ఓటీటీలో సినిమాలు చూసిన తర్వాత అందరి ఆసక్తి బుల్లితెర స్క్రీనింగ్‌పై ఉంటోంది. అందుకు తగినట్లుగానే ఓటీటీ రిలీజ్ అనంతరం సినిమాలను స్మాల్ స్క్రీన్‌పై టీవీ ప్రీమియర్ చేస్తున్నారు. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించే జీ తెలుగు ఎప్పటికప్పుడు కొత్త సినిమాలను విడుదల చేస్తోంది.
మామన్ వరల్డ్ టీవీ ప్రీమియర్

ఈ ఆదివారం కూడా మరో సరికొత్త సినిమాతో తెలుగు ఆడియెన్స్ ముందుకు రానుంది జీ తెలుగు. భావోద్వేగాల సమాహారంగా థియేటర్, ఓటీటీలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన మామన్ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ చేయనుంది.
తమిళంలో సూపర్ హిట్ అయిన మామన్ సినిమాను తెలుగు బుల్లితెరపై ప్రదర్శించనుంది జీ తెలుగు. అంటే, ఓటీటీ తర్వాత టీవీలో అది కూడా తెలుగు భాషలో మామన్ సినిమా ప్రీమియర్ కానుంది. కోలీవుడ్ నటుడు సూరి, బ్యూటిఫుల్ ఐశ్వర్య లక్ష్మి మామన్ సినిమాలో జంటగా నటించారు.
జీ తెలుగులో
మలయాళ బ్యూటి, తమ్ముడు మూవీ ఫేమ్ స్వాసిక హీరోకు అక్కగా కీలక పాత్ర పోషించింది. మామన్ సినిమాను ఈ ఆదివారం అంటే రేపు (నవంబర్ 30) జీ తెలుగులో ప్రసారం చేయనున్నారు. జీ తెలుగులో సాయంత్రం 6 గంటలకు మామన్ టీవీ ప్రీమియర్ కానుంది.
ఇక మామన్ కథ విషయానికొస్తే.. ఇన్బా(సూరి) కుటుంబానికి చాలా ప్రాధాన్య ఇస్తాడు. ఇన్బా అక్క గిరిజ(స్వాసిక)కు పెళ్లైన పదేళ్ల తర్వాత నీలన్ అలియాస్ లడ్డు (ప్రగీత్ శివన్) పుడతాడు. పుట్టినప్పటి నుంచి లడ్డు ఇన్బా దగ్గరే ఎక్కువగా ఉంటాడు. మామను అస్సలు విడిచిపెట్టి ఉండడు లడ్డు.
భార్యతో ఏకాంతంగా గడపనివ్వకుండా
ఇన్బా గైనకాలజిస్ట్ అయిన రేఖ (ఐశ్వర్య లక్ష్మి)ను పెళ్లి చేసుకున్న తర్వాత పరిస్థితి మారిపోతుంది. భార్యతో ఏకాంతంగా గడపాల్సిన సమయం కూడా లడ్డుతోనే గడిపేస్తున్న ఇన్బాను చూసి రేఖకు అసహనం కలుగుతుంది. ఫస్ట్ నైట్ టైమ్‌లో కూడా వాళ్ల మధ్య లడ్డునే ఉంటాడు.
{{/usCountry}}ఇన్బా గైనకాలజిస్ట్ అయిన రేఖ (ఐశ్వర్య లక్ష్మి)ను పెళ్లి చేసుకున్న తర్వాత పరిస్థితి మారిపోతుంది. భార్యతో ఏకాంతంగా గడపాల్సిన సమయం కూడా లడ్డుతోనే గడిపేస్తున్న ఇన్బాను చూసి రేఖకు అసహనం కలుగుతుంది. ఫస్ట్ నైట్ టైమ్‌లో కూడా వాళ్ల మధ్య లడ్డునే ఉంటాడు.
{{/usCountry}}ఇలా పెళ్లి తర్వాత లడ్డు వల్ల ఇన్బా-రేఖల మధ్య ఎందుకు గొడవలు జరుగుతాయి. ఆ గొడవలను ఇన్బా ఎలా పరిష్కరించాడు? లడ్డు-ఇన్బాల బంధాన్ని రేఖ అర్థం చేసుకుంటుందా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే మామన్ చూడాల్సిందే.
హీరోగా కమెడియన్ సూరి
మామ అల్లుడి బంధంతో మనసుకు హత్తుకునే సీన్లతో మామన్ తెరకెక్కింది. మామన్ సినిమాకు ప్రశాంత్ పాండియరాజ్ దర్శకత్వం వహించారు. తమిళంలో కమెడియన్‌గా పాపులర్ అయిన సూరి హీరోగా, బ్యూటిఫుల్ ఐశ్వర్య లక్షీ అతనికి జోడీగా చేయడం విశేషం.
ఈ ఇద్దరితోపాటు స్వాసిక, ప్రగీత్ శివన్, రాజ్‌కిరణ్, విజి చంద్రశేఖర్, బాబా మాస్టర్ మామన్ సినిమాలో ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. భావోద్వేగాలు, వినోదంతో ఆద్యంతం అలరించే మామన్ సినిమాను జీ తెలుగులో రేపు ఎంచక్కా వీక్షించవచ్చు.
జీ5 ఓటీటీలో కూడా
జీ తెలుగులో మాత్రమే కాకుండా జీ5లో మామన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో మామన్ ఓటీటీ రిలీజ్ అయింది. కాబట్టి, అటు జీ తెలుగు టీవీ ఛానెల్‌లో మరోవైపు జీ5 ఓటీటీలో మామన్ మూవీని చూసేయొచ్చు.