వారణాసి సినిమాలో తన కో స్టార్ ప్రియాంక చోప్రాపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు కురిపించాడు. ఆమె లీడ్ రోల్ ప్లే చేసిన ‘ది బ్లఫ్’ మూవీ రివ్యూను మహేష్ ఎక్స్ లో పంచుకున్నాడు. యాక్షన్ రోల్ లో ప్రియాంక చోప్రా అదరగొట్టిందని పేర్కొన్నాడు.
మహేష్ బాబు ది బ్లఫ్ రివ్యూ

డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘ది బ్లఫ్’ మూవీ చూసి మహేష్ బాబు ఇంప్రెస్ అయ్యాడు. ఇందులో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా యాక్టింగ్ కు ఫిదా అయ్యాడు. ఈ సినిమాపై తన రివ్యూను ఎక్స్ లో పంచుకున్నాడు.
"ఆకట్టుకునే యాక్షన్ & ఎమోషన్స్‌తో చక్కగా తెరకెక్కించిన సినిమా ది బ్లఫ్. ప్రియాంక చోప్రా అదరగొట్టింది. ఆత్మవిశ్వాసంతో చేసింది. అద్భుతమైన ప్రదర్శనతో అన్ని విధాలుగా సత్తాచాటింది. అమేజింగ్ గా పని చేసిన ఆ టీమ్ మొత్తానికి నా ప్రేమను పంపుతున్నా’’ అని ఎక్స్ పోస్టులో మహేష్ బాబు రాసుకొచ్చాడు.
'ది బ్లఫ్' గురించి
ఫ్రాంక్ ఈ ఫ్లవర్స్ దర్శకత్వం వహించిన పైరేట్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ ది బ్లఫ్ లో ప్రియాంక చోప్రా లీడ్ రోల్ ప్లే చేసింది. ఈ సినిమాలో ప్రియాంకతో పాటు కార్ల్ అర్బన్, ఇస్మాయిల్ క్రూజ్ కార్డోవా, సాఫియా ఓక్లీ-గ్రీన్, టెమురా మోరిసన్ తదితరులు నటించారు. ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అయింది. ఫిబ్రవరి 26 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ట్రెండింగ్ నంబర్ 2లో ఈ సినిమా ఉంది.
ప్రియాంక చోప్రా సినిమాలు
{{/usCountry}}ఫ్రాంక్ ఈ ఫ్లవర్స్ దర్శకత్వం వహించిన పైరేట్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ ది బ్లఫ్ లో ప్రియాంక చోప్రా లీడ్ రోల్ ప్లే చేసింది. ఈ సినిమాలో ప్రియాంకతో పాటు కార్ల్ అర్బన్, ఇస్మాయిల్ క్రూజ్ కార్డోవా, సాఫియా ఓక్లీ-గ్రీన్, టెమురా మోరిసన్ తదితరులు నటించారు. ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అయింది. ఫిబ్రవరి 26 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ట్రెండింగ్ నంబర్ 2లో ఈ సినిమా ఉంది.
ప్రియాంక చోప్రా సినిమాలు
{{/usCountry}}ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ అడ్వెంచరస్ మూవీ ‘వారణాసి’లో నటిస్తోంది. ఈ సినిమాతో ఇండియన్ మూవీ ఇండస్ట్రీలోకి ప్రియాంక రీ ఎంట్రీ ఇస్తోంది. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్. వారణాసి మూవీ ఏప్రిల్ 7, 2027న థియేటర్లలో రిలీజ్ కానుంది.
వారణాసి షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం జార్జియాలో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. వారణాసి చిత్రం టైమ్ ట్రాటర్, గ్లోబ్ ట్రాటర్ గా తెరకెక్కుతోంది. వివిధ కాలాలు, వివిధ ప్రాంతాల్లో ఈ సినిమా స్టోరీ సాగనుంది. దీనికి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఫస్ట్ మూవీ ఇదే. ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.