OTT Today: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు రొమాంటిక్ క్రైమ్ స్టోరీ- ఇన్సూరెన్స్ పాలసీల చుట్టూ సాగే కథ-స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Love Policy OTT Streaming: ఓటీటీలోకి ఇవాళ తెలుగు రొమాంటిక్ లవ్ క్రైమ్ కామెడీ స్టోరీ లవ్ పాలసీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీల చుట్టూ సాగే ఈ సినిమాలో పోలీస్ స్టేషన్‌కు పెళ్లి కొడుకు వెళ్లడం, తాను చేసిన నేరాన్ని ఒప్పుకోవడం వంటి అంశాలతో తెరకెక్కింది.
ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో చిన్న చిత్రాలకు, వైవిధ్యమైన కంటెంట్‌కు ఆదరణ పెరుగుతోంది. తెలుగులోనూ విభిన్న జోనర్లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు తెరకెక్కుతున్నాయి. ప్రతివారం సరికొత్తగా సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే ఇవాళ ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ లవ్ క్రైమ్ కామెడీ డ్రామా చిత్రం వచ్చేసింది.

ఇన్సూరెన్స్ పాలసీ చేయించే హీరో
ఆ సినిమానే లవ్ పాలసీ. టైటిల్‌కు తగ్గట్లుగానే సినిమా లవ్, పాలసీల చుట్టూ సాగుతుంది. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించే ఓ కంపెనీలో హీరో, హీరోయిన్ ఉంటారు. వారు ఇద్దరు ప్రేమించుకుంటారు. ఇన్సూరెన్స్ చేయించేందుకు హీరో తెగ తంటాలు పడుతుంటాడు. ఈ క్రమంలో ప్రజలను యాక్సిడెంట్ అయితే చనిపోతారంటూ భయబ్రాంతులకు గురి చేస్తుంటాడు.
చంపేందుకు కాంట్రాక్ట్
ఇన్సూరెన్స్ అంటే చస్తారని భయపెట్టడం కాదు మీరు చనిపోయాక కూడా కుటుంబానికి అండగా ఉండేది అని చెప్పడం అని హీరోకు హీరోయిన్ చెబుతుంది. ఇలా రొమాంటిక్‌గా సాగే వీరి లవ్‌లోకి ఓ చిన్న అనుమానం మొదలవుతుంది. ఆ అనుమానం ఏంటీ? పాలసీలు చేసే ఇన్సూరెన్స్ ఏజెంట్ ఒకరిని చంపేందుకు కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చాడు? అలా ఇచ్చినట్లు చెబుతూ పోలీసుల దగ్గర ఎందుకు లొంగిపోయాడు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే లవ్ పాలసీ చూడాల్సిందే.
పెళ్లి బట్టల్లో పోలీస్ స్టేషన్‌కు
ఇన్సూరెన్స్ ఎజెంట్ పెళ్లి బట్టల్లో పెళ్లి కొడుకులా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తానే ఒకరిని చంపేందుకు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు చెప్పే సన్నివేశం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అయితే, లవ్ పాలసీ సినిమాకు తేజ దర్శకత్వం వహించారు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సూపర్‌విజన్, నిర్మాతగా ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్ర రావు బాధ్యతలు నిర్వర్తించారు.
లవ్, క్రైమ్, రొమాన్స్, కామెడీ అంశాలు
అలాగే, శేఖర్ గంగనమోని సినిమాటోగ్రాఫర్‌గా చేయగా లవ్ పాలసీ సినిమాకు సాయి మధుకర్ సంగీతం అందించారు. సత్యానంద్ కథ అందించిన లవ్ పాలసీ చిత్రంలో రవి శివ తేజ, మంజు శ్రీ హీరో హీరోయిన్లుగా నటించారు. లవ్, క్రైమ్, రొమాన్స్, కామెడీ వంటి అంశాలతో మిళితమైన లవ్ పాలసీ ఓటీటీలోకి ఇవాళ (ఏప్రిల్ 5) వచ్చేసింది.
లవ్ పాలసీ ఓటీటీ స్ట్రీమింగ్
ప్రముఖ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో లవ్ పాలసీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం 31 నిమిషాల రన్‌టైమ్‌తో లవ్ పాలసీ ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, ఈటీవీ విన్ కథా సుధా వీక్లీ ఓటీటీ సిరీస్‌లో భాగంగా ప్రతి ఆదివారం అతి తక్కువ నిడివితో సరికొత్త తెలుగు సినిమాలను అందిస్తోన్న విషయం తెలిసిందే.
ఈటీవీ విన్ ఓటీటీ
ఈ నేపథ్యంలోనే ఇవాళ ఈటీవీ విన్ కథా సుధా సిరీస్‌లో భాగంగా లవ్ పాలసీ ఓటీటీ ప్రీమియర్ అవుతోంది. పాలసీలు, ఇన్సూరెన్స్,లవ్, కామెడీ, క్రైమ్, అనుమానం వంటి అంశాలతో సాగే తెలుగు సినిమా చూడాలనుకునేవారు ఈటీవీ విన్ ఓటీటీలోని లవ్ పాలసీపై లుక్కేయొచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


