...
...
Next Story

వారణాసిలో శ్రీరాముడిలా మహేశ్ బాబు లుక్ నిజమేనా? రణ్‌బీర్ కపూర్‌తో పోలిక- ఆ నీడ చూస్తేనే పవర్ అర్థమవుతోందంటూ!

ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’లో మహేశ్ బాబు శ్రీరాముడిగా కనిపిస్తారన్న వార్త ఇప్పటికే సెన్సేషన్ సృష్టించింది. తాజాగా గుంటూరులోని ఒక థియేటర్ వద్ద మహేశ్ బాబు రాముడు లుక్ లీక్ అయిందంటూ ఓ పోస్టర్ సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. ఈ క్రమంలో పలువురి నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Published on: Feb 22, 2026, 11:15:55 IST
Advertisement

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ (Varanasi) సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి ఏ చిన్న వార్త వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతోంది.

ఏమిటా వైరల్ పోస్టర్?

వారణాసిలో శ్రీరాముడిలా మహేశ్ బాబు లుక్ నిజమేనా? రణ్‌బీర్ కపూర్‌తో పోలిక- ఆ నీడ చూస్తేనే పవర్ అర్థమవుతోందంటూ!
వారణాసిలో శ్రీరాముడిలా మహేశ్ బాబు లుక్ నిజమేనా? రణ్‌బీర్ కపూర్‌తో పోలిక- ఆ నీడ చూస్తేనే పవర్ అర్థమవుతోందంటూ!

తాజాగా, వారణాసి సినిమాలో మహేశ్ బాబు ‘శ్రీ రాముడి’ లుక్ లీక్ అయిందంటూ ఒక పోస్టర్ నెట్టింట హల్‌చల్ చేస్తోన్న విషయం తెలిసిందే. శనివారం (ఫిబ్రవరి 21) ‘ఆల్వేస్ బాలీవుడ్’ అనే ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ ఒక పోస్టర్‌ను షేర్ చేస్తూ.. గుంటూరులోని మైత్రి సినిమాస్ వద్ద ‘వారణాసి’ హోర్డింగ్‌పై మహేశ్ బాబు లుక్ దర్శనమిచ్చిందని పేర్కొంది.

ఆ పోస్టర్‌లో మహేశ్ బాబు కాషాయ వస్త్రాలు ధరించి, చేతిలో విల్లు, వెనుక అమ్ముల పొదతో ఒక కొండపై నిలబడి ఉన్నట్లు కనిపిస్తోంది. శ్రీరాముడి గంభీరమైన రూపంలో ఉన్న ఈ సిల్హౌట్ (Silhouette) చిత్రం చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

నిజం ఏంటి?

అయితే, ఈ పోస్టర్ రాజమౌళి టీమ్ అధికారికంగా విడుదల చేసింది మాత్రం కాదు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సినిమా విడుదల కావడానికి ఇంకా ఏడాది పైగా సమయం ఉండటమే కాకుండా, రాజమౌళి లాంటి దర్శకుడు అంత సులభంగా ఫస్ట్ లుక్‌ను లీక్ చేయరని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎక్స్ ఏఐ (Grok) కూడా దీనిపై స్పందిస్తూ.. ఇది అనధికారిక చిత్రమని, టీమ్ నుంచి ఎలాంటి ధృవీకరణ లేదని స్పష్టం చేసింది. చాలా మంది ఇది అభిమానులు తయారు చేసిన (Fan-made) పోస్టర్ లేదా ఏఐ (AI) సృష్టించిన చిత్రం కావచ్చని కొట్టిపారేస్తున్నారు.

రణ్‌బీర్ కపూర్‌తో పోలికలు

"రాజమౌళి విజన్ ప్రకారం ఈ స్కేల్ చాలా పెద్దగా ఉంటుంది, కేవలం ఆ నీడను చూస్తేనే పవర్ అర్థమవుతోంది" అని కొందరు మహేశ్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, గతేడాది నవంబర్‌లో రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో రాజమౌళి వారణాసి టైటిల్, కాన్సెప్ట్ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.

వారణాసి విశేషాలు

వారణాసి సినిమా సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్, రామాయణ ఇతిహాసాల కలయికగా ఉండనుందని ఆ కాన్సెప్ట్ వీడియో ద్వారా అర్థమవుతోంది. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా చేస్తుండగా.. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ‘వారణాసి’ 2027 ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks