...
...
Next Story

OTT Spy: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన పాయల్ రాజ్‌పుత్ స్పై యాక్షన్ థ్రిల్లర్- మెకానిక్‌గా బతికే ఏజెంట్- 7.1 రేటింగ్- 4 భాషల్లో!

Payal Rajput Saravanan Leader OTT Release Today: ఓటీటీలోకి ఇవాళ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ లీడర్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. పాయల్ రాజ్‌పుత్, శరవణన్ యాక్షన్స్‌తో మెప్పించిన లీడర్ ఐఎమ్‌డీబీలో 7.1 రేటింగ్ సంపాదించుకుంది. మరి లీడర్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడ, ఏ భాషల్లో రిలీజ్ కానుందో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: May 29, 2026, 09:24:58 IST
Advertisement

OTT Spy Action Thriller Leader Streaming Today: బ్యూటిపుల్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ యాక్షన్‌తో అలరించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా లీడర్ (2026). ఈ సినిమాలో లెజెండ్ శరవణన్ హీరోగా చేశారు. థియేటర్లలో భారీ అంచనాలతో విడుదలైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లీడర్ ఓటీటీలోకి ఇవాళ (మే 29) వచ్చేసింది.

ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదల

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన పాయల్ రాజ్‌పుత్ స్పై యాక్షన్ థ్రిల్లర్- మెకానిక్‌గా బతికే ఏజెంట్- 7.1 రేటింగ్- 4 భాషల్లో!
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన పాయల్ రాజ్‌పుత్ స్పై యాక్షన్ థ్రిల్లర్- మెకానిక్‌గా బతికే ఏజెంట్- 7.1 రేటింగ్- 4 భాషల్లో!

గత ఏప్రిల్ నెల 3వ తేదీన థియేటర్లలో విడుదలైన లీడర్ చిత్రం యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్, భారీ మేకింగ్ వాల్యూస్‌తో సినిమా ప్రియుల్లో మంచి అంచనాలను రేకెత్తించింది. ప్రముఖ దర్శకుడు ఆర్. ఎస్. దురై సెంథిల్‌కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం యాక్షన్, సస్పెన్స్, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో పక్కా మాస్ ఫార్మాట్‌లో సాగుతుంది.

థియేటర్ రన్‌లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, చిత్రంలోని స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సులు, వేగంగా సాగే కథనం మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. తూత్తుకుడి నౌకాశ్రయంపై జరిగే ఒక భారీ దాడికి సంబంధించిన ప్రమాదకరమైన మిషన్‌ను ఛేదించే ఒక అండర్ కవర్ ఏజెంట్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.

మెకానిక్‌గా బతికే సీక్రెట్ ఏజెంట్

బయటి ప్రపంచానికి సాధారణ మెకానిక్‌గా జీవిస్తూనే, దేశాన్ని కాపాడేందుకు సదరు ఏజెంట్ చేసిన పోరాటం ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఈ సినిమాలో లెజెండ్ శరవణన్‌, పాయల్ రాజ్‌పుత్‌తోపాటు హాట్ బ్యూటీ ఆండ్రియా జెరెమియా, శ్యామ్, సంతోష్ ప్రతాప్ కీలక పాత్రల్లో నటించారు. ఫాదర్ సెంటిమెంట్, యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయని టాక్ వచ్చింది.

ప్రతి ఒక్క పాత్ర కథలో సస్పెన్స్‌ను, యాక్షన్‌ను ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించింది. భారీ బడ్జెట్‌తో, రిచ్ విజువల్స్‌తో కమర్షియల్ హంగులతో ఈ సినిమాను మలిచారు. ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు సినిమాకు ప్రధాన బలంగా నిలిచారు. ప్రముఖ సంగీత దర్శకుడు జిబ్రాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్లను మరో స్థాయికి తీసుకెళ్లాయి.

లీడర్ రేటింగ్ ఐఎమ్‌డీబీ

ఇలాంటి లీడర్ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడా వస్తుందా అని యాక్షన్ మూవీ లవర్స్‌ ఎదురుచూశారు. అలాంటి తరుణంలో ఇవాళ అంటే థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు లీడర్ ఓటీటీలోకి వచ్చేసింది. లీడర్ ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

అమెజాన్ ప్రైమ్‌లోనే లీడర్ ఓటీటీ రిలీజ్ అయింది. తమిళంతోపాటు తెలుగు, మలయాళం, కన్నడ వంటి నాలుగు భాషల్లో ప్రైమ్ వీడియోలో లీడర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో సౌత్ ఇండియా వ్యాప్తంగా లీడర్ ఓటీటీ ప్రీమియర్‌పై బజ్ క్రియేట్ అయింది. పాయల్‌తోపాటు శరవణన్ యాక్షన్ సీక్వెన్స్ ఎంజాయ్ చేయాలనుకునేవారు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోని ఈ లీడర్ మూవీని ఎంచక్కా ఆస్వాదించవచ్చు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe