...
...
Next Story

Makutam OTT: ఓటీటీలోకి విశాల్, అంజలి మకుటం- దర్శకుడిగా మారిన హీరో, ద్విపాత్రాభినయం- 6 రేటింగ్- 4 భాషల్లో స్ట్రీమింగ్!

Vishal Makutam OTT Streaming: తమిళ హీరో విశాల్ స్వీయ దర్శకత్వం వహించి, ద్విపాత్రాభినయం చేసిన రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మకుటం ఓటీటీలోకి వచ్చేయనుంది. అంజలి, దుషారా విజయన్ హీరోయిన్స్‌గా చేసిన ఈ సినిమాకు 6 రేటింగ్ దక్కింది. మరి మకుటం ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Aug 20, 2026, 06:21:28 IST
Advertisement

Vishal Anjali Makutam OTT Release: తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని హీరో విశాల్. విభిన్నమైన యాక్షన్ కథలతో మాస్ ఆడియెన్స్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, తొలిసారి మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించిన చిత్రం 'మకుటం'. ఈ సినిమాలో విశాల్‌కు జోడీగా అంజలి, దుషారా విజయన్ హీరోయిన్స్‌గా నటించారు.

ఓటీటీలోకి మకుటం

ఓటీటీలోకి విశాల్, అంజలి మకుటం- దర్శకుడిగా మారిన హీరో, ద్విపాత్రాభినయం- 6 రేటింగ్- 4 భాషల్లో స్ట్రీమింగ్!
ఓటీటీలోకి విశాల్, అంజలి మకుటం- దర్శకుడిగా మారిన హీరో, ద్విపాత్రాభినయం- 6 రేటింగ్- 4 భాషల్లో స్ట్రీమింగ్!

సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాణంలో తెరకెక్కిన తెలుగు, తమిళ రివేంజ్ యాక్షన్ డ్రామా మకుటం ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా తనదైన మార్క్ చూపించాలని విశాల్ చేసిన ప్రయత్నం మకుటం ఓటీటీ రిలీజ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

అసలు కథేంటంటే?

చెన్నైలో నీతి నిజాయతీలతో బతికే ఒక సాధారణ మెడికల్ రిప్రెజెంటేటివ్ కృపాకరం (విశాల్). భార్య జమున (దుషారా విజయన్), ఇద్దరు పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. మామగారి కోరిక మేరకు కష్టపడి సెకండ్ హ్యాండ్ కారు కొని, కుటుంబాన్ని ఊటీ విహారయాత్రకు తీసుకెళ్తాడు. సరిగ్గా అక్కడే దుండగులు అతడి కారుపై దారణంగా కాల్పులు జరుపుతారు. ఈ ఘోర దాడిలో కృపాకరం తన భార్యాపిల్లలను కోల్పోతాడు.

తీవ్ర విషాదంలో ఉన్న కొడుకుని పరామర్శించడానికి విశాఖపట్నం పోర్టును శాసించే డాన్, కృపాకరం తండ్రి లింగ (విశాల్) వస్తాడు. అయితే తండ్రిని చూడగానే కృపాకరం కోపంతో రగిలిపోతాడు. తన భార్యాపిల్లల చావుకు తండ్రే కారణమని ఆరోపిస్తాడు.

ట్విస్టులు

అసలు తండ్రీకొడుకుల మధ్య ఉన్న విభేదాలేంటి? లింగ భార్య అన్నపూర్ణ (అంజలి) ఎలా చనిపోయింది? ఈ గ్యాంగ్‌స్టర్ గొడవల్లోకి సాధారణ మెడికల్ రిప్రజెంటేటివ్ కుటుంబం ఎలా బలవుతుందనేదే మిగతా కథ.

దీనికి తోడు దాదాపు మూడు గంటల సుదీర్ఘ నిడివి ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్షగా మారింది. తొలిభాగంలో కృపాకరం కుటుంబ పరిస్థితి, అప్పులు, కారు కొనే సన్నివేశాలను సాగదీయడంతో కథనంలో వేగం తగ్గింది. ఆ తర్వాత ఊటీలో జరిగే దాడితో కథ కాస్త వేగం పుంజుకుంటుంది.

తండ్రి లింగ ఎంట్రీతో 'బాషా' రేంజ్ మాస్ ఎలివేషన్లు ఉంటాయని ఆశపడే ప్రేక్షకుడికి, ఫ్లాష్‌బ్యాక్ డ్రామా తీవ్ర నిరాశను మిగుల్చుతుంది. అంజలి, లింగల మధ్య వచ్చే లవ్ స్టోరీ ఎపిసోడ్లు పాతకాలపు సీరియల్‌ను తలపిస్తాయి.

కొత్త పాయింట్ ఉన్నా.. వాడుకోని దర్శకుడు!

చైనా నుంచి దిగుమతి అయ్యే నకిలీ గూడ్స్ వల్ల దేశానికి జరిగే నష్టం, దాని చుట్టూ తిరిగే పోర్ట్ మాఫియా అనే ఒక సరికొత్త పాయింట్‌ను కథలో జోడించినప్పటికీ, దానిపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోయారు. రొటీన్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలాగే సినిమా సాగుతుంది. అయితే క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ హంగామా మాత్రం మాస్ ప్రేక్షకులను, యాక్షన్ ప్రియులను బాగానే అలరిస్తుందని రివ్యూస్ వచ్చాయి.

అయితే, నటుడిగా విశాల్ ద్విపాత్రాభినయంలో కృపాకరం, లింగ పాత్రల మధ్య వైవిధ్యం చూపిస్తూ మెప్పించారని ప్రశంసలు దక్కాయి. కానీ దర్శకుడిగా మాత్రం లింగ పాత్రను మరింత బలంగా మలచడంలో విఫలమయ్యారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం యాక్షన్ ఘట్టాలకు ప్రాణం పోసింది.

మకుటం ఓటీటీ స్ట్రీమింగ్

ఇక ఐఎమ్‌డీబీలో మకుటం సినిమాకు 6 రేటింగ్ దక్కించుకుంది. ఇలాంటి మకుటం ఓటీటీలోకి వచ్చేయనుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ మకుటం ఓటీటీ హక్కులను దక్కించుకుంది. అమెజాన్ ప్రైమ్‌లో మకుటం ఓటీటీ రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 4 నుంచి తెలుగు, తమిళం, కన్నడ వంటి 4 భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో మకుటం ఓటీటీ స్ట్రీమింగ్ అవనుందని సమాచారం.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks