Lokesh Kanagaraj Wamiqa Gabbi DC Trailer Released: టాలీవుడ్, కోలీవుడ్‌లో తనదైన మార్క్ యాక్షన్ సినిమాలతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా సరికొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. లోకేష్ కనగరాజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ మూవీ డీసీ (DC). తాజాగా డీసీ ట్రైలర్‌ను ఫ్రాన్స్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్‌గా విడుదల చేశారు.

వైవిధ్యభరితమైన చిత్రాల దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ లవ్ డ్రామాలో బ్యూటిపుల్ వామికా గబ్బి హీరోయిన్‌గా చేసింది. సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
'దేవదాస్, చంద్ర' కథ
మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ డీసీ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా సాగింది. ఇందులో లోకేష్ కనగరాజ్ 'దేవదాస్' పాత్రలో, వామికా 'చంద్ర' పాత్రలో కనిపించారు. ఈ ఇద్దరి పేర్లతోనే డీసీ అని టైటిల్ పెట్టినట్లుగా తెలుస్తోంది.
చంద్రను చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు కోల్‌కతాలో వ్యభిచార కూపంలోకి నెట్టేయడం, అక్కడ నుంచి ఆమె ప్రయాణం ఎలా సాగింది అనే కోణంలో కథ మొదలవుతుంది. దేవదాస్ ఒక పోలీస్ ఆఫీసర్‌ను చంపి పరారీలో ఉన్న నేరస్థుడిగా, చంద్ర ఒక డాక్టర్‌ని చంపినట్లుగా చూపించారు.
క్రిమినల్స్‌గా మారిన ఇద్దరు ప్రేమికులుగా ఎలా మారారు, వీరిద్దరి చుట్టూ పోలీసులు ఎలా వల పన్నారు, ఆ తర్వాత జరిగిన బాంబు పేలుళ్లు, యాక్షన్ సీక్వెన్సులు ట్రైలర్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. చివరలో సూర్యాస్తమయం వేళ ఒక కొండపై ఈ జంట నిలబడే దృశ్యంతో ట్రైలర్ ముగుస్తుంది. ఆ సీన్ ట్రైలర్ అంతటికి హైలెట్‌గా నిలిచింది.
రక్తం ఏరులై పారే యాక్షన్
అంతేకాకుండా ట్రైలర్లో రక్తం ఏరులైపారేంత వయోలెంట్ యాక్షన్ సీన్స్, లోకేష్, వామికలు కలిసి ఉన్న సీన్ ఒకటి కంటే ఎక్కువ లేకపోయిన వారిద్దరి మధ్య ఉండే ప్రేమను హత్తుకునేలా, కవ్వించేలా చూపించారు. అందుకు అనిరుధ్ బీజీఎమ్ ప్రాణం పోసిందనే చెప్పాలి. నేపథ్య సంగీతం ఓవైపు వయోలెన్స్‌ను మరోవైపు ప్రేమను ఫీల్ అయ్యేలా చేసింది.
లోకి ఇంటెన్సిటీ అదిరిపోయింది: దర్శకుడు పా రంజిత్
{{/usCountry}}అంతేకాకుండా ట్రైలర్లో రక్తం ఏరులైపారేంత వయోలెంట్ యాక్షన్ సీన్స్, లోకేష్, వామికలు కలిసి ఉన్న సీన్ ఒకటి కంటే ఎక్కువ లేకపోయిన వారిద్దరి మధ్య ఉండే ప్రేమను హత్తుకునేలా, కవ్వించేలా చూపించారు. అందుకు అనిరుధ్ బీజీఎమ్ ప్రాణం పోసిందనే చెప్పాలి. నేపథ్య సంగీతం ఓవైపు వయోలెన్స్‌ను మరోవైపు ప్రేమను ఫీల్ అయ్యేలా చేసింది.
లోకి ఇంటెన్సిటీ అదిరిపోయింది: దర్శకుడు పా రంజిత్
{{/usCountry}}ఈ ట్రైలర్ చూసిన ప్రముఖ దర్శకుడు పా రంజిత్ సోషల్ మీడియా వేదికగా చిత్రబృందాన్ని అభినందించారు. "DC ట్రైలర్ అద్భుతంగా ఉంది. దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ మార్క్ మేకింగ్, టేకింగ్ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తోంది. విజువల్స్, సౌండ్ డిజైన్ సినిమా మూడ్‌ను పర్ఫెక్ట్‌గా సెట్ చేశాయి" అని పా రంజిత్ పేర్కొన్నారు. లోకేష్ కనగరాజ్ నటనలో ఇంటెన్సిటీ బాగుందని, వామికా గబ్బి తన పాత్రకు పూర్తి న్యాయం చేసిందని ఆయన కొనియాడారు.
అనిరుధ్ మ్యూజిక్‌కు ఫిదా
ఈ ట్రైలర్‌కు అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. "హింస కూడా అనిరుధ్ సంగీతం వల్ల ఎంతో పొయెటిక్‌గా అనిపిస్తోంది" అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. లోకేష్ కనగరాజ్, రజనీకాంత్, విజయ్ సినిమాలకు అనిరుధ్ ఎప్పుడూ తన బెస్ట్ అవుట్‌పుట్ ఇస్తాడని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
గతంలో అరుణ్ మాథేశ్వరన్ తీసిన 'కెప్టెన్ మిల్లర్' తరహాలోనే ఈ సినిమాలోనూ సినిమాటోగ్రఫీ హైలైట్‌గా నిలవనుందని సినిమా విశ్లేషకులు భావిస్తున్నారు. వామికా నోట్లో గులాబీ పువ్వు పెట్టుకున్న సీన్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
మెగా ఫోన్ పక్కన పెట్టి.. మేకప్ వేసుకున్న లోకేష్
లోకేష్ కనగరాజ్ గతంలో 'మాస్టర్', 'సింగపూర్ సెలూన్' వంటి సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిశారు. శ్రుతి హాసన్ ప్రైవేట్ ఆల్బమ్ 'ఇనిమేల్'లోనూ నటించారు. అయితే పూర్తిస్థాయి హీరోగా ఆయనకు ఇదే మొదటి సినిమా. 2025లో రజనీకాంత్‌తో లోకేష్ 'కూలీ' తెరకెక్కించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం తెలుగులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఒక భారీ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టారు లోకేష్. ఈ క్రమంలో ఆయన హీరోగా నటిస్తున్న 'DC'పై తెలుగు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ 'G2' (గూఢచారి 2) లో నటిస్తున్న వామికా గబ్బి ఈ సినిమాతో మరింత పాపులారిటీ సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.