నింటికంటే ముఖ్యం" అని కియారా అద్వానీ స్పష్టం చేశారు.

యశ్ సినిమా 'టాక్సిక్' రూమర్లపై సీరియస్

గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'టాక్సిక్' సినిమా కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందుతోంది. ఇందులో యశ్ ద్విపాత్రాభినయం (రాయా, టికెట్) చేస్తుండగా, కియారా అద్వానీ 'నాదియా' అనే పాత్రలో కనిపిస్తున్నారు. వీరితో పాటు నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి స్టార్ హీరోయిన్స్ నటిస్తున్నారు.

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న టాక్సిక్ చిత్రం విడుదలకు సంబంధించి అధికారిక తేదీ ఇంకా ఖరారు కాలేదు. గతంలో రెండుసార్లు వాయిదా పడటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. కియారా అద్వానీ 'టాక్సిక్' సినిమా గురించి ఏమన్నారు?

యశ్‌తో ఉన్న రొమాంటిక్ సీన్లను తగ్గించమని తాను కోరినట్లు వస్తున్న వార్తలను కియారా పూర్తిగా ఖండించారు. అవన్నీ కల్పిత గాథలని ఆమె స్పష్టం చేశారు.

2. 'టాక్సిక్' సినిమాలో కియారా పాత్ర పేరు ఏమిటి?

ఈ చిత్రంలో కియారా అద్వానీ 'నాదియా' అనే కీలక పాత్రలో నటిస్తున్నారు.

3. సోషల్ మీడియా నెగెటివిటీపై కియారా సలహా ఏమిటి?

ఎవరో ఇచ్చే రేటింగ్స్ లేదా అభిప్రాయాల కంటే, మన గురించి మనకు తెలిసిన నిజమే ముఖ్యమని, సెల్ఫ్ వ్యాలిడేషన్ అలవర్చుకోవాలని ఆమె సూచించారు.

4. 'టాక్సిక్' సినిమాలో యష్ పాత్ర ఏమిటి?

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ఈ చిత్రంలో రాయా, టికెట్ అనే రెండు భిన్నమైన పాత్రల్లో (Dual Role) కనిపిస్తారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe