...
...
Next Story

Mammootty: కొడుకు సినిమాలో తండ్రికి మోసం, ఆ పాత్రకు భారీ రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే.. మెగాస్టార్ మమ్ముట్టి కామెంట్స్

Mammootty About Lokah Moothon Role: కొడుకు దుల్కరల్ సల్మాన్ నిర్మించిన లోకా సినిమాలో తనను మోసం చేసి ఇరికించారని మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఒకవేళ లోకా 2లో తను పూర్తి పాత్ర చేయాలంటే భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చుకోవాలని, అది వారిని షాక్ చేస్తుందని మమ్ముట్టి అన్నారు.

Published on: Apr 10, 2026, 10:30:10 IST
Advertisement

గతేడాది మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన సూపర్ హీరో మూవీ 'లోకా' సీక్వెల్‌పై మెగాస్టార్ మమ్ముట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు దుల్కర్ సల్మాన్ తనను మోసం చేశాడని, పార్ట్-2లో నటించాలంటే భారీ రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందేనని మమ్ముట్టి వ్యాఖ్యానించారు.

తండ్రి గొంతు.. కొడుకు నిర్మాణం

కొడుకు సినిమాలో తండ్రికి మోసం, ఆ పాత్రకు భారీ రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే.. మెగాస్టార్ మమ్ముట్టి కామెంట్స్
కొడుకు సినిమాలో తండ్రికి మోసం, ఆ పాత్రకు భారీ రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే.. మెగాస్టార్ మమ్ముట్టి కామెంట్స్

డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో కల్యాణి ప్రియదర్శన్, నస్లెన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'లోకా చాప్టర్ 1: చంద్ర' బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాను దుల్కర్ సల్మాన్ స్వయంగా నిర్మించడమే కాకుండా, అందులో 'ఓడియన్' అనే కీలక పాత్రలో కూడా మెరిశారు.

అయితే ఈ సినిమాలో అత్యంత శక్తివంతమైన 'మూతోన్' పాత్రకు వినిపించే గొంతు దుల్కర్ తండ్రి, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టిది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ పాత్ర వెనుక ఉన్న అసలు రహస్యాన్ని మమ్ముట్టి బయటపెట్టారు. లోకా సినిమాలో మూతోన్ పాత్రకు వాయిస్ ఇవ్వడం గురించి మమ్ముట్టి మాట్లాడుతూ.. అసలు తాను ఆ సినిమాలో ఉన్నాననే విషయం తనకు తెలియదని నవ్వుతూ చెప్పారు.

"నన్ను మోసం చేశారు": మమ్ముట్టి

"మొదట దుల్కర్ నా దగ్గరికి రాలేదు. తన మేనేజర్, స్నేహితుడు వచ్చి కేవలం ఒక్క డైలాగ్‌కు వాయిస్ ఇవ్వమని అడిగారు. నేను కేవలం 'వద్దు' (Venda) అని మాత్రమే చెప్పాను. సినిమాలో కనిపించే చేయి కూడా నాది కాదు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక, అది నేనే అని ప్రచారం చేశారు. నిజం చెప్పాలంటే నన్ను మోసం చేసి ఆ పాత్రలో ఇరికించారు" అని మమ్ముట్టి సరదాగా గుర్తుచేసుకున్నారు.

సీక్వెల్‌లో నటించాలంటే భారీ ఫీజు ఉండాల్సిందే!

ఇదిలా ఉంటే, తెలుగు ప్రేక్షకులకు 'హనుమాన్' లాంటి సూపర్ హీరో చిత్రాలు ఎలాగో, మలయాళంలో 'లోకా' అలాంటి ఒక జానపద, అతీంద్రియ శక్తుల కలయిక. ఇందులో చంద్ర (కల్యాణి ప్రియదర్శన్)ది ఒక యక్షిణి పాత్ర. మైఖేల్ (టొవినో థామస్) చాప్టర్ 2లో కథానాయకుడు. ఒక సామాన్య మానవుడిలా కనిపించే రాక్షస శక్తి అతను.

సినిమా రేంజ్ మారిపోవడం ఖాయం

ఇక చార్లీ (దుల్కర్ సల్మాన్) రూపం మార్చుకోగల శక్తి ఉన్న ఓడియన్. ఇలా స్టార్ నటీనటులు, డిఫరెంట్ పాత్రలతో ఉండే లోకా అనే అద్భుత ప్రపంచంలో మూతోన్ పాత్రే అందరికీ నాయకుడు. మమ్ముట్టి ఈ పాత్రను పూర్తిస్థాయిలో పోషిస్తే సినిమా రేంజ్ మారిపోవడం ఖాయంగా తెలుస్తోంది.

పేట్రియాట్ రిలీజ్

ప్రస్తుతం మమ్ముట్టి తన తదుపరి భారీ మల్టీస్టారర్ 'పేట్రియాట్' (Patriot) మూవీ విడుదలకు సిద్ధమవుతున్నారు. మే 1న విడుదల కానున్న ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, పుష్ప విలన్ ఫహద్ ఫాజిల్, లేడి సూపర్ స్టార్ నయనతార వంటి దిగ్గజాలు నటిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe