Actor Satendra Soni Attacked By Director: భారతదేశం తరఫున ఆస్కార్ రేసుకు వెళ్లిన ‘లాపతా లేడీస్’ చిత్రంలో నటించిన యువ నటుడు సతేంద్ర సోని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు బాలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపుతోంది.
రెమ్యునరేషన్ ఇవ్వకుండా

మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న ఒక సినిమా షూటింగ్ సెట్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరిస్తూ సతేంజ్ర సోని ఇన్‌స్టాగ్రామ్‌లో కన్నీరు పెట్టుకున్నారు. సినిమా డైరెక్టర్ తనను చంపేస్తానని బెదిరించడమే కాకుండా, తనపై నడిరోడ్డుపై భౌతిక దాడికి దిగారని ఆయన ఆరోపించారు. కష్టపడి పని చేసినందుకు రెమ్యునరేషన్ అడిగితే ఇంతలా చిత్రహింసలు పెడతారా అంటూ సతేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.
రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తామన్నారు!
మధ్యప్రదేశ్‌లోని మైహర్ ప్రాంతంలో ‘పేడ్ పాల్కి’ అనే సినిమా షూటింగ్ కోసం సతేంద్ర సోని వెళ్లారు. ఈ చిత్రానికి ‘అజ్మీర్ 92’ ఫేమ్ పుష్పేంద్ర సింగ్ దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్‌కు వచ్చే ముందు సతేంద్రకు 50 వేల రూపాయల అడ్వాన్స్ ఇచ్చారు. మిగిలిన మొత్తాన్ని షూటింగ్ సమయంలో ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు.
మొత్తం 10 రోజుల షూటింగ్ షెడ్యూల్‌లో భాగంగా సతేంద్ర 8 రోజుల పాటు నటించారు. అయితే, తన బకాయిల గురించి దర్శకుడిని అడగడంతో వివాదం మొదలైంది. డబ్బులు ఇవ్వకపోగా, వెంటనే సామాన్లు సర్దుకుని 10 నిమిషాల్లో హోటల్ ఖాళీ చేసి వెళ్లాలని, లేదంటే చంపేస్తామని దర్శకుడు పుష్పేంద్ర సింగ్ తీవ్రంగా బెదిరించారు.
నడిరోడ్డుపై వెంటాడి కొట్టారు
ఆ సమయంలో అక్కడే ఉన్న పుష్పేంద్ర భార్య, ఆ సినిమా హీరోయిన్ ప్రగతి చౌహాన్ కూడా సతేంద్రను అసభ్య పదజాలంతో దూషించారు. దర్శకుడి బెదిరింపులకు భయపడిన సతేంద్ర సోని, తోటి నటులు శ్రీధర్ దూబే, పంకజ్ శర్మతో కలిసి హోటల్ నుంచి బయటకు వచ్చారు.
{{/usCountry}}ఆ సమయంలో అక్కడే ఉన్న పుష్పేంద్ర భార్య, ఆ సినిమా హీరోయిన్ ప్రగతి చౌహాన్ కూడా సతేంద్రను అసభ్య పదజాలంతో దూషించారు. దర్శకుడి బెదిరింపులకు భయపడిన సతేంద్ర సోని, తోటి నటులు శ్రీధర్ దూబే, పంకజ్ శర్మతో కలిసి హోటల్ నుంచి బయటకు వచ్చారు.
{{/usCountry}}వారు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, దర్శకుడు పుష్పేంద్ర సింగ్, ఆయన భార్య ప్రగతి చౌహాన్ కారులో వారిని వెంటాడారు. నడిరోడ్డుపై సతేంద్రను అడ్డగించి తీవ్రంగా కొట్టడం ప్రారంభించారు. "నన్ను కాపాడేందుకు ముందుకు వచ్చిన సహ నటుడు శ్రీధర్ దూబేపై కూడా వారు దాడి చేశారు" అని సతేంద్ర సోని ఆరోపించారు.
సరిగ్గా డబ్బులు ఇవ్వడం లేదని
పేడ్ పాల్కి షూటింగ్ యూనిట్‌లో ఎవరికీ సరిగ్గా డబ్బులు ఇవ్వడం లేదని సతేంద్ర తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు. సినీ ఇండస్ట్రీలో చిన్న నటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న సామాజిక దోపిడీకి, అభద్రతాభావానికి ఈ ఘటనే అద్దం పడుతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ముంబై చేరుకున్న నటుడు.. పోలీసులకు కృతజ్ఞతలు
ఈ భయానక సంఘటన నుంచి ఎలాగోలా తప్పించుకున్న సతేంద్ర సోని ప్రస్తుతం ముంబై చేరుకున్నారు. ముంబై రైల్వే స్టేషన్ నుంచి ఆయన మరొక వీడియోను షేర్ చేస్తూ తాము సురక్షితంగా ఉన్నామని ప్రకటించారు. తమకు సకాలంలో సహాయం అందించి ముంబై చేరేలా చూసిన మధ్యప్రదేశ్ పోలీసులకు, ఇతర మిత్రులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వీడియో చూసిన బాలీవుడ్ ప్రముఖులు, నెటిజన్లు సతేంద్రకు మద్దతుగా నిలుస్తున్నారు. బాధ్యులైన దర్శకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సతేంద్ర సోని బాలీవుడ్‌లో పలు క్రేజీ ప్రాజెక్టుల్లో చిన్నవైనా గుర్తింపు ఉన్న పాత్రల్లో నటించారు.
సతేంద్ర సోని సినీ ప్రస్థానం
ఆయుష్మాన్ ఖురానా ‘డాక్టర్ జి’, వరుణ్ ధావన్ ‘బవాల్’, నవాజుద్దీన్ సిద్ధిఖీ ‘రాత్ అకేలీ హై’ చిత్రాలతో పాటు ‘హలో బచ్చోన్’ అనే టెలివిజన్ షోలో మెరిశారు. కిరణ్ రావు దర్శకత్వంలో, అమీర్ ఖాన్ నిర్మాణంలో వచ్చిన ‘లాపతా లేడీస్’ చిత్రంతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది.
త్వరలోనే విడుదల కానున్న ఫర్హాన్ అఖ్తర్ నిర్మాణంలోని మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘మీర్జాపూర్: ది మూవీ’లో కూడా సతేంద్ర ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.